హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఖగోళ పరిశోధనల్లో మరో అద్భుతం.. విశ్వం పుట్టుక, ఏలియన్స్‌ను కనిపెట్టే కీలకమైనది కనిపించింది..

ఖగోళ పరిశోధనల్లో మరో అద్భుతం.. విశ్వం పుట్టుక, ఏలియన్స్‌ను కనిపెట్టే కీలకమైనది కనిపించింది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స‌రికొత్త‌గా క‌నుగొన్న ఈ క్విజార్ (quasar)కి P172+18 అనే పేరు పెట్టారు. ఈ ప్ర‌కాశ‌వంత‌మైన ఈ వ‌స్తువు ఎంతో దూరంలో ఉంది. దీని కాంతి మ‌న‌ల్ని చేరుకోవ‌డానికి దాదాపుగా 13 బిలియ‌న్ సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. విశ్వానికి 780 మిలియ‌న్ సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఎలా ఉండేదో ఇప్పుడు ఈ క్విజార్ ద్వారా మనం దాన్ని చూడగలం.

ఇంకా చదవండి ...

అంతరిక్షం ఎప్పుడూ మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. అంతరిక్షంలో ఏముందో కనుక్కోవాలన్న ఆశ మనిషికి పుట్టి ఎంతో కాలమైనా.. ఇంకా ఆ అన్వేషణ కొనసాగుతూనే ఉంది. తాజాగా శాస్త్రవేత్తలు భూమికి కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఓ క్విజార్ ని కనుగొన్నారు. స‌రికొత్త‌గా క‌నుగొన్న ఈ క్విజార్ (quasar)కి P172+18 అనే పేరు పెట్టారు. ఈ ప్ర‌కాశ‌వంత‌మైన ఈ వ‌స్తువు ఎంతో దూరంలో ఉంది. దీని కాంతి మ‌న‌ల్ని చేరుకోవ‌డానికి దాదాపుగా 13 బిలియ‌న్ సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. విశ్వానికి 780 మిలియ‌న్ సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఎలా ఉండేదో ఇప్పుడు ఈ క్విజార్ ద్వారా మనం దాన్ని చూడగలం.

యురోపియ‌న్ స‌థ‌ర‌న్ అబ్జ‌ర్వేట‌రీకి చెందిన చాలా పెద్ద టెలిస్కోప్ (ESO's VLT) స‌హాయంతో, రేడియో వేవ్ లెంత్ నుంచి విడుద‌ల‌య్యే శ‌క్తివంత‌మైన జెట్‌ల‌తో ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు ఎంతో దూరంలో ఉన్న ఈ క్విజార్ ను క‌నుక్కున్నారు. ఈ `రేడియో-లౌడ్‌` క్విజార్ క‌నుగొన్న విష‌యాన్ని ఆస్ట్రోఫిజిక‌ల్ జ‌ర్న‌ల్‌లో ప్రచురించారు. దీనితో ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌ల‌కు విశ్వం (universe) ప్రారంభ ద‌శ‌ను అర్థంచేసుకోవ‌డానికి ముఖ్య‌మైన ఆధారాలు దొరుకుతాయి. క్విజార్లు ఎంతో ప్ర‌కాశ‌వంత‌మైన వ‌స్తువులు. ఇవి కొన్ని గెలాక్సీల మ‌ధ్య‌లో ఉంటాయి. వీటికి అత్యంత పెద్ద బ్లాక్ హోల్స్ నుంచి శ‌క్తి అందుతుంది. బ్లాక్ హోల్ దాని చుట్టు ప‌క్క‌ల నుంచి గ్యాస్‌ను వినియోగించే క్ర‌మంలో శ‌క్తి ఉత్ప‌న్న‌మ‌వుతుంది. దీని వ‌ల్ల ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌ల‌కు అవి చాలా దూరంలో ఉన్న‌ప్ప‌టికీ వాటిని గుర్తించ‌డానికి వీలవుతుంది. ఇది సూర్యుడి కంటే మూడు వందల మిలియన్ల రెట్లు శక్తి వంతమైనది.

అంత‌కుముందు దీనికంటే మ‌రింత దూరంలో ఉన్న క్విజార్ల‌ను క‌నుగొన్న‌ప్ప‌టికీ మొద‌టిసారి ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు ఒక క్విజార్లోని రేడియో జెట్‌లను కనుక్కోవడం ఇదే మొదటిసారి. `రేడియో-లౌడ్‌`గా ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు విభ‌జించిన క్విజార్ల‌లో 10 శాతం మాత్ర‌మే జెట్‌ల‌ను క‌లిగి ఉంటాయి. ఇవి రేడియో ఫ్రీక్వెన్సీల ద‌గ్గ‌ర కాంతివంతంగా ప్ర‌కాశిస్తాయి. బ్లాక్ హోల్స్ కి ఈ రేడియో జెట్స్ కి మధ్య ఏదో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ జెట్‌లు బ్లాక్ హోల్ చుట్టూ ఉన్న గ్యాస్‌ను డిస్ట‌ర్బ్ చేసే సామ‌ర్థ్యం క‌లిగి, గ్యాస్ స్థాయి వేగంగా పడిపోయేలా చేస్తున్నట్లుగా కూడా వారు భావిస్తున్నారు.

చిలీలోని ఈఎస్ఓ‌లో ప‌రిశోధ‌కునిగా ఉన్న ఖ‌గోళ శాస్త్ర‌వేత్త చియ‌రా మ్యాజుచ్ఛెల్లి, జ‌ర్మ‌నీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఆస్ట్రాన‌మీకి చెందిన ఎడ్వ‌ర్డో బ‌నాడోజ్ క‌లిసి ఈ ఆవిష్క‌ర‌ణ (discovery)‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. చియారా దీనిపై మాట్లాడుతూ, `బ్లాక్ హోల్ మ్యాట‌ర్‌ను (ప‌దార్థాన్ని) చాలా వేగంగా త‌న‌లోకి తీసేసుకుంటూ, ఎప్పుడూ గ‌మ‌నించ‌నంత అత్య‌ధిక స్థాయిలో ఒక మ్యాట‌ర్‌లో అది పెరిగిపోతూ ఉంది` అంటారాయ‌న‌.

కాబ‌ట్టి, రేడియో-లౌడ్ క్విజార్ల‌ను అధ్య‌య‌నం చేయ‌డం వ‌ల్ల బిగ్ బ్యాంగ్ త‌ర్వాత విశ్వం ప్రారంభంలో ఉన్న బ్లాక్ హోల్స్ (BlackHole) అవి ప్రస్తుతం ఉన్న అతి పెద్ద సైజ్‌లోకి ఎలా పెరిగాయి అనే విషయం శాస్త్రవేత్తలు తెలుసుకునే అవకాశం ఉంది. చియారా మ్య‌జుచ్ఛెల్లి దీనిపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ, `మొట్ట‌మొద‌టిసారి `కొత్త‌` బ్లాక్ హోల్స్‌ని క‌నుక్కోవ‌డం, అలాగే మ‌నం ఎక్క‌డి నుంచి వ‌చ్చామో, ఆ ఆదిమ విశ్వాన్ని అర్థం చేసుకోవ‌డానికి మరో అడుగు ముందుకు వేసినట్లే.. ఇది మాకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుంది. ఇది మ‌న మూల‌లను మ‌నం తెలుసుకోవ‌డ‌మే` అన్నారు.

Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Aliens, Space

ఉత్తమ కథలు