పాకిస్తాన్‌కు గట్టి షాక్ ఇచ్చిన సౌదీ అరేబియా.. ఇండియాకు దీపావళి గిఫ్ట్ అన్న పీవోకే యాక్టివిస్ట్

మరికొద్ది రోజుల్లో జీ 20 శిఖరాగ్ర సమావేశం జరగనున్న వేళ పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా గట్టి షాక్ ఇచ్చింది. నవంబర్ 21, 22 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు ముందు గౌరవ సూచకంగా సౌదీ ఆరేబియా 20 రియల్ నోట్‌ను విడుదల చేసింది.

news18-telugu
Updated: October 29, 2020, 12:38 PM IST
పాకిస్తాన్‌కు గట్టి షాక్ ఇచ్చిన సౌదీ అరేబియా.. ఇండియాకు దీపావళి గిఫ్ట్ అన్న పీవోకే యాక్టివిస్ట్
సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్(ఫైల్ ఫొటో)
  • Share this:
మరికొద్ది రోజుల్లో జీ 20 శిఖరాగ్ర సమావేశం జరగనున్న వేళ పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా గట్టి షాక్ ఇచ్చింది. నవంబర్ 21, 22 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు ముందు గౌరవ సూచకంగా సౌదీ ఆరేబియా 20 రియల్ నోట్‌ను విడుదల చేసింది. ఈ నోట్ వెనకభాగంలో ప్రపంచ మ్యాప్‌ను ముద్రించింది. ఇందులో జీ-20 దేశాలను వేరే రంగుల్లో చూపించారు. అందులో పాకిస్తాన్ పటంలో పాక్ అక్రమిత కశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్‌ను సౌదీ అరేబియా తొలగించింది. ఆ ప్రాంతాలను పాక్ మ్యాప్‌లో లేనట్టుగా చూపెట్టారు. దీంతో భారతకు చెందిన కొన్ని భూభాగాలను తమ ప్రాంతంలో ఉన్నట్టు మ్యాప్‌లను ప్రచురించిన పాక్‌కు.. సౌదీ అరేబియా గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టయింది.

ఇదే విషయాన్ని ట్విట్ చేసిన పాక్ అక్రమిత కశ్మీర్ యాక్టివిస్ట్ అంజాద్ అయూబ్ మీర్జా.. "సౌదీ అరేబియా పీవోకే, గిల్గిట్-బాల్టిస్తాన్‌ను పాకిస్తాన్ మ్యాప్‌ నుంచి తొలగించింది. ఇలా చేయడం ద్వారా సౌదీ అరేబియా ఇండియాకు దీపావళి గిఫ్ట్ ఇచ్చింది" అని పేర్కొన్నాడు. మరోవైపు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ దేశాలతో భారత్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా తమ విదేశాంగ విధానాన్ని మార్చుకుని ఇప్పుడు భారతదేశానికి చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు.

ఇక, గతంలో పాక్ ప్రభుత్వం విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్‌లో భారత్‌‌లో అంతర్భాగంగా ఉన్న కొన్ని ప్రాంతాలను తమ దేశంలో ఉన్నట్టుగా చూపించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. జమ్మూ కశ్మీర్, లడాఖ్, గిల్గిట్-బాల్టిస్తాన్‌లు భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది.
Published by: Sumanth Kanukula
First published: October 29, 2020, 12:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading