నిఫా ఎఫెక్ట్ : కేరళ ఎగుమతులపై నిషేధం

కేరళ నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై గల్ఫ్ దేశం సౌదీ అరేబియా నిషేధం విధించింది.

news18
Updated: June 6, 2018, 2:35 PM IST
నిఫా ఎఫెక్ట్  : కేరళ ఎగుమతులపై నిషేధం
కేరళ నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై గల్ఫ్ దేశం సౌదీ అరేబియా నిషేధం విధించింది.
  • News18
  • Last Updated: June 6, 2018, 2:35 PM IST
  • Share this:
కేరళ లో  మొదలైన నిఫా వైరస్  ఆ రాష్ట్రానికి కంటి మీద కుణుకు లేకుండా చేస్తుంది.కేరళ నుండి ఎవరు ఎక్కడికి వెళ్లిన నిఫా టెస్టులు చేయించుకోవాల్సిన  పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేరళ నుంచి ఎక్స్  పోర్ట్  అవుతున్నపళ్లు, కాయగూరల పై గల్ఫ్ దేశం సౌదీ అరేబియా బ్యాన్ చేసింది.

100 టన్నుల పండ్లు ,  కూరగాయలతో  పాటు వివిధ రకాల ఉత్పత్తులను సౌదీ అరేబియాలోకి అనుమతించకుండా ఎయిర్ పోర్ట్ లోనే ఆపేసినట్టు గల్ఫ్  అధికారులు ప్రకటించారు . మరోవైపు యూఏఈలో ఉన్న VPS  హెల్త్ కేర్ అనే సంస్థ నిపా వైరస్ కు సంబంధించిన మెడిసిన్స్  ను ఒక విమానం ద్వారా కేరళ ప్రభుత్వానికి పంపింది.

ఇప్పటి వరకు కేరళలో నిఫా  వైరస్‌తో బాధపడే 18 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 16 మంది మరణించారు.  మిగిలిన ఇద్దరు కోజికోడ్‌  హాస్పిటల్  లో కోలుకుంటున్నారు. మరో 2000 మంది అనుమానిత కేసులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

నిఫా  వైరస్ ద్వారా అత్యంత ప్రమాదకరమైన ఎన్సిఫాలిటిస్ అనే జబ్బు వస్తుంది. దీని కారణంగా మెదడు వాపునకు గురవుతుంది. ఉన్నట్టుండి తీవ్ర జ్వరం రావడం, దగ్గు, తల నొప్పి, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు, అయోమయంలాంటి లక్షణాలు కనపడతాయి.
Published by: Sunil Kumar Jammula
First published: June 5, 2018, 4:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading