హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

పాక్‌ను ఏకాకిని చేయాలనుకుంటున్నవేళ.. సౌదీ రాజు పర్యటన..

పాక్‌ను ఏకాకిని చేయాలనుకుంటున్నవేళ.. సౌదీ రాజు పర్యటన..

Saudi Prince Pak Visit : భారత్-పాక్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో.. రోజుల వ్యవధిలో ఆయన రెండు దేశాల్లో పర్యటిస్తుండటం గమనార్హం.

  సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం సాయంత్రం పాకిస్తాన్ చేరుకున్నారు. నిజానికి శనివారమే ఆయన పాక్‌లో అడుగుపెట్టాల్సి ఉన్నా.. పుల్వామా దాడి ఎఫెక్ట్‌తో పర్యటన ఒకరోజు వాయిదా పడింది. అంతర్జాతీయంగా పాక్‌ను ఒంటరి చేయాలని భారత్ భావిస్తున్నవేళ.. సౌదీ రాజు పాక్‌లో పర్యటిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

  పాక్ పర్యటనలో భాగంగా సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై సౌదీ రాజు సంతకం చేసే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో పాక్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సందర్భాల్లో కూడా సౌదీ ఆ దేశాన్ని ఆదుకుంది. సౌదీ రాజు తాజా పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని పాక్ భావిస్తోంది. సౌదీ అందించే ఆర్థిక ప్రోద్భలానికి ప్రతిఫలంగా పాకిస్తాన్ ఆ దేశానికి, రాజు కుటుంబానికి తమ సైన్యం మద్దతును అందించనుంది.

  కశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లపై దాడిని సౌదీ రాజు ఖండించిన సంగతి తెలిసిందే. పాక్ పర్యటన ముగిసిన తర్వాత ఫిబ్రవరి 19న ఆయన ఇండియాలో పర్యటించనున్నారు. భారత్-పాక్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో.. రోజుల వ్యవధిలో ఆయన రెండు దేశాల్లో పర్యటిస్తుండటం గమనార్హం. అంతర్జాతీయ సమాజం ముందు పాక్‌ను దోషిగా నిలబెట్టి దౌత్యపరంగా ఒంటరి చేయాలనుకుంటున్న భారత్ సౌదీ రాజుతో ఎలాంటి చర్చలు జరుపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

  First published:

  Tags: Jammu and Kashmir, Pakistan, Pulwama Terror Attack, Saudi Arabia

  ఉత్తమ కథలు