Saudi Prince: 15 ఏళ్ల నుంచి కోమాలో ఉన్న సౌదీ ప్రిన్స్ చేత్తో హాయ్ చెప్పిన వేళ

15 సంవత్సరాల నుంచి కోమాలో ఉన్న సౌదీ ప్రిన్స్ సడన్‌గా అనుకోని రీతిలో స్పందించారు. హాయ్ అంటుంటే హాయ్ అంటున్నట్టుగా చేతులు కదిపారు.

news18-telugu
Updated: October 23, 2020, 11:03 PM IST
Saudi Prince: 15 ఏళ్ల నుంచి కోమాలో ఉన్న సౌదీ ప్రిన్స్ చేత్తో హాయ్ చెప్పిన వేళ
సౌదీ ప్రిన్స్ అల్ వలీద్ బిన్ ఖలీద్ అల్ సౌద్
  • Share this:
15 సంవత్సరాల నుంచి కోమాలో ఉన్న సౌదీ ప్రిన్స్ సడన్‌గా అనుకోని రీతిలో స్పందించారు. హాయ్ అంటుంటే హాయ్ అంటున్నట్టుగా చేతులు కదిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సౌదీ ప్రిన్స్ అల్ వలీద్ బిన్ ఖలీద్ అల్ సౌద్ 2005 సంవత్సరం నుంచి కోమాలో ఉన్నాడు. అతడు మిలటరీ కాలేజీలో చదువుతున్న సమయంలో కారు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో బ్రెయిన్ హేమరేజ్ వల్ల కోమాలోకి వెళ్లిపోయాడు. 15 సంవత్సరాల నుంచి వెంటిలేటర్ సాయంతో మంచానికే పరిమితం అయిపోయాడు. చివరకు ఐదేళ్ల క్రితం ఓసారి శరీరాన్ని కదిలించాడు. తాజాగా, మంచం మీద పడుకుని ఉన్న ప్రిన్స్ తన చేతులను హాయ్ అన్నట్టుగా కదిపిన వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోను నెటిజన్లు భారీ ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఓ మహిళ హాయ్ అని పలకరించింది. అందుకు ప్రిన్స్ తన చేతి వేళ్లతో స్పందించాడు. హాయ్ అన్నట్టుగా తన కదలికలు ఉన్నాయి. అలా పలుమార్లు ఆమె హాయ్ అంటుంటే, ప్రిన్స్ కూడా హాయ్ అన్నట్టుగా చేతులు కదపడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇంకో సారి చెయ్యి పైకి లేపాలని ఆమె కోరగా, అతడు అలాగే చేశాడు. అలాగే, ఇంకొంచెం పైకి లేపాలని కోరడంతో చెయ్యి మరింత పైకి ఎత్తాడు.



2018 సంవత్సరంలో చైనాకు చెందిన ఓ వ్యక్తి ఐదు సంవత్సరాల తర్వాత కోమా నుంచి బయటపడ్డాడు. ఆ ఐదు సంవత్సరాలు అతడి భార్య కంటికి రెప్పలా కాపాడుకుంది. హూబే ప్రావిన్స్‌లోని జియాంగ్‌యాంగ్‌కు చెందిన లి జిహువా 2013లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతడి స్కూటర్‌ను ఓ బైక్ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో లి జిహువా బ్రెయిన్‌కు గాయమైంది. అతడి భార్య జాంగ్ గిహుయాన్ సుమారు 2000 రోజుల పాటు తన కెరీర్‌ను వదులుకుని భర్తకు సేవ చేసింది. అతడికి తినిపించడం, క్లీనింగ్, అతడితో మాట్లాడుతూ గడిపింది. రోజులో చాలా తక్కువ సమయం మాత్రమే నిద్రపోయేది. ఈ ఐదేళ్ల కాలంలో ఆమె 10 కేజీల బరువు తగ్గింది. అయితే, కోమా నుంచి కోలుకున్న తర్వాత అతడి భార్యకు ‘ఐ లవ్ యూ’ అని చెప్పడం మరింత ఆనందాన్ని ఇచ్చిన సందర్భం.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 23, 2020, 11:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading