మునుపెన్నడూ చూడనంత స్థాయికి ఇంధన ధరలు...సౌదీ యువరాజు హెచ్చరిక

Mohammed bin Salman | ప్రపంచ దేశాలు ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకోనిపక్షంలో...జీవితంలో మునుపెన్నడూ చూడనంత గరిష్ఠ స్థాయికి ఇంధన ధరలు చేరే అవకాశముందని సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ హెచ్చరించారు.

news18-telugu
Updated: September 30, 2019, 11:22 AM IST
మునుపెన్నడూ చూడనంత స్థాయికి ఇంధన ధరలు...సౌదీ యువరాజు హెచ్చరిక
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్(ఫైల్ ఫోటో)
  • Share this:
సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీపై క్షిపణి దాడుల నేపథ్యంలో సౌదీ-ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ప్రపంచ దేశాలన్నీ కలిసొచ్చి ఇరాన్‌ను కట్టడి చేయాలని సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ కోరారు. లేని పక్షంలో ఇంధన ధరలు మునుపెన్నడూ చూడనంత అనూహ్య గరిష్ఠ స్థాయికి పెరిగే అవకాశముందంటూ ఆయన హెచ్చరికలు చేశారు. అదే సమయంలో ఇరాన్‌తో యుద్ధం చేయాలనుకోవడం లేదని... వివాదానికి శాంతియుత, రాజకీయ పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ‘60 మినిట్స్’ ఇంటర్వ్యూ కార్యక్రమం సీబీఎస్ టీవీ ఛానల్లో ఆదివారం ప్రసారమయ్యింది.

ఇరాన్ విషయంలో ప్రపంచం కఠిన చర్యలు తీసుకోనిపక్షంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు యావత్ ప్రపంచ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాకు విఘాతం కలుగుతుందని, తద్వారా ఇంధన ధరలు జీవితంలో మునుపెన్నడూ చూడనంత గరిష్ఠ స్థాయికి చేరే ప్రమాదం ఉంటుందన్నారు. సౌదీలో ఆయిల్ రిఫైరీపై ఈ నెల 14న జరిగిన క్షిపణి దాడులు ఇరాన్ చర్యేనని ఆరోపించిన సౌదీ యువరాజు...ఇదే విషయాన్ని అమెరికాకు చెప్పామన్నారు. అయితే ఇరాన్‌తో యుద్ధం చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని...ఆ దేశంతో శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ వ్యాఖ్యానించారు.


oil,oil production,oil prices,oil producing countries,petrol,diesel,petrol vs diesel,petrol diesel price today,petrol price,diesel price,petrol or diesel,petrol diesel comparison,petrol in diesel engine car,petrol price in india,petrol engine vs diesel engine,diesel engine,putting petrol into a diesel car,petrol prices,diesel fuel (fuel),petrol engine,petrol price hike,petrol price today,diesel prices,petrol price rise,petrol diesel mix,petrol and diesel,oil production by country,crude oil,top countries by oil production,gas production,production,oil producer,crude oil production,canada oil production,global oil production,largest oil production,venezuela oil production,produce oil,is opec cutting oil production,oil production effect on economy,oil platform,largest producer of oil,oil rankings,telugu news,పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, ఆయిల్ ఉత్పత్తి, చమురు ఉత్పత్తి
ప్రతీకాత్మక చిత్రం


కాగా ఏడాదిక్రితం జరిగిన వాషింగ్టన్‌ పోస్టు కాలమిస్ట్‌ జమాల్‌ ఖషోగ్గి హత్యలో తన ప్రమేయం లేదని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ స్పష్టంచేశారు. అయితే సౌదీ రాజ్యాధినేతగా ఖషోగ్గి హత్యకు తాను పూర్తి బాధ్యతవహిస్తున్నట్లు స్పష్టంచేశారు.

సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీపై ఈ నెల 14న జరిగిన క్షిపణి దాడుల వెనుక ఇరాన్ ప్రమేయమున్నట్లు సౌదీ అరేబియాతో పాటు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ మాత్రం కొట్టిపారేసింది. సౌదీ అరేబియాలో ఆయిల్ రిఫైనరీపై జరిగిన క్షిపణి దాడుల్లో తమ ప్రమేయం లేదని స్పష్టంచేసింది.
First published: September 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading