ఆశ్చర్యం... ఎలుకల కోసం కార్లు... చక్కగా నడిపేస్తున్నాయిగా

Rat and Cars : మనుషులపై మెడికల్ ట్రయల్స్ నిర్వహించే ముందు... పరిశోధకులు అవే ట్రయల్స్ ఎలుకలపై చేస్తారు. అందులో భాగంగా వాటి కోసం చిన్న సైజు కార్లు తయారుచేశారు. ఆ కార్లలో వెళ్తూ... ఆహారం సంపాదించుకుంటున్నాయి ఎలుకలు.

news18-telugu
Updated: October 25, 2019, 11:54 AM IST
ఆశ్చర్యం... ఎలుకల కోసం కార్లు... చక్కగా నడిపేస్తున్నాయిగా
ఆశ్చర్యం... ఎలుకల కోసం కార్లు... చక్కగా నడిపేస్తున్నాయిగా (credit - Twitter)
  • Share this:
Rat and Tiny Cars : ఎలుకలేంటీ... కార్లు నడపడమేంటి? అని అనిపించడం సహజం. అంతా అమెరికా... వర్జీనియాలోని... రిచ్‌మండ్ యూనిర్శిటీ పరిశోధకుల గొప్పదనమే. వాళ్లు ఏం చేశారంటే... ఎలుకల కోసం చిన్న సైజు కార్లు తయారుచేశారు. వాటిలో ఎలుకల్ని ఉంచారు. ఆ కార్లకు కాస్త దూరంలో ఆహారం పెట్టారు. ఇప్పుడు ఆహారం కావాలంటే ఎలుకలు ఏం చెయ్యాలి... ఆ కార్లను నడపాలి. లేదంటే... కార్లు ముందుకు సాగవు, ఆహారం అందదు. సో, ఎలుకలు వాటి తెలివితేటల్ని ఉపయోగించి... ఆ కార్లను నడుపుతూ ముందుకెళ్లాయి. చక్కగా ఆహారం తినేశాయి. దీన్ని బట్టీ సైంటిస్టులకు అర్థమయ్యిందేంటి? ఎలుకలు కూడా మనలాగా ఆలోచించగలవన్నమాట. వాటి బ్రెయిన్స్‌ లెర్నింగ్ స్కిల్స్‌ని వంటబట్టించుకునేలా ఉన్నాయని తేలింది.

ఇదివరకు కూడా ఇలాంటి చాలా ప్రయోగాల్లో ఎలుకలు సక్సెస్ సాధించాయి. బార్స్‌ని ప్రెస్ చెయ్యడంలో అవి తమ టాలెంట్ చూపించాయి. ఐతే... అవి కదిలే వస్తువులపై తమ బ్రెయిన్‌ని ఉపయోగించగలవా అనే డౌట్ వచ్చిన సైంటిస్టులు... ఈ కార్ల ప్రయోగం చేశారు.
మొత్తం ఆరు ఆడ, 11 మగ ఎలుకలు కార్లను నడపడం నేర్చుకున్నాయి. దీర్ఘ చతురస్రాకారం (rectangular), చతురస్రం (square) బాక్సుల్లో అవి అటూ ఇటూ కార్లను నడపగలిగాయి. ఇలా డ్రైవింగ్ చెయ్యడాన్ని ఎలుకలు ఎంతో ఇష్టపడినట్లు కనిపించాయి. అవి డ్రైవింగ్‌ని రిలాక్స్‌గా ఫీలవుతున్నాయి పరిశోధకులు తెలిపారు.
Loading...
 

Pics : మాల్దీవుల్లో అందాల రచ్చ చేసిన క్యూట్ బ్యూటీ వేదిక...ఇవి కూడా చదవండి :

ఎద్దుకు కన్నీటి వీడ్కోలు... ఘనంగా అంత్యక్రియలు


Diwali 2019 : దీపావళి వేళ... నగలు ఎలాంటివి వేసుకోవాలంటే...

Diwali 2019 : దీపావళికి ఇంటిని క్లీన్ చేయడమంటే... ఫ్యామిలీతో కాలం గడపడమే

దీపాల వెలుగులో ఫొటోలు దిగుతున్నారా... ఈ చిట్కాలు మీకోసమే

Diwali 2019 : దీపావళికి ఈజీగా రంగోలీ వెయ్యడం ఎలా?
First published: October 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...