Coffee Painting: అద్భుతం సృష్టించిన సౌదీ మహిళ.. కాఫీ పెయింటింగ్ తో గిన్నీస్ రికార్డ్

Coffee Painting: సౌదీఅరేబియాకు చెందిన ఒక కళాకారిణి అద్భుతాన్ని సృష్టించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ పెయింటింగ్‌కు ఆమె ప్రాణం పోసింది. ఈ పెయింటింగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోవడం విశేషం.

news18-telugu
Updated: October 19, 2020, 3:43 PM IST
Coffee Painting: అద్భుతం సృష్టించిన సౌదీ మహిళ.. కాఫీ పెయింటింగ్ తో గిన్నీస్ రికార్డ్
Image credits: AFP.
  • Share this:
సౌదీఅరేబియాకు చెందిన ఒక కళాకారిణి అద్భుతాన్ని సృష్టించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ పెయింటింగ్‌కు ఆమె ప్రాణం పోసింది. ఈ పెయింటింగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోవడం విశేషం. ఆ దేశం నుంచి గిన్నిస్ జాబితాలో చోటు దక్కించుకున్న మొదటి మహిళగా ఆమె రికార్డు సాధించింది. ఈ వివరాలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆదివారం ప్రకటించింది. ఓహుద్ అబ్దుల్లా అల్మాల్కీ అనే మహిళా కళాకారిణికి పెయింటింగ్స్ వేసే అలవాటు ఉంది. కొత్తగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆమె 220 చదరపు మీటర్ల (సుమారు 2,370 చదరపు అడుగులు) వైశాల్యంలో ఈ కాఫీ పెయింటింగ్ వేసింది. తమ దేశంతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో ప్రఖ్యాత నాయకుల చిత్రాలను ఆమె రూపొందించింది. ఇందుకు అల్మాల్కీ గడువు ముగిసిన కాఫీ గింజలను ఉపయోగించింది.

సౌదీ, యూఏఈ రాజుల రూపాలు

ఈ ప్రయత్నం ఫలించడానికి ఆమెకు 45 రోజులు పట్టిందట. ఇందుకు ఇద్దరు సాక్షులు, వీడియో రికార్డింగ్, డ్రోన్ ఫుటేజ్‌లను అల్మాల్కి ఆధారాలుగా చూపినట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. "నసీజ్ 1" అని పేరు పెట్టిన ఈ కళాకృతిని సౌదీలోని జెడ్డాలో ఏడు వస్త్రాల కాన్వాస్‌పై రూపొందించారు. ఇందులో సౌదీ అరేబియా, యూఏఈ వ్యవస్థాపకులైన దివంగత రాజులు అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్, షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్-నహ్యాన్ చిత్రాలను ఆమె పెయింటింగ్ వేసింది. పెయింటింగ్ కింది భాగంలో రెండు గల్ఫ్ దేశాలకు చెందిన ఇతర నాయకుల చిన్న చిత్రాలను వేసింది. ఈ పెయింటింగ్ బోర్డర్కు అక్కడి సంప్రదాయ "అల్-సాదు" శైలిలో ఉండే బెడౌయిన్ అలంకరణ చేసింది.

ఆ దేశాల చరిత్ర చాటి చెప్పాలని..
కొన్ని శతాబ్ధాలుగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య ఉన్న సంబంధాలను ప్రపంచానికి గుర్తు చేయాలనే లక్ష్యంతో ఈ పెయింటింగ్ వేసినట్టు అల్మాల్కీ చెబుతోంది. పెయింటింగ్ పూర్తి చేయడానికి ఆమె సుమారు 4.5 కిలోల గడువు ముగిసిన కాఫీ గింజలను వాడినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తెలిపింది. తాను సాధించిన ఈ రికార్డు సౌదీ అరేబియాతో పాటు ఇతర దేశాల్లోని మహిళలను శక్తిమంతం చేయడానికి, సాధికారతకు తోడ్పడుతుందని అల్మాల్కీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఈ రికార్డు సాధించిన తొలి మహిళ
ఇంతకు ముందు ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలు కలిసి ఇలాంటి పెయింటింగ్స్‌ వేసినట్టు గిన్నిస్ రికార్డ్స్ సంస్థ తెలిపింది. 2015లో రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి రియాద్‌లో 8,264 మంది మహిళలు కలిసి అతిపెద్ద హ్యూమన్ ఎవేర్నెస్ రిబ్బన్ను రూపొందించారు. కానీ ఒక సౌదీ మహిళ ఒంటరిగా రికార్డు సాధించడం ఇదే మొదటిసారి అని ఆ సంస్థ ప్రకటించింది.
Published by: Nikhil Kumar S
First published: October 19, 2020, 3:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading