హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

omicron variant: ఒమిక్రాన్ వేరియంట్​​తో ఇబ్బందేం లేదు.. లక్షణాలు కూడా స్వల్పం .. విదేశీ వైద్య నిపుణుల అభిప్రాయాలు

omicron variant: ఒమిక్రాన్ వేరియంట్​​తో ఇబ్బందేం లేదు.. లక్షణాలు కూడా స్వల్పం .. విదేశీ వైద్య నిపుణుల అభిప్రాయాలు

corona

corona

ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకూ అది లొంగే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది. అయితే పలు దేశాల్లోని శాస్త్రవేత్తలు మాత్రం ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని వాదిస్తున్నారు

ఇంకా చదవండి ...

  తగ్గిపోయిందనుకున్న కోవిడ్ (Covid 19)​ మళ్లీ పడగలిప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు జరిగే పరిణామాలను బట్టి తెలుస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ (Omicron variant) పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హెచ్చరించారు. ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న ఈ సౌతాఫ్రికా వేరియంట్ ఇండియాలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకూ అది లొంగే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది. అయితే పలు దేశాల్లోని శాస్త్రవేత్తలు మాత్రం ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని వాదిస్తున్నారు.

  ఇంట్లో ఉంచి చికిత్స అందిస్తున్నాం..

  ఒమిక్రాన్‌ వేరియంట్​ (Omicron)తో లక్షణాలు స్వల్పంగా∙బయటపడుతున్నాయని సౌతాఫ్రికా డాక్టర్​ ఏంజిలిక్యూ కాట్జీ (Angelique Katzi) చెప్పారు.  ప్రస్తుతానికి కోవిడ్‌ రోగుల్ని ఇంట్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దగ్గు, కండరాల నొప్పులు, అలసట తప్ప అంతకు మించి లక్షణాలేవీ ఈ కొత్త వేరియెంట్‌ ద్వారా బయటపడలేదని చెప్పారు. ఏంజిలిక్యూ కాట్జీ మాట్లాడుతూ.. ‘ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తోంది. కేసులు అత్యధికంగానే బయట పడుతున్నాయి. అయితే ఆస్పత్రులపై భారం పడటం లేదు. 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు, వ్యాక్సిన్‌ తీసుకోని వారే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఇంతవరకు ఈ వేరియెంట్‌ సోకలేదు. ఎంత ప్రమాదకరమో సంపూర్ణ అవగాహన రావాలంటే మరో 15 రోజులు పడుతుంది’ అని తెలిపారు.

  యూకే శాస్త్రవేత్త కూడా..

  మరోవైపు యూకేలోని ఓ శాస్త్రవేత్త కూడా ఒమిక్రాన్​పై అంత భయం వద్దని సూచించారు. ఒమిక్రాన్‌ అందరూ ఊహిస్తున్నంత ప్రమాదకరమైనది కాదని బ్రిటన్‌ ప్రభుత్వానికి యూకే శాస్త్రవేత్త ఒకరు చెప్పారు.  కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి ఈ వేరియెంట్‌ నుంచి రక్షణ పొందే అవకాశాలున్నాయని కరోనాపై సలహాలు ఇచ్చే మైక్రోబయోలాజిస్ట్‌ ప్రొఫెసర్‌ ఒకరు వెల్లడించారు.

  ఈ కొత్త వేరియెంట్‌తో తలనొప్పి, జలుబు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటివి వస్తాయే తప్ప ఆస్పత్రిలో చేరే అవకాశాలు, మరణాలు సంభవించడం వంటివి జరిగే అవకాశం తక్కువేనని ఆయన అన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి, గతంలో కరోనా సోకడం వల్ల ఇమ్యూనిటీ వచ్చిన వారికి ఒమిక్రాన్‌ వేరియెంట్‌ నుంచి ముప్పు ఉండదని సెంపుల్‌ తెలిపారు.

  ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకూ అది లొంగే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని మోడీ (Pm Naredra modi) ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాల, రాకపోకల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఆంక్షలను విధించాయి.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Omicron corona variant

  ఉత్తమ కథలు