Home /News /international /

SAUDI COURT SENTENCES 11 IN KHASHOGGI MURDER CLEARS ROYAL AIDES SK

జర్నలిస్ట్ ఖషోగ్గి హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష

సౌదీపై తీవ్ర విమర్శలు రావడంతో.. మొత్తం 11 మందిని సౌదీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వారిలో ఎనిమిదిని మందిని దోషులుగా తేల్చి శిక్షలు ఖరారు చేసింది కోర్టు.

    ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో 8 మందిని దోషులుగా తేల్చిన కోర్టు.. ఐదుగురికి మరణ శిక్ష విధించింది. మరో ముగ్గురికి 34 ఏళ్ల పాటు కారాగార శిక్ష విధించింది. ఇక సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అనుచరులను మాత్రం నిర్దోషులుగా ప్రకటించింది. నిర్దోషిగా బయటపడిన వారిలో సౌదీ మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అహ్మద్ అల్ అసిరి కూడా ఉన్నారు.

    కాగా, జమాల్ ఖషోగ్గి అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్‌ పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేసేవారు. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఎప్పుడూ ఆయన ముందుండేవారు. ఈ క్రమంలో 2018, అక్టోబరు 2న ఖషోగ్గి హత్య జరిగింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌లోనే ఆయన్ను దారుణంగా హత్య చేశారు. ఐతే ఖషోగ్గి హత్య కేసులో సౌదీ ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. సౌదీపై తీవ్ర విమర్శలు రావడంతో.. మొత్తం 11 మందిని సౌదీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వారిలో ఎనిమిదిని మందిని దోషులుగా తేల్చి శిక్షలు ఖరారు చేసింది కోర్టు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Khashoggi Murder Case, Saudi Arabia

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు