• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • SAUDI CROWN PRINCE PLANS TO LAUNCH CITY WITH NO CARS WITH 500 BILLION DOLLAR COST HSN

Saudi Arabia: సౌదీ యువరాజు సంచలన ప్రకటన.. రోడ్లు, కార్లు లేని సిటీ నిర్మాణం.. ఎన్ని లక్షల కోట్ల ఖర్చో తెలిస్తే..

సౌదీ యువరాజు (ఫైల్ ఫొటో)

సైకిల్ కాలం పోయి మోటార్ సైకిల్ జనరేషన్ వచ్చింది. మరి అలాంటి ఈ రోజుల్లో కార్లు, బైకులు లేని సిటీని మీరు ఊహించగలరా.? సిమెంట్ రోడ్లు, డాంబర్ రోడ్లే కాదు, కనీసం గతుకులు రోడ్లు కూడా లేని నగరం ఉండబోతోందని మీరు నమ్మగలరా.? ఇది అసాథ్యం అంటారేమో. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని గల్ఫ్ దేశమయిన సౌదీ కలలు కంటోంది.

  • Share this:
    ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా బైకో, కారో బయటకు తీస్తున్నారు. కాలి నడకన కనీసం అరకిలో మీటరు కూడా నడవడానికి సాహసించడం లేదు. సిటీల్లో రోడ్లన్నీ, కార్లు, బైకులతో నిండిపోతున్నాయి. ట్రాఫిక్ రద్దీతో అల్లాడిపోతున్నాయి. పట్నాలే కాదు, పల్లెల్లోనూ ప్రతీ ఇంట్లోనూ పెట్రోలుతో నడిచే వాహనం ఉండనే ఉంటోంది. సైకిల్ కాలం పోయి మోటార్ సైకిల్ జనరేషన్ వచ్చింది. మరి అలాంటి ఈ రోజుల్లో కార్లు, బైకులు లేని సిటీని మీరు ఊహించగలరా.? సిమెంట్ రోడ్లు, డాంబర్ రోడ్లే కాదు, కనీసం గతుకులు రోడ్లు కూడా లేని నగరం ఉండబోతోందని మీరు నమ్మగలరా.? ఇది అసాథ్యం అంటారేమో. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని గల్ఫ్ దేశమయిన సౌదీ కలలు కంటోంది. ట్రాఫిక్ రద్దీ లేని, కాలుష్యం లేని, అసలు కార్లే లేని సిటీ నిర్మాణానికి సౌదీ పూనుకుంటోంది. ఈ సిటీ నిర్మాణమే కనుక పూర్తయితే, ప్రపంచంలోని ఇలాంటి నగరం ఉన్న ఏకైక దేశంగా సౌదీ చరిత్రకెక్కుతుంది.

    ’సౌదీ చరిత్రను మార్చే దిశగా కొత్త ఆలోచనలు చేస్తున్నాం. దీనిలో భాగంగానే కార్లు లేని నగరాన్ని నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నాం. ఈ నగరంలో ఎలాంటి రోడ్లు ఉండవు. కాలుష్యం ఉండదు. 170 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నగరం ఉండబోతోంది. దాదాపు 500 బిలియన్ డాలర్లతో(మన కరెన్సీలో ఏకంగా 36 లక్షల కోట్ల రూపాయలు) ఈ నగరాన్ని నిర్మించబోతున్నాం. దీనికి నీయోమ్ అనే పేరు పెడుతున్నాం. మరో మూడు నెలల్లో నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నాం. హైపర్ కనెక్టివిటీ కలిగిన ఈ సిటీలో ఏకంగా పది లక్షల మంది ప్రజలు నివసించవచ్చు. ఈ సిటీ నిర్మాణంతో ఏకంగా 3 లక్షల 80వేల ఉద్యోగాలు వస్తాయి.‘ అని సౌదీ యువరాజు మహమ్మద్ ఆదివారం ఓ టీవీ కార్యక్రమంలో ప్రకటించారు.

    సౌదీ యువరాజు ప్రకటనతో ఈ సిటీ నిర్మాణంపై అంచనాలు పెరిగిపోయాయి. వాస్తవానికి దీన్ని 2017వ సంవత్సరంలోనే ప్రకటించారనీ, కాని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తాత్కాలికంగా ఆపేశారని వార్తలు వస్తున్నాయి. చమురునే నమ్ముకున్న ఓ దేశం, చమురు ఆధారిత కార్లు లేని ఓ సిటీని నిర్మిస్తుండటం పట్ల ప్రపంచం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఈ సిటీ నిర్మాణం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ మూడు నెలల్లో ప్రారంభమయ్యే ఈ సిటీ నిర్మాణానికి, పెద్ద సంఖ్యలో భారతీయ కార్మికులను కూడా ఉపయోగించుకోవాలని సౌదీ ఆలోచిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా నియామకాలు కూడా జరుగుతున్నాయని భారతీయ కార్మిక సంఘాలు కూడా చెబుతున్నాయి.
    Published by:Hasaan Kandula
    First published: