లాడెన్ కుమారుడు హంజా పౌరసత్వం రద్దు చేసిన సౌదీ అరేబియా

అమెరికా సైన్యం చేతిలో బిన్ లాడెన్ హతమయ్యాక ఇప్పటి వరకూ ఆల్‌ఖైదాకు నాయకుడు లేడు. ఇప్పుడు కొత్త వారసుడు వచ్చాడన్న ప్రచారం ముమ్మరమైంది.

news18-telugu
Updated: March 2, 2019, 8:26 AM IST
లాడెన్ కుమారుడు హంజా పౌరసత్వం రద్దు చేసిన సౌదీ అరేబియా
బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ ( ఫైల్ ఫోటో )
  • Share this:
సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. లాడెన్ కుమారుడిని పట్టించినా, ఆచూకీ చెప్పినా వారికి రూ.7కోట్లు బహుమతిగా ఇస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో సౌదీ ఈ విధంగా కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. తన తండ్రిని చంపిన అమెరికా, దాని మిత్రదేశాలపై పగ తీర్చుకుంటామని హంజా బిన్ లాడెన్ గతంలో హెచ్చరికలు జారీ చేశాడు. అల్ ఖాయిదాలో హంజా లాడెన్ ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్నాడు. 2017 జనవరిలో హంజాను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి ఆస్తులను బ్లాక్ చేసింది.

లాడెన్ కు ఉన్న 20 మంది సంతానంలో హంజా 15వ వాడు. ఇతడు బిన్ లాడెన్ మూడో భార్య ఖైరియా సబర్ కుమారుడు.ఆమెకు ఉన్న సంతానంలో హమ్జా ఒక్కడే కుమారుడు. ఖైరియా అంటే ఒసామాకు ఎంతో ఇష్టం. సౌదీకి చెందిన ఆమె మహమ్మద్‌ ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నతనంలో హమ్జా తల్లిదండ్రుల వద్దే పెరిగాడు. మొదట సౌదీ అరేబియా, సుడాన్‌, ఆఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌లలో కూడా నివసించాడు. హమ్జాకు కూడా వివాహం అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. అయితే, హమ్జా ఎదిగిన తర్వాతి ఫోటో ఇంతవరకూ బయటకు రాలేదు. కేవలం అతని చిన్ననాటి ఫోటోనే నిఘా వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది.

అమెరికా సైన్యం చేతిలో బిన్ లాడెన్ హతమయ్యాక ఇప్పటి వరకూ ఆల్‌ఖైదాకు నాయకుడు లేడు. ఇప్పుడు కొత్త వారసుడు వచ్చాడన్న ప్రచారం ముమ్మరమైంది. ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్‌కు అల్ ఖైదా పగ్గాలు అప్పగించారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. సౌదీ అరేబియా సర్కారుకు వ్యతిరేకంగా సౌదీ తెగల కోసం పోరాడుతున్న హంజా పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, సిరియా దేశాల్లో సంచరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
First published: March 2, 2019, 8:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading