Home /News /international /

Superionic ice: సూపర్ అయోనిక్ ఐస్.. ఆ గ్రహాల్లో కూడా నీరుంది.. కానీ కొత్త రూపంలో..

Superionic ice: సూపర్ అయోనిక్ ఐస్.. ఆ గ్రహాల్లో కూడా నీరుంది.. కానీ కొత్త రూపంలో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Superionic ice: నెప్ట్యూన్, యురేనస్ గ్రహాల మధ్యలో కొత్త రకం మంచు నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనినే సూపర్‌అయోనిక్ ఐస్ (Superionic ice) అని పిలుస్తున్నారు. ఒక పరిశోధన ద్వారా అభివృద్ధి చేసిన ఈ ఐస్‌.. కొత్త నీటి దశ అని తెలిపారు.

ఇంకా చదవండి ...
సౌర వ్యవస్థ(Solar Systems)లోని అనేక గ్రహాలు (Planets), నక్షత్రాల్లో (Stars) నీరు ఉందా? అక్కడ మనుషులు జీవించడానికి అనువైన వాతావరణం ఉందా? అనే అంశాలపై శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. భూమిపై కాకుండా ఇతర గ్రహాలు, నక్షత్రాల్లో మనుషులు జీవించే అవకాశాలపై కూడా అనేక ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా శాస్త్రవేత్తలు (US scientists) జరిపిన తాజాగా ప్రయోగాల్లో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

నెప్ట్యూన్, యురేనస్ గ్రహాల మధ్యలో కొత్త రకం మంచు నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనినే సూపర్‌అయోనిక్ ఐస్ (Superionic ice) అని పిలుస్తున్నారు. ఒక పరిశోధన ద్వారా అభివృద్ధి చేసిన ఈ ఐస్‌.. కొత్త నీటి దశ అని తెలిపారు. ఈ రెండు గ్రహాల లోతుల్లో అత్యధిక వేడి, పీడనాల వద్ద ఈ ఐస్ ఏర్పడుతుంది. నీటి బిందువులతో షాక్ వేవ్ ను పంపడం ద్వారా ఈ సూపర్‌ అయోనిక్ ఐస్‌ను పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రయోగ ఫలితాలు చూశాక చాలా ఆశ్చర్యం వేసిందని చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ విటాలీ ప్రకాపెంకా చెప్పారు.

ఒక్క అవకాశం వచ్చినా.. మీ​ పని పడతాం.. పాకిస్తాన్​కు ఐఎస్​ఐఎస్​ కే ఉగ్రవాద సంస్థ

పరిశోధనలు ఎలా చేశారు
సూపర్‌ అయోనిక్ ఐస్‌ను అభివృద్ధి చేయడానికి రెండు వజ్రాల మధ్య నీటిపై ఒత్తిడి తెచ్చారు. గ్రహాల ప్రధాన భాగంలో ఉండే ఒత్తిడిని పునరుత్పత్తి చేయడానికి అత్యంత కఠినమైన పదార్థమైన వజ్రాలను ఎంచుకున్నారు. లేజర్ కిరణాలతో వజ్రాలతో నీటిని వేడిచేయడానికి అత్యధిక వెలుగులతో ఎక్స్ రే బీమ్స్, అధునాతన ఫోటాన్ సోర్స్ ఉపయోగించారు. ఇది రసాయనిక ప్రతిచర్య కాదు.. రివర్సబుల్, స్ట్రక్చరల్ మార్పు మాత్రమేనని ప్రకపెంకా తెలిపారు. మూలలు హైడ్రోజన్ తో, మధ్యలో ఆక్సిజన్ తో నిండిన లాటిస్ కొత్త సూపర్‌అయోనిక్ దశలోకి మారుతున్నప్పుడు అది విస్తరిస్తుంది. ఆక్సిజన్ పరమాణువులు తిరిగి స్థిరంగా ఉన్నప్పుడు హైడ్రోజన్ పరమాణువులు చుట్టూ తిరగడానికి వీలు కల్పిస్తుంది. ఇది తేలియాడే హైడ్రోజన్ అణువులు.. అంటే సముద్రంలో ఉన్న ఆక్సిజన్ లాటిస్ లాంటిదని ఆయన చెప్పారు.

America H-1B Visa : ఇక వారికీ హెచ్‌-1బీ వీసా.. అమెరికా కోర్టు తీర్పు

మరో ముందడుగు
ఇలా తయారైన పలుచని మంచు, కాంతితో సంఘర్షణ చెందడం వల్ల ముదురు రంగులో కనిపిస్తుంది. గ్రహాల అయస్కాంత క్షేత్రాల్లో ఈ మంచు కీలక పాత్ర పోషిస్తుంది. భూమి లోపల ఉండే శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాల నుంచి వెలువడే రేడియేషన్, కాస్మిక్ కిరణాల నుంచి మనల్ని రక్షిస్తాయి. మార్ష్, మెర్కురీ గ్రహాల ఉపరితలాల నుంచి వచ్చే రేడియేషన్ ను నుంచి కూడా కాపాడతాయి. సౌర వ్యవస్థలోని గ్రహాలు, నక్షత్రాలపై జీవించడానికి అనుకూలమైన పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలకు ఈ అయస్కాంత క్షేత్రాల ప్రభావంపై పరిశోధనలు ఉపయోగపడతాయని ప్రొఫెసర్ విటాలీ ప్రకాపెంకా అభిప్రాయపడ్డారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Space, Water

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు