హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia-Ukraine War: ఆంక్షలతో దెబ్బతిన్న రష్యా యుద్ధ ట్యాంక్‌ల ఉత్పత్తి.. అయినా తగ్గేదేలే..!

Russia-Ukraine War: ఆంక్షలతో దెబ్బతిన్న రష్యా యుద్ధ ట్యాంక్‌ల ఉత్పత్తి.. అయినా తగ్గేదేలే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆర్థిక ఆంక్షలు, దిగుమతి పరిమితుల కారణంగా తమ సైన్యం కోసం మరిన్ని ట్యాంకులను ఉత్పత్తి చేయలేని స్థితిలో రష్యా(Russia) ఉంది. T-90, T-72, T-14 అర్మాటా వంటి ట్యాంకులను తయారుచేస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద యుద్ధ ట్యాంక్(Tank) తయారీదారు రష్యన్‌ సంస్థ ఉరల్‌వాగన్‌జావోడ్.

ఇంకా చదవండి ...

ఆర్థిక ఆంక్షలు, దిగుమతి పరిమితుల కారణంగా తమ సైన్యం కోసం మరిన్ని ట్యాంకులను ఉత్పత్తి చేయలేని స్థితిలో రష్యా(Russia) ఉంది. T-90, T-72, T-14 అర్మాటా వంటి ట్యాంకులను తయారుచేస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద యుద్ధ ట్యాంక్(Tank) తయారీదారు రష్యన్‌ సంస్థ ఉరల్‌వాగన్‌జావోడ్. బిలియన్ల డాలర్ల(Billions Dollars) ఆదాయం(Income) ఉన్నా.. ఆంక్షల నేపథ్యంలో కంపెనీకి ట్యాంకులను ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గింది. రుణాలపై వడ్డీ రేట్లు(Interest Rates) పెరగడం, విదేశీ కరెన్సీ(Currency) రుణాలకు నిధుల కొరత, మెటీరియల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా ట్యాంకుల కొరతను ఎదుర్కొంటుందా అనే విషయానికి వస్తే.. T-72 ట్యాంక్‌ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్(GUR) ప్రకటించింది. T-90, T-14 అర్మాటాస్ ట్యాంకుల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయిందని నివేదికలో పేర్కొంది. T-14 అర్మాటా సీరియల్ ప్రొడక్షన్, డెలివరీ ఈ సంవత్సరం ప్రారంభం కానున్నందున రష్యాకు ఎదురుదెబ్బ. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడికి ముందే ఉత్పత్తి సమస్యలు ప్రారంభమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి.

UK PM : ఎన్నాళ్లకెన్నాళ్లకు..భారత పర్యటనకు బోరిస్ జాన్సన్..నేరుగాగుజరాత్ కే

ఏప్రిల్‌లో యుద్ధనౌకలను నిర్మించలేకపోయిన కొన్ని రష్యన్ షిప్‌యార్డ్‌లు, ఓడల నిర్వహణ కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. రెండు ట్యాంకర్లు, క్షిపణి పడవలు, ఇతర ఓడల మరమ్మతుకు 25 బిలియన్ రూబిళ్లు విలువైన ప్రభుత్వ ఒప్పందాన్ని వ్లాడివోస్టాక్ షిప్‌యార్డ్ అందుకోలేకపోయిందని నివేదికలు తెలుపుతున్నాయి. రష్యన్ మిలిటరీ, పరిశ్రమలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్న అత్యాధునిక సాంకేతికతపై ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ ఆధారపడ్డాయి. టెక్నాలజీ సరఫరా లేక ఆధునిక ఆయుధాల ఉత్పత్తిని రష్యా కొనసాగించలేకపోయిందని విశ్లేషకులు అంటున్నారు.

T-14 అర్మాటాస్ నాటోకు ముప్పుగా ఉందా..?

అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో తయారైన T-14 అర్మాటా ట్యాంకుల కారణంగా పశ్చిమ దేశాలలో ఆందోళనలు పెరిగాయి. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో భారీ కవచం, మానవరహిత టరెంట్, టచ్‌స్క్రీన్ సదుపాయాల కల్పన.. బిల్ట్‌ఇన్‌ ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ సిస్టమ్‌తో T-14 అర్మాటాస్, కొత్త T-90 ట్యాంకుల అనుసంధానం.. రాత్రి వేళల్లో లక్ష్యాలను గుర్తించేలా ఉపయోగపడనున్న రష్యన్‌ ట్యాంకులలోని అధునాతన సాఫ్ట్‌వేర్ ఉంది. తూర్పు ఐరోపాలో తమ స్థితిని దెబ్బతీస్తుందని, బాల్టిక్స్ భద్రతకు ముప్పు కలిగించవచ్చని NATO కమాండర్లు భయపడ్డారు. T-14 అర్మాటాతో ఒక కొత్త ప్రధాన భూ పోరాట వ్యవస్థను కలిసి అభివృద్ధి చేయాలని జర్మనీ, ఫ్రాన్స్‌ భావించాయి.

ఎక్కువ ట్యాంక్‌లను రష్యా ఎందుకు కోల్పోతోంది..?

ఇప్పటివరకు ఉక్రెయిన్‌లో 460 కంటే ఎక్కువ ట్యాంకులు, 2,000 పైగా ఇతర సాయుధ వాహనాలు రష్యా కోల్పోయిందని నివేదికలు చెబుతున్నాయి. రాండ్ కార్పొరేషన్, IISS ప్రకారం.. యుద్ధం ప్రారంభమైనప్పుడు రష్యా వద్ద 2,700 ప్రధాన యుద్ధ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. రష్యాకు చెందిన ట్యాంకులను ఉక్రెయిన్‌ రైతులు ట్రాక్టర్‌లతో లాగడం చూశామని సెయింట్‌ ఆండ్రూస్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ ఫిలిప్స్‌ ఓబ్రియన్‌ చెప్పడం గమనార్హం.


Business Idea: ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్... రూ.70,000 పెట్టుబడి చాలు

ఇంధనం అయిపోయి, లాజిస్టిక్స్‌ సమస్యలు, బురదలో కూరుకుపోవడం వంటి సమస్యలతో ట్యాంకులు వదిలేశారని ఫిలిప్స్‌ తెలిపాడు. జావెలిన్, ఇతర యాంటీ ట్యాంక్‌ మిసైల్స్‌తో రష్యన్ ట్యాంకులపై దాడులు ఉక్రెయిన్ దళాలు చేస్తున్నాయి. వదిలివేసిన సైనిక వాహనాలను వినియోగించుకోమని ప్రజలకు ఉక్రెయిన్‌ అధికారులు సూచించారు. ఇన్ని ఎదురుదెబ్బలు ఎదురైనా ఇప్పటికీ గణనీయమైన వాహనాల సరఫరాతో భారీ సైన్యాన్ని రష్యా కలిగి ఉంది.

First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు