హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

మసీదులో బాంబు పేలుడు.. పాకిస్తాన్‌లో 15 మంది మృతి

మసీదులో బాంబు పేలుడు.. పాకిస్తాన్‌లో 15 మంది మృతి

మసీదులో పేలుడు

మసీదులో పేలుడు

శుక్రవారం ప్రార్థనలకు వచ్చే వారిని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. పేలుడు తర్వాత పోలీసులు, భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.

    పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ భారీ పేలుడు సంభవించింది. క్వెటాలోని ఓ మసీదులో బాంబు పేలింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఇక మృతుల్లో ఓ పోలిస్ అధికారితో పాటు మసీద్ ఇమామ్‌ ఉన్నారు. శుక్రవారం ప్రార్థనలకు వచ్చే వారిని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. పేలుడు తర్వాత పోలీసులు, భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో క్వెటాలో భద్రతను పటిష్టం చేశారు పోలీసులు.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bomb blast, Pakistan

    ఉత్తమ కథలు