హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Charles Sobhraj : నేపాల్ జైలు నుంచి విడుదల..20 ఏళ్ల తర్వాత తిరిగి ఫ్రాన్స్ కి సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్

Charles Sobhraj : నేపాల్ జైలు నుంచి విడుదల..20 ఏళ్ల తర్వాత తిరిగి ఫ్రాన్స్ కి సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్

Image credit : AFP

Image credit : AFP

Charles Sobhraj : 1970లలో ఆసియా వ్యాప్తంగా అనేక హత్యలకు కారణమైన ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్(French Serial Killer) చార్లెస్ శోభరాజ్ (77) జైలు నుండి విడుదలయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Charles Sobhraj : 1970లలో ఆసియా వ్యాప్తంగా అనేక హత్యలకు కారణమైన ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్(French Serial Killer) చార్లెస్ శోభరాజ్ (77) జైలు నుండి విడుదలయ్యారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి నేపాల్ సెంట్రల్ జైలులో(Nepal Central Jail) శిక్ష అనుభవిస్తున్న చార్లెస్‌ శోభరాజ్‌(Charles Sobhraj)  వృద్ధుడు కావడంతో ఆరోగ్య కారణాల రీత్యా అతడి విడుదలకు నేపాల్ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నేపాల్‌లో 75 శాతం శిక్ష అనుభవించిన ఖైదీలు జైలులో మంచి ప్రవర్తనతో మెలిగితే వారిని విడుదల చేసేందుకు చట్టపరమైన నిబంధన ఉంది. నేపాల్‌ లోని సీనియర్‌ సిటిజన్‌లకు ఇచ్చిన సడలింపు ప్రకారం తాను జైలు శిక్షను పూర్తి చేశానని ఛార్లెస్‌ శోభరాజ్ నేపాల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన వయసు, అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని విడుదల చేయాలంటూ చార్లెస్ శోభరాజ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు సపాన ప్రధాన్ మల్లా, టిల్ ప్రసాద్ శ్రేష్ఠతో కూడిన ఉమ్మడి ధర్మాసనం.. మరో కేసులో జైలుకు వెళ్లనవసరం లేకుంటే అతడిని విడుదల చేయాలని,15 రోజుల్లోగా అతడు తన దేశం ఫ్రాన్స్ కి తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో దాదాపు 20 సంవత్సరాల నేపాల్ జైలు శిక్ష తర్వాత శనివారం ఉదయం చార్లెస్ శోభరాజ్ ఫ్రాన్స్ చేరుకున్నారు. శనివారం ఉదయం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లోచార్లెస్ శోభరాజ్ దిగినట్లు AFP రిపోర్టర్ ధృవీకరించారు. పారిస్‌కు చేరుకున్నప్పుడు అతన్ని అదనపు "గుర్తింపు తనిఖీల" కోసం సరిహద్దు పోలీసులు తీసుకెళ్లారని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అన్ని తనిఖీలు నిర్వహించిన తర్వాత అతను ఎయిర్‌పోర్ట్ నుంచి విడిచిపెట్టినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి

ఛార్లెస్‌ శోభరాజ్.. తన జీవితంలో 20కి పైగా హత్యలకు పాల్పడ్డాడు. నీటిలో ముంచడం, గొంతు నులిమి చంపడం, కత్తితో పొడవడం చేసేవాడు. బీచ్‌లలో బికినీ ధరించిన టూరిస్ట్ అమ్మాయిలను ఎక్కువగా చంపేవాడు. దీంతో చార్లెస్‌ను బికినీ కిల్లర్ అని కూడా పిలుస్తారు. భారత్, నేపాల్, మయన్మార్, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, గ్రీస్, టర్కీ సహా తొమ్మిది దేశాల పోలీసులు చార్లెస్ కోసం గాలించిన సందర్భాలున్నాయి. పోలీసులు కన్ను గప్పడం,వారికి లంచాలు ఎర వేసి పారిపోవడంలో చార్లెస్‌ సిద్ధహస్తుడు. పోలీసుల వల నుంచి పాముల జారి పోయేవాడు అని ప్రసిద్ధి. ఇక తన నేరాలకు సంబంధించి చార్లెస్‌ నాలుగు దేశాల్లో మాత్రమే ఎక్కువకాలం ఖైదీగా జీవితాన్ని కొనసాగించాడు.

Covid Updates : చైనాలో ఒక్కరోజే 3.7 కోట్ల కరోనా కేసులు.. నిజమేనా?

చార్లెస్ శోభరాజ్..1944లో భారత పౌరుడికి, వియత్నాం పౌరురాలికి సైగొన్(Saigon)సిటీలో జన్మించాడు. అతడి పూర్తి పేరు హాత్‌చంద్‌ భావ్‌నాని గురుముఖ్‌ చార్లెస్‌ శోభరాజ్‌ అతడి చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత చార్లెస్‌ తల్లి.. ఓ ఫ్రెంచ్‌ వ్యక్తిని వివాహం చేసుకుంది. అతడు చార్లెస్‌ని దత్తత తీసుకున్నాడు. కానీ వారికి సంతానం కలిగిన తర్వాత చార్లెస్‌ను నిర్లక్ష్యం చేయసాగారు. ఈ నేపథ్యంలో చార్లెస్ శోభరాజ్.. నేర ప్రపంచంవైపు అడుగులు వేశాడు. చిన్న చిన్న నేరాలకు పాల్పడతూ మొదటిసారి 1963 లో పారిస్ సమీపంలోని పాయిసీ జైలులో తన మొదటి జైలు శిక్ష అనుభవించాడు. చార్లెస్ శోభరాజ్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ 9 దేశాల్లో నేరాలకు పాల్పడ్డాడు. వీటిల్లో మన దేశం కూడా ఉంది. మనదేశ రాజధాని ఢిల్లీలో.. ఫ్రెంచ్ టూరిస్ట్‌కు విషం ఇచ్చి చంపినందుకుగాను చార్లెస్ శోభరాజ్ 21 సంవత్సరాలు భారతీయ జైలులో ఉన్నాడు. అయితే భారత్ లో ఖైదీగా ఉన్న సమయంలో 1986లో జైలు గార్డులకు మత్తుమందు ఇచ్చి తప్పించుకున్న చార్లెస్ శోభరాజ్ ని ఆ తర్వాత కొన్నిరోజులకు గోవాలో తిరిగి పట్టుకున్నారు అధికారులు. 1997 ఫిబ్రవరి 17 న తన 52 వ ఏట భారత జైలు నుంచి చార్లెస్‌ శోభరాజ్ విడుదలయ్యాడు. అతడిపై ఉన్న అనేక వారెంట్లు, సాక్ష్యాలు, అతనికి వ్యతిరేకంగా సాక్షులు కూడా లేకుండా పోయారు. అతడిని అప్పగించడానికి ఏ దేశమూ లేనందున భారత అధికారులు అతడిని ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లనిచ్చారు. ఫ్రాన్స్‌లో చార్లెస్‌ సెలబ్రిటీ హోదా అనుభవించాడు. ఆ తర్వాత 2003లో  తిరిగి నేపాల్‌కు వెళ్లాడు.  ఖాట్మండులోని ఓ క్యాసినోలో కనిపించిన అతడిని నేపాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. 1975లో నేపాల్‌లో అమెరికన్ టూరిస్ట్ అయిన కొన్నీ జో బ్రోంజిచ్ హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. 2014లో అతను కెనడియన్ బ్యాక్‌ప్యాకర్ లారెంట్ క్యారియర్ హత్య కేసులో దోషిగా నిర్ధారించబడ్డాడు. దాంతో కోర్టు రెండవ జీవిత ఖైదు విధించింది.

First published:

Tags: France, Nepal

ఉత్తమ కథలు