Home /News /international /

Newly Married Woman: పెళ్లైన రెండు రోజులకే విడాకులు కావాలన్న భార్య.. కాపురం చేయలేనని కోర్టుకు.. అసలేం జరిగిందంటే..

Newly Married Woman: పెళ్లైన రెండు రోజులకే విడాకులు కావాలన్న భార్య.. కాపురం చేయలేనని కోర్టుకు.. అసలేం జరిగిందంటే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఓ మహిళ పెళ్లైన రోజు బెడ్‌రూమ్‌లో నుంచి ఆవేశంగా బయటకు వచ్చింది. ఆ తర్వాత రెండు రోజులకే భర్తతో తనకు విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది.

    ఓ మహిళ పెళ్లైన రోజు బెడ్‌రూమ్‌లో నుంచి ఆవేశంగా బయటకు వచ్చింది. ఆ తర్వాత రెండు రోజులకే భర్తతో తనకు విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుందని Gulf News రిపోర్ట్ చేసింది. అయితే ఆ మహిళ భర్తతో విడాకులు ఎందుకు కోరింది..?, పెళ్లైనా కొద్ది గంటల్లోనే ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుందో తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే. వివరాలు.. సౌదీలో ఉండే ఓ యువతికి బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అరబ్ వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. అనంతరం కొన్ని రోజులకు వారి పెళ్లి జరిగింది. పూర్తిగా వారి సంప్రదాయం ప్రకారం ఈ వేడుకను నిర్వహించారు. అయితే పెళ్లైన తర్వాత మరుసటి రోజు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. అయితే బెడ్‌రూమ్‌లో అతని చూసిన మహిళ వెంటనే బయటకు వచ్చింది.

    ఇందుకు కారణం.. అతని బట్టతలే కారణమని నవ వధువు చెప్పింది. ఎంగేజ్‌మెంట్, పెళ్లి జరిగిన సమయంలో అతడు సంప్రదాయ దుస్తుల్లో రావడం ద్వారా అతనికి బట్టతల అనే విషయం తాను గుర్తించలేదని ఆమె తెలిపింది. ఈ విషయం తనకు చెప్పకుండా పెళ్లి చేసుకన్నాడని చెప్పింది. తీరా బెడ్‌రూమ్‌లో అతని తలపై వెంట్రుకలు లేకపోవడంతో.. ఆశ్చర్యపోయినట్టుగా తెలిపింది. దీంతో ఆమె బెడ్‌రూమ్‌లో నుంచి బయటకు వచ్చి.. కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. పెళ్లికొడుకుకు బట్టతల ఉన్న విషయం దాచిపెట్టి మోహం చేశాడని.. విడాకులు కావాలని కోరింది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ కోర్టు ఈ కేసు విచారణకు వచ్చింది.

    Job Portal: వృద్ధులకు గుడ్ న్యూస్.. వారి కోసం ఆన్‌లైన్ జాబ్ ఎక్స్ఛేంజ్ పోర్టల్‌.. పోర్టల్ ప్రత్యేకతలు ఇవే..

    అయితే సౌదీ‌లో విడాకులు విషయంలో సయోధ్యకు ప్రయత్నించడం తప్పనిసరి. ఈ క్రమంలోనే మ్యారేజ్ కౌన్సిలర్‌తో మహిళ మాట్లాడుతూ.. వివాహానికి ముందు వరుడు తన తలను తెల్లటి వస్త్రంతో(ఘుత్రా) కప్పుకున్నాడని చెప్పింది. కానీ వారి వివాహం తర్వాత అతనికి బట్టతల ఉందని ఆమెకు తెలిసిందని తెలిపింది. అతను తనకు ద్రోహం చేసినట్లు భావించి విడాకులు కావాలని కౌన్సిలర్‌తో చెప్పింది.

    Woman Cop: మహిళా పోలీసుపై సాముహిక అత్యాచారం.. నిందితుడి తల్లి కూడా అరెస్ట్.. బర్త్‌డే పార్టీ కోసమని..

    ‘నా స్నేహితులు, బంధువుల ముందు నేను సిగ్గుపడుతున్నాను. నా పిల్లలు బట్టతలకి గురవుతారనే ఆందోళన నాకు ఉంది. ఇకపై అతనితో కలిసి జీవించడం నాకు చాలా కష్టం’ అని ఆ మహిళ తెలిపింది. మ్యారేజ్ కౌన్సిలింగ్ కేంద్రంలోని అధికారులు ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. చిన్న సమస్యపై విడాకుల కోసం ఆమెను అడ్డుకునే యత్నం చేశారు. కానీ ఆ మహిళ మొండిగా ఉంది. ఆ మహిళ మనసు మార్చుకుంటుందనే ఆశతో ఈ జంట రెండో రౌండ్ కౌన్సెలింగ్ కోసం మరో తేదీని కేటాయించుకున్నారు. ప్రస్తుతం దంపతులిద్దరికీ విడాకుల విషయంలో మరోసారి ఆలోచించుకోవాలని కొంత సమయం ఇచ్చింది. మరోవైపు మహిళ భర్త తరఫు న్యాయవాది ఈ కేసును.. గతంలో చూడని వింత విడాకుల కేసు అని వ్యాఖ్యానించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Divorce, Marriage, Saudi Arabia

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు