దంతం పోగొట్టున్న విద్యార్థిని... దంతాల దేవతకు ప్రిన్సిపల్ లేఖ... ఏమని అంటే...

Letter to Tooth Fairy : విద్యార్థిని ఓదార్చేందుకు ఏం చెయ్యాలో అర్థం కాని ఆ ప్రిన్సిపల్... చివరకు దంతాల దేవతకు లెటర్ రాశారు. విద్యార్థిని కాపాడాలని కోరారు.

news18-telugu
Updated: October 19, 2019, 2:57 PM IST
దంతం పోగొట్టున్న విద్యార్థిని... దంతాల దేవతకు ప్రిన్సిపల్ లేఖ... ఏమని అంటే...
ప్రిన్సిపల్ రాసిన లేఖ (credit - FB - Jenna Carlson)
  • Share this:
చిన్న పిల్లలు ప్రతి దానికీ మారాం చేస్తారు. అలుగుతారు, ఆందోళన చెందుతారు. వాళ్ల చిట్టి హృదయాలు కలత చెందితే... మన మనసులో బాధ తప్పదు. వాళ్లను తిరిగి మామూలుగా చెయ్యాలంటే... వాళ్ల భాషలోనే చెయ్యాలి. అది ఒకింత కష్టమే. అమెరికా... విస్కాన్సిన్‌ లోని గిల్లెట్ ఎలిమెంటరీ స్కూల్‌లో అలాంటి ఘటనే జరిగింది. ఏంటంటే... ఫస్ట్ క్లాస్ చదువుతున్న ఓ చిన్నారి... తన పాల దంతాన్ని కోల్పోయింది. సహజంగానే పిల్లలకు ఆరేళ్లు దాటాక... ఉన్న పళ్లు ఊడిపోయి... కొత్తవి వస్తాయి కదా. అలా ఆ పాపకు కూడా పాల దంతం ఊడిపోయింది. అంతే... అప్పటి నుంచీ ఆ చిట్టి తల్లి... దిగులుగా మారిపోయింది. తన బాధ దంతం ఊడిపోయినందుకు కాదు... దంతాల దేవత (Tooth Fairy)కు ఆ విషయం తెలియదేమోనని.

మధ్యలో ఈ దంతాల దేవత ఏంటా అనుకుంటున్నారు కదూ. అక్కడికే వస్తున్నాను. అమెరికాలో పిల్లలకు దంతాలు ఊడినప్పుడు... ఆ దంతాల్ని దిండు (తలగడ) కింద దాస్తారు. అలా చేస్తే... దంతాల దేవత వాళ్లకు గిఫ్టులు ఇస్తుందని ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. అందువల్ల పిల్లలు దంతాలు ఊడిపోయినప్పుడు ఫీలవ్వకుండా... టూత్ ఫెయిరీ తమకు గిఫ్టులు ఇస్తుందని ఆనందపడుతుంటారు. ఈ కేసులో మాత్రం ఆ చిన్నారి... తెగ బాధపడిపోసాగింది. స్కూల్‌కి వచ్చినప్పటి నుంచీ వెళ్లేవరకూ అదే దిగులు. రోజు తోటి పిల్లలు చుట్టూ చేరి... డోంట్ వర్రీ గిఫ్టులు వస్తాయి అని చెబుతున్నా... ఆ చిట్టి తల్లి ఫేసులో ఆనందం లేదు. ఈ విషయం అలా అలా పాకి... ప్రిన్సిపల్‌కి తెలిసింది.


ప్రిన్సిపల్ కర్ట్ ఏంజెలీ... ఆ చిన్నారిని ఓదార్చారు. టూత్ ఫెయిరీకి ఓ లేఖ రాశారు. దంతం ఎలా పోయిందో అందులో చెప్పారు. చిన్నారి ఉదయం స్కూల్‌కి వచ్చినప్పుడు అన్ని దంతాలూ ఉన్నాయనీ, ఇప్పుడు చూస్తే... ఓ దంతం ప్లేస్ ఖాళీగా ఉందని రాశారు. పోయిన పన్ను కోసం ప్రత్యేక టీమ్‌తో వెతికించినా అది దొరకలేదని వివరించారు. తన లేఖను అధికారిక వెరిఫికేషన్ లేఖగా గుర్తించి, పోయిన పన్నుకు మరో అసలైన పన్ను ఇచ్చేందుకు తగిన ఎక్స్‌ఛేంజ్ రేట్ ఫిక్స్ చెయ్యాలని కోరారు. అంతే కాదు... 1987లో తాను పోగొట్టుకున్న జ్ఞానదంతానికి గిఫ్టు కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నానని జోక్ రాశారు. ఆ లేఖను ఫేస్‌బుక్‌లో పెట్టగా... అది వైరల్ అయ్యింది. అందరూ తెగ మెచ్చుకుంటున్నారు ప్రిన్సిపల్‌ని.

ట్విస్ట్ ఏంటంటే... నెక్ట్స్ డే స్కూల్‌కి ఆనందంగా వచ్చిన ఆ పాప... తనకు దంతాల దేవత ఓ డాలర్ ఇచ్చిందని ప్రిన్సిపల్‌కి చెప్పింది. పాప ఇంట్లో వాళ్లు ఓ డాలర్ పాపకు ఇచ్చి ఉంటారని భావించిన ప్రిన్సిపల్.. గ్రేట్ అని చిన్నారిని మెచ్చుకున్నారు. చూశారా... పిల్లలకు చదువు చెప్పడానికి చితకబాదుతుంటారు కొంతమంది టీచర్లు. కానీ పిల్లలకు వాళ్ల భాషలోనే చెబితే... ఏదైనా చక్కగా వచ్చేస్తుంది. అందుకు ఈ ఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్.


Pics : చిలిపి చూపులతో కట్టిపడేస్తున్న కళ్యాణి ప్రియదర్శన్ ఇవి కూడా చదవండి :


తెలంగాణ బంద్‌లో తెగిన వేలు... ఏం జరిగిందంటే...

డోర్ డెలివరీ ఇక డ్రోన్ డెలివరీ... గూగుల్ కొత్త ప్రాజెక్ట్ గ్రేట్ సక్సెస్...

లిఫ్ట్‌లో ఇరుక్కొని చిన్నారి మృతి... తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు

పెళ్లికొడుకును వెతకలేకపోయిన మాట్రిమోనీ ఏజెన్సీ... ఏ శిక్ష పడిందంటే...

ప్రపంచంలో అత్యంత సైలెంట్ ప్లేస్ ఏది?... వైరల్ వీడియో
Published by: Krishna Kumar N
First published: October 19, 2019, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading