భూమిలోని అత్యంత లోతైన ప్రాంతంలో పరిస్థితి చూసి షాకైన సైంటిస్ట్...ఏం జరిగిందంటే...?

ప్రపంచంలోనే లోతైన మెరియానా ట్రెంచ్ అఖాతంలోని సముద్రపు అట్టడుగు భాగంలో పరిస్థితి చూసి విక్టర్ షాకయ్యాడు. అంత లోతైన ప్రాంతంలో కూడా ప్లాస్టిక్ అవశేషాలు కుప్పలు కుప్పులుగా పడిఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.

news18-telugu
Updated: May 14, 2019, 11:09 AM IST
భూమిలోని అత్యంత లోతైన ప్రాంతంలో పరిస్థితి చూసి షాకైన సైంటిస్ట్...ఏం జరిగిందంటే...?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భూమ్మీద ప్లాస్టిక్ భూతం అన్ని దిక్కులకు ఆవరించింది. భూమి, నీరు, గాలి ఇలా అన్ని రకాల వాతావరణాల్లోనూ ప్లాస్టిక్ అవశేషాలు వ్యర్థాలుగా మారి జీవకోటి మనుగడకు ఆటంకం కల్పిస్తున్నాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్రపు అడుగు భాగంలో సైతం ప్లాస్టిక్ వ్యర్థాలు చేరడంతో, పరిస్థితి చేయి దాటి పోతోందని, పర్యావరణ శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని మెరియానా ట్రెంచ్ భూమ్మీద అత్యంత లోతైన సముద్రపు అడుగు భాగం దాదాపు 10928 మీటర్లు లోతు ఉంటుంది. అంటే ఎవరెస్టు పర్వతాన్ని ఈ సముద్రంలో పడేస్తే పూర్తిగా మునిగిపోయి, మరో రెండు వేల మీటర్లు లోతుకు వెళితే గాని కనిపించని పరిస్థితి వస్తుంది. అంత లోతైన సముద్రంలో టెక్సాస్ కు చెందిన రిటైర్డ్ నేవీ ఆఫీసర్ విక్టర్ వెస్‌కోవో పరిశోధనలు చేపట్టడేందుకు డైవింగ్ చేశారు. అయితే ఇప్పటి వరకూ ఈ అఖాతంలో సముద్రపు అట్టడుగు భాగంలో అడుగు మోపిన తొలి మానవుడిగా రికార్డు స్థాపించాడు.

ప్రపంచంలోనే లోతైన మెరియానా ట్రెంచ్ అఖాతంలోని సముద్రపు అట్టడుగు భాగంలో పరిస్థితి చూసి విక్టర్ షాకయ్యాడు. అంత లోతైన ప్రాంతంలో కూడా ప్లాస్టిక్ అవశేషాలు కుప్పలు కుప్పులుగా పడిఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అంటే మనిషి సృష్టించిన ప్లాస్టిక్ భూతం భూమిలోని అన్ని ప్రాంతాలకు చేరిందని విక్టర్ పేర్కొన్నాడు. అయితే ప్లాస్టిక్ అవశేషాల వల్ల అటు సముద్ర జంతువుల ప్రాణాలకు సైతం ముప్పుగా మారిందని విక్టర్ పరిశోధనల్లో తేలింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూమ్మీద ప్రాణకోటికి ప్లాస్టిక్ చరమగీతం పాడుతుందని విక్టర్ తేలిపాడు.

First published: May 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>