లైంగిక సామర్థ్యం కోసం ఈ రకం చేపలను చైనీయులు తెగ తినేస్తున్నారట...

సాధారణంగా సీహార్స్ చేపలను ప్రత్యేకంగా వేటాడరు. చేపల వేటకు వెళ్లినప్పుడు, వలలో చిక్కుకున్న సీహార్స్ జీవులను ఏరి పారేస్తారు. అయితే వీటికి డిమాండ్ నెలకొనడంతో, ఇప్పుడు ప్రత్యేకంగా సముద్రంలో వేటాడుతున్నారు.

news18-telugu
Updated: June 17, 2019, 10:02 PM IST
లైంగిక సామర్థ్యం కోసం ఈ రకం చేపలను చైనీయులు తెగ తినేస్తున్నారట...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చైనా సాంప్రదాయ వైద్యంలో "సీ హార్స్" చేపలను సహజ వయాగ్రాగా పిలుస్తుంటారు. ఫసిఫిక్ సముద్రంలో అత్యంత అరుదుగా లభించే సీహార్స్ చేపలను ఎండబెట్టి వంటకాల్లో వాడితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని, చైనీయుల శాస్త్రాల్లో రాసి ఉంది. ఇదే ఆధారంగా చేసుకొని సముద్రంలో సీహార్స్ చేపలను అదే పనిగా వేటాడేస్తున్నారట. అంతేకాదు సముద్రంలో అంతరించి పోతున్న ఈ జాతి చేపల కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడటం లేదు. ముఖ్యంగా హాంగ్ కాంగ్ నగరంలో ఈ చేపలను ఎండబెట్టి విరివిగా అమ్ముతున్నారు. ఈ చేపలతో సూప్ చేసుకొని తాగితే లైంగిక సామర్థ్యం రెట్టింపు అవుతుందని చైనీయుల నమ్మకం. అంతే కాదు అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా సీహార్స్ చేపలను చైనీయులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే మూడువంతుల సీహార్స్ ఎగుమతులు చైనాకే తరలివెళ్లడం గమనార్హం. అలాగే అటు చైనాతో పాటు తైవాన్, ఇండోనేషియాలో సైతం సీహార్స్ దిగుమతులు పెరిగాయి.

అయితే సాధారణంగా సీహార్స్ చేపలను ప్రత్యేకంగా వేటాడరు. చేపల వేటకు వెళ్లినప్పుడు, వలలో చిక్కుకున్న సీహార్స్ జీవులను ఏరి పారేస్తారు. అయితే వీటికి డిమాండ్ నెలకొనడంతో, ఇప్పుడు ప్రత్యేకంగా సముద్రంలో వేటాడుతున్నారు. కాగా చైనీయులు లైంగిక సామర్థ్యం దెబ్బకు ఈ సీహార్స్ జాతికి చెందిన 11 రకాల చేపల జనాభా ఏకంగా 30 నుంచి 50 శాతం వరకూ తగ్గిందని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రతీ ఏటా దాదాపు 3.7 కోట్ల సీహార్స్ చేపలను వేటాడుతున్నారని గణాంకాలు వెలువడ్డాయి. పలు దేశాల్లో ఈ జాతి చేపల వేటపై నిశేధం ఉన్నప్పటికీ స్మగ్లర్లకు సీహార్స్ చేపలు పంటపండిస్తున్నాయి.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు