అందుకు కిమ్ క్షమాపణ చెప్పాడు.. వెల్లడించిన సియోల్ వర్గాలు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ క్షమాపణలు చెప్పాడు. కిమ్ క్షమాపణ చెప్పడమేమిటని అనకుంటున్నారా.. మీరు విన్నది నిజమే.

news18-telugu
Updated: September 25, 2020, 2:45 PM IST
అందుకు కిమ్ క్షమాపణ చెప్పాడు.. వెల్లడించిన సియోల్ వర్గాలు
కిమ్ జోంగ్ ఉన్
  • Share this:
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ క్షమాపణలు చెప్పాడు. కిమ్ క్షమాపణ చెప్పడమేమిటని అనకుంటున్నారా.. మీరు విన్నది నిజమే.. దక్షిణ కొరియా అధికారిని చంపినందుకు గాను కిమ్వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పారని సియోల్‌లోని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. వివరాలు.. తమ దేశానికి చెందిన ఓ ఫిషరీస్ అదికారిని ఉత్తర కొరియా బలగాలు కాల్చి చంపి, సముద్రంలో పడేసినట్టుగా దక్షిణ కొరియా తెలిపింది. ఇరుదేశాల మధ్య ఉన్న వివాదాస్ప‌ద స‌ముద్ర జ‌లాల బోర్డ‌ర్ ప‌రిధిలో నీటిలో తేలుతున్న చిన్న‌ప‌డ‌వ‌పై కాల్చేసిన త‌మ అధికారి శ‌వం ఉన్న‌ట్టు గుర్తించామని దక్షిణ కొరియా వెల్లడించింది.

"సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న అధికారి కనిపించకుండా పోయాడు. కనిపించకుండా పోయిన అధికారి ఉన్న ప్రాంతానికి గ్యాస్ మాస్క్‌లు ధరించిన ఉత్తర కొరియా అధికారులు చేరుకున్నారు. అక్కడికి ఎందుకు వచ్చామని అతనిని ప్రశ్నించారు.. ఆ తర్వాత కొద్దిసేపటికే అతనిని కాల్చి చంపారు. చంపిన తర్వాత శరీరంపై నూనె పోసి తగలపెట్టారు" అని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే కరోనా భయంతోనే ఉత్తర కొరియా బలగాలు ఈ హత్య చేసి ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. క‌రోనా వ‌చ్చిన వారిని కాల్చి చంపాల‌ని ఉత్త‌ర కొరియా అధికారుల‌ను కిమ్ ఆదేశించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాకు చెందిన అధికారి హత్య జరిగి ఉండవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా, ఈ దశాబ్ద కాలంలో దక్షిణ కొరియా దేశస్థుడిని.. నార్త్ కొరియా బలగాలు చంపడం ఇదే తొలిసారి.

ఇప్పటివరకు ఉత్తర కొరియా నుంచి ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే తాజాగా దక్షిణ కొరియా అధికారి హత్యకు సంబంధించి.. కిమ్ క్షమాపణ చెప్పారని సియోల్ వర్గాలు తెలిపాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జో ఇన్‌ను, ప్రజలను బాధపెట్టినందుకు కిమ్ క్షమాపణలు చెప్పారని దక్షిణ కొరియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైసర్ సుహ్ హూన్ తెలిపారు. కాగా, ప్యాంగ్యాంగ్, వాషింగ్టన్ మధ్య జ‌రిగిన‌ అణు, దౌత్య చ‌ర్చ‌లు ఎలాంటి ఫ‌లితం లేకుండా ముగిసిన‌ప్ప‌టి నుంచి ఉభ‌య కొరియా దేశాల మ‌ధ్య సంబంధాలు చాలావరకు దెబ్బతిన్నాయి.
Published by: Sumanth Kanukula
First published: September 25, 2020, 2:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading