Home /News /international /

SCIENCE AND ENVIRONMENT THE WORLD S HARDIEST BACTERIA GH VB

Tiny Bacteria: ప్రపంచంలోనే ధృడమైన బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్తలు.. దాని ప్రత్యేకతలు ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అనుకోకుండా శాస్త్రవేత్తలకు కనిపించిన ఆ బ్యాక్టీరియా(Bacteria) ఎన్నో పరిశోధనలకు ఇప్పుడు మూలమైంది. వెంట్రుకలో పదో వంతు ఉంటూ ధృడమైనదిగా రికార్డులకెక్కింది. అంతరిక్షంలోనూ హాయిగా మూడేళ్ల కంటే ఎక్కువ కాలం బతికేయగలదని చెబుతున్నారు.

అనుకోకుండా శాస్త్రవేత్తలకు కనిపించిన ఆ బ్యాక్టీరియా(Bacteria) ఎన్నో పరిశోధనలకు ఇప్పుడు మూలమైంది. వెంట్రుకలో పదో వంతు ఉంటూ ధృడమైనదిగా రికార్డులకెక్కింది. అంతరిక్షంలోనూ హాయిగా మూడేళ్ల కంటే ఎక్కువ కాలం బతికేయగలదని చెబుతున్నారు. త్వరలో అది మార్స్‌ యాత్రకు వెళ్లినా ఆశర్యపోవాల్సిన అవసరం లేదు. అత్యంత వేగంగా డీఎన్‌ఏను బాగుచేసుకొనే శక్తి దానిలో ఉంది. ఈ గుట్టును శాస్త్రవేత్తలు విప్పగలిగితే క్యాన్సర్‌ వంటి మహమ్మారికి మందు దొరికినట్టే. అతి చిన్న బ్యాక్టీరియా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి (Guinness Book Of Record) ఎక్కేసింది. అది ఎంత చిన్నదంటే మనిషి వెంట్రుకలో పదో వంతు ఉంటుంది. అయితే, ఈ బ్యాక్టీరియా వల్లమనుషులకు ఎటువంటి నష్టం ఉండదు. కానీ ఆ బ్యాక్టీరియా అతి ప్రతికూల పరిస్థితుల్లో జీవించడానికి ఇష్టపడుతుంది. దీన్ని డెయినోకాకస్‌ రేడియోడురాన్స్‌(Deinococcus Radiodurans)లేదా టెరిబుల్‌ బెర్రీగా (Terrible Berry) పిలుస్తారు.

పాలీఎక్ట్స్రోమోఫైల్‌ ఆర్గానిజమ్​ (Polyextremophile Organism) అయిన ఈ బ్యాక్టీరియా ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకొని జీవించగలదు. మనిషి కంటే వేయి రెట్లు ఎక్కువగా అయనైజింగ్‌ రేడియేషన్‌ను తట్టుకోగలదు. డెయినోకాకస్‌ రేడియోడురాన్స్‌ను 1956లో అనుకోని ఘటనల మధ్య శాస్త్రవేత్తలుకనుక్కొన్నారు. ఆ సమయంలో టిన్నులలో భద్రపరిచే మాంసం చెడిపోకుండా గామా రేస్‌ను ఉపయోగించి శాస్త్రవేత్తలుప్రయోగం చేస్తున్నారు. అధిక మోతాదులో రేడియేషన్‌ (Radiation) ఉపయోగించినా సరే మాంసం చెడిపోయింది. కచ్చితంగా బ్యాక్టీరియా మూలంగానే మాంసం చెడిపోయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావించారు. ఆ బ్యాక్టీరియా మట్టిలో, జంతువుల ముఖాలపై, మురుగులో, దుస్తులపై, వండిన ఆహార పదార్ధాలు, ఎండబెట్టిన వాటిపై కూడా కనిపించింది.

ALSO READ Ukraine-Russia : ఆ దేశంపై యుద్ధానికి..ఆర్మీలో చేరి శిక్షణ తీసుకుంటున్న 79 ఏళ్ల బామ్మ

గిన్నీస్​ బుక్​ ఆఫ్​ రికార్డులో చోటు..
అది అంత బలంగా ఉండటానికి కారణం, బ్యాక్టీరియాలో వివిధ రకాల జీన్స్‌ కలిసి ఉండటమే. డీఎన్‌ఏను వేగంగా మార్చే శక్తి ఆ బ్యాక్టీరియా కణాలకు ఉంది. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్లో జరిగిన ఓ పరిశోధన వివరాల మేరకు.. అంతరిక్షంలోనూ డెయినోకాకస్‌ రేడియోడురాన్స్‌ కనీసం మూడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలే బతకగలదని స్పష్టం చేశారు. మార్స్‌పై జీవనం సాధ్యమా ? కాదా? అక్కడి పరిస్థితులు ఏంటనేది తెలుసుకొనేందుకు ఈ బ్యాక్టీరియాను ఆ గ్రహంపైకి పంపాలనే యోచనలో శాస్త్రవేత్తలు ఉన్నారు.

ఇతర గ్రహాలపై పరిస్థితులను అర్థం చేసుకొనేందుకు బ్యాక్టీరియాపై శాస్త్రవేత్తలుప్రయోగాలు జరుపుతున్నారు. న్లూక్లియర్‌ రేడిషేషన్‌ ప్రభావమున్న ప్రాంతాల్లో వాతావరణం శుద్ధి చేసేలా డెయినోకాకస్‌ రేడియోడురాన్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు. అవి అలాంటి ప్రాంతాల్లో ప్రమాదకరమైన టోల్యూన్‌ వంటి కెమికల్స్‌, రేడియోయాక్టివ్‌ ప్రాంతాల్లో మెర్క్యురీని తొలగించగలవు. డీఎన్‌ఏని అంత స్పీడ్‌గా ఈ బ్యాక్టీరియా ఎలా మారుస్తోందన్న అంశంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అది తెలుసుకోగలిగితే క్యాన్సర్‌ చికిత్స, వయసు పెరగడం వంటి వాటిని నియంత్రించవచ్చని భావిస్తున్నారు. ఫ్రీ ఆక్సిజన్‌ మోలిక్యూల్స్‌ ద్వారా డీఎన్‌ఏ దెబ్బతిని ఈ వ్యాధులు వస్తున్నాయని, బ్యాక్టీరియాలోని మార్పులను కనిపెడితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: International news, Science and technology, Trending news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు