హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

సౌదీ జర్నలిస్ట్ ఖషోగ్జీ హత్య: వెలుగులోకి సంచలన నిజాలు..!

సౌదీ జర్నలిస్ట్ ఖషోగ్జీ హత్య: వెలుగులోకి సంచలన నిజాలు..!

సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ(File)

సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ(File)

సౌదీ అరేబియా ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాసినందుకు అక్కడి పాలకులే కుట్రపూరితంగా ఆయన్ను హత్య చేయించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్యకు సంబంధించి టర్కీ అధ్యక్షుడు రెసిప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ సలహాదారు యాసిన్ అక్తయ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో ఖషోగ్జీ హత్యానంతరం.. దానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేసేందుకు వారు ప్రయత్నించినట్టు ఆయన చెప్పారు. ఇందుకోసం ఆయన శరీరాన్ని ముక్కలుగా కోసి యాసిడ్‌లో కరిగించినట్టు ఆయన సంచలన విషయాన్ని బయటపెట్టారు.

  సౌదీ అరేబియా ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాసినందుకు అక్కడి పాలకులే కుట్రపూరితంగా ఆయన్ను హత్య చేయించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఇటీవల మరికొన్ని కథనాలు వెలువడ్డాయి. జమాల్ ఖషోగ్జీని ఒక ప్రమాదకర ఇస్లామిక్ వాదిగా తాము భావిస్తున్నట్టు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సలాన్ అమెరికాతో చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఖషోగ్జీ హత్యోదంతం వెలుగుచూడకముందు అమెరికాతో ఆయన ఈ విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది.

  మరోవైపు సౌదీ రాజు కుటుంబం మాత్రం ఖషోగ్జీ హత్యలో తమ ప్రమేయంపై వస్తున్న కథనాలను, ఆరోపణలను ఖండిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి అసలు నిజానిజాలను వెలికితీస్తామని చెబుతోంది. కాగా, అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లోకి వెళ్లిన ఖషోగ్జీ ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. దాదాపు రెండు వారాల తర్వాత ఆయన హత్యకు గురైనట్టు తేలింది. చివరిసారిగా ఆయన వెళ్లింది సౌదీ కాన్సులేట్‌లోనికే కాబట్టి.. సౌదీ వర్గాలే ఆయన్ను చంపేశాయన్న ఆరోపణలు మొదలయ్యాయి.

  ఇది కూడా చదవండి: అదృశ్యం కాదు హత్య: సౌదీ జర్నలిస్ట్ ఖషోగ్జీ మిస్సింగ్ విషాదాంతం!

  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: Saudi Arabia

  ఉత్తమ కథలు