న్యూయార్క్ 9/11 దాడులకు 17 ఏళ్లు...!

అమెరికా న్యూయార్క్ నగరంలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడులకు దిగారు. నాలుగు విమాన్లను హైజెక్ చేసి ట్విన్ టవర్స్‌ను కూల్చేశారు. 2001 సెప్టెంబరు 11వ తేదీన జరిగిన దాడులతో న్యూయార్క్ నగరం చిగురటాకులా వణికిపోయింది.

news18-telugu
Updated: September 11, 2018, 11:43 AM IST
న్యూయార్క్ 9/11 దాడులకు 17 ఏళ్లు...!
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 11, 2018, 11:43 AM IST
సెప్టెంబర్ 11... ఈరోజును ప్రపంచమంతా గుర్తుచేసుకుంటుంది. ఎందుకంటే ఇదేరోజున అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి జరిగింది. దీంతో ప్రపంచ ప్రజలు ఉలిక్కిపడ్డారు. WTOపై దాడి చేసిన ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఈ దుర్ఘటన జరిగి 17 ఏళ్లు గడిచినా.. నేటికి అమెరికన్లే కాదు... ప్రపంచ ప్రజలు కూడా ఈ దుర్ఘటనను మరిచిపోలేరు. అల్‌ఖైదా ఉగ్రమూక విమానదాడులు జరిపి దాదాపు మూడువేల మందిని పొట్టన పెట్టుకున్నారు.

అమెరికా న్యూయార్క్ నగరంలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడులకు దిగారు. నాలుగు విమాన్లను హైజెక్ చేసి ట్విన్ టవర్స్‌ను కూల్చేశారు. 2001 సెప్టెంబరు 11వ తేదీన జరిగిన దాడులతో న్యూయార్క్ నగరం చిగురటాకులా వణికిపోయింది. ఉగ్రదాడితో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ట్విన్ టవర్స్ నేలకూలాయి. ఈ దాడుల్లో సుమారు మూడువేల మంది చనిపోగా... మరో ఆరువేల మంది గాయాలపాలయ్యారు. 9/11దాడులతో మనదేశ వాణిజ్య రాజధాని ముంబై సహా అనేక దేశాల్లో పలు కీలక నగరాల్ని అమెరికా విదేశాంగ శాఖ అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, అణుకేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

న్యూయార్క్ దాడులు, 9/11 దాడులు, వరల్డ్ ట్రేండ్ సెంటర్‌పై దాడులు, newyork attacks, september 11 attacks, 9/11 attacks
(Image: Network18 Creative)


అమెరికా న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నేటితో 17 ఏళ్లు పూర్తయ్యాయి. అందుకే సెప్టెంబర్ 11 అంటే చాలు అమెరికన్లు ఉలిక్కిపడుతుంటారు. అల్‌ఖైదా ఉగ్రవాదులు స‌ృష్టించిన ఈ భీకర విధ్వంసం నుంచి తేరుకోవడానికి అమెరికాకు చాలా ఏళ్లే పట్టింది. అనంతరం ఉగ్రమూకల ఏరివేత చర్యల్లో భాగంగా అమెరికా తమ బలగాల్ని ఆఫ్టాన్‌లో మోహరించి ..సరిగ్గా న్యూయార్క్ దాడులు జరిగిన పదేళ్లకు అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను తుదముట్టించింది.

First published: September 11, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...