Home /News /international /

SAUDI ARABIA HAS SUSPENDED THE ENTRY OF PEOPLE FROM AS MANY AS 20 COUNTRIES SSR

సౌదీ కీలక నిర్ణయం.. భారత్‌తో సహా 20 దేశాలపై తాత్కాలిక నిషేధం.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సహా 20 దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించింది. ఈ తాత్కాలిక ఆంక్షలు బుధవారం నుంచి అమల్లో ఉంటుందని ఆ దేశం స్పష్టం చేసింది. ఈ 20 దేశాల నుంచి సౌదీలోకి ప్రయాణికులను అనుమతించేది లేదని ఆ దేశం స్పష్టం చేసింది. అయితే.. కొందరికి మాత్రం ఆంక్షల నుంచి...

ఇంకా చదవండి ...
    రియాద్: సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సహా 20 దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించింది. ఈ తాత్కాలిక ఆంక్షలు బుధవారం నుంచి అమల్లో ఉంటుందని ఆ దేశం స్పష్టం చేసింది. ఈ 20 దేశాల నుంచి సౌదీలోకి ప్రయాణికులను అనుమతించేది లేదని ఆ దేశం స్పష్టం చేసింది. అయితే.. కొందరికి మాత్రం ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది. దౌత్యవేత్తలు, ఆ దేశాల నుంచి సౌదీకి వెళ్లే సౌదీ పౌరులు, వైద్యులు, వారి కుటుంబాలకు ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపింది. సౌదీలో కరోనాను నియంత్రించేందుకే ఈ తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు ఆ దేశ ప్రతినిధులు తెలిపారు.

    లెబనాన్, టర్కీ, ఐర్లాండ్, ఇటలీ, పోర్చుగల్, స్వీడన్, స్విట్జర్లాండ్, అమెరికా, భారత్, అర్జంటీనా, బ్రెజిల్, ఇండోనేషియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, యూఏఈ, జర్మనీ, ఈజిప్ట్ నుంచి వచ్చే ప్రయాణికులకు తమ దేశంలోకి తాత్కాలికంగా అనుమతి లేదని సౌదీ పేర్కొంది. సౌదీలో ఇప్పటివరకూ 3,68,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,400 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. జూన్ 2020లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో సౌదీ అరేబియాలో కూడా ఒక్క రోజుకే 5,000 కేసులు నమోదయిన సందర్భాలున్నాయి. 2021 జనవరిలో రోజుకు 100 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

    అయితే.. మంగళవారం మళ్లీ కేసుల సంఖ్య పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 310 కరోనా కేసులు నమోదు కావడంతో సౌదీ అప్రమత్తమైంది. తాత్కాలిక ఆంక్షలు విధించాలన్న నిర్ణయానికొచ్చింది. ఇదిలా ఉంటే.. సౌదీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. డిసెంబర్ 17 నుంచి సౌదీలో ఫైజర్-బయోన్‌టెక్ వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు. గత 14 రోజుల్లో ఆంక్షలు విధించిన ఈ 20 దేశాల మీదుగా ప్రయాణం చేసిన ప్రయాణికులపై కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని సౌదీ స్పష్టం చేసింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Corona, Corona Vaccine, India, Saudi Arabia, Travel

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు