హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

మీ కిరీటం మా దయ: సౌదీ రాజు కింగ్ సల్మాన్‌పై డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

మీ కిరీటం మా దయ: సౌదీ రాజు కింగ్ సల్మాన్‌పై డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

‘మేం ఎలాంటి లాభం లేకపోయినా కొన్ని దేశాలను కాపాడుతున్నాం. కానీ ఇవేవీ గుర్తించకుండా.. వారు మాకు ఎక్కువ ధరకు ఆయిల్‌ను అమ్ముతున్నాయి. అది సమంజసం కాదు.’ అని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు.

  సౌదీ అరేబియా రాజు కింగ్ సల్మాన్‌పై అమెరికా అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూఎస్ మిలటరీ మద్దతు లేకపోతే సౌదీ రాజు.. రెండు వారాల్లో తన పదవిని కోల్పోతారని వ్యాఖ్యానించారు. అమెరికా, సౌదీ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. కానీ, ఆ దేశ రాజు కింగ్ సల్మాన్‌ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ‌మిసిసిపీలో అమెరికన్ మిలటరీ నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘మేం సౌదీ అరేబియాను కాపాడుతున్నాం. వాళ్లు ధనవంతులనుకుంటున్నారా? నాకు కింగ్ సల్మాన్ అంటే ఇష్టమే. కానీ, నేను ‘కింగ్’ అంటున్నానంటే దాని ఉద్దేశం ఆయన్ను మేం కాపాడుతున్నాం. మేం లేకపోతే మీరు రెండు వారాలు కూడా పదవిలో ఉండలేరు. మిమ్మల్ని కాపాడుతున్నందుకు మా మిలటరీకి డబ్బులు చెల్లించాలి.’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

  ఇరాన్ మీద నియంత్రణ సాధించేందుకు అమెరికా సౌదీ అరేబియాను వాడుకుంటోంది. అమెరికా - సౌదీ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. గత ఏడాది ట్రంప్ ఆ దేశంలో పర్యటించారు. గత శనివారం కూడా సౌదీ రాజు కింగ్ సల్మాన్‌కు ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు.. ఆయిల్ ఎగుమతుల మీద చర్చించారు. గ్లోబల్‌గా ఆర్థికాభివృద్ధి సాధించాలన్నా, ఆయిల్ మార్కెట్లు స్థిరంగా ఉండాలన్నా ఎగుమతులు ప్రస్తుతం ఉన్నట్టే కొనసాగాలని సూచించారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

  గతంలో ఐక్యరాజ్యసమితి వేదికగా మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మేం ఎలాంటి లాభం లేకపోయినా కొన్ని దేశాలను కాపాడుతున్నాం. కానీ ఇవేవీ గుర్తించకుండా.. వారు మాకు ఎక్కువ ధరకు ఆయిల్‌ను అమ్ముతున్నాయి. అది సమంజసం కాదు. ఆయిల్ ధరలు తగ్గించాల్సిన అవసరం ఉంది.’ అని అన్నారు.

  First published:

  Tags: Donald trump, Saudi Arabia, United states

  ఉత్తమ కథలు