సౌదీ అరేబియా చరిత్రాత్మక నిర్ణయం... ఇకపై కొరడా దెబ్బలుండవ్...

సౌదీ అరేబియా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కొరడా దెబ్బలు కొట్టే శిక్షను రద్దు చేసింది.

news18-telugu
Updated: April 25, 2020, 5:17 PM IST
సౌదీ అరేబియా చరిత్రాత్మక నిర్ణయం... ఇకపై కొరడా దెబ్బలుండవ్...
ప్రతీకాత్మక చిత్రం (ImageCredit : The Jakartha post)
  • Share this:
సౌదీ అరేబియా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కొరడా దెబ్బలు కొట్టే శిక్షను రద్దు చేసింది. సుప్రీంకోర్టు జనరల్ కమిషన్ ఈ నెలలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే, గతంలో ఏయే నేరాలకు కొరడాదెబ్బలు కొట్టేవారో దాన్ని మార్చి జైలు శిక్షలు విధిస్తారు. లేదా జరిమానా వేస్తారు. లేదా రెండూ అమలు చేస్తారు. సౌదీ అరేబియా కింగ్ సల్మాన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు దేశంలో వచ్చిన కీలక మానవ హక్కుల సంస్కరణగా దీన్ని అభివర్ణిస్తున్నారు. సౌదీ అరేబియాలో పలు నేరాలకు కొరడాతో కొట్టి శిక్షించే విధానం అమల్లో ఉంది. అయితే, ఏ చట్టంలోనూ అది లేకపోయినా, ఇస్లామిక్ విధానం, షరియా నిబంధనల ప్రకారం దీన్ని అమలు చేస్తూ వస్తున్నారు. అయితే, దీన్ని రద్దు చేయాలంటూ చాలా కాలంగా మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బహిరంగంగా మద్యం తాగిన వారికి, వేధించిన వారికి, వివాహేతర సంబంధాలు నెరిపే వారికి కొరడాతో కొట్టి శిక్షలు విధించారు. అయితే, దొంగతనం చేసిన వారి చేతులు నరకడం, హంతకులు, టెర్రరిస్టుల తలలు నరకడం లాంటివి ఇంకా అమల్లోనే ఉన్నాయి.

ఇది ఆహ్వానించదగిన పరిణామం అని మానవహక్కుల సంఘం నేత ఆడమ్ కూగుల్ చెప్పారు. అయితే, ఇది ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం అని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా సౌదీ అరేబియాను కూడా తీసుకెళ్లే క్రమంలో కింగ్ సల్మాన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు చెబుతున్నారు. 2014లో రైఫ్ బద్వాయ్ అనే సౌదీకి చెందిన బ్లాగర్ ఇస్లాంకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే అభియోగంతో ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1000 కొరడా దెబ్బల శిక్ష విధించారు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశం అయింది. అప్పట్లోనే మానవహక్కుల సంఘాలు కొరడాతో కొట్టే శిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 25, 2020, 5:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading