Saudi Arabia Travel Ban : పలు దేశాల్లో మరోసారి కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో సౌదీ అరేబియా(Saudi Arabia)తన పౌరుల విదేశీ ప్రయాణాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా ఖండాల నుంచి మొత్తం పదహారు దేశాల నుంచి ప్రయాణికుల రాకలపై నిషేధం(Travel Ban)విధిస్తున్నట్లు తెలిపింది, ఈ 16 దేశాల్లో భారత్ కూడా ఉంది. భారత్, లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, అఫ్గానిస్తాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, అర్మేనియా, బెలారస్, వెనుజులా దేశాలకు సౌదీ పౌరులు వెళ్లకుండా నిషేధం విధించింది సౌదీ అరేబియా. ఈ లిస్ట్‌లో ఉన్న దేశాల నుంచి కాకుండా మిగతా దేశాల ప్రయాణికులపై మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండబోవని పేర్కొంది. అదే విధంగా ఒకవేళ దేశం నుంచి బయటకు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సిన వాళ్లు మాత్రం మూడు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకుని ఉండాలని స్పష్టం చేసింది. పన్నెండు నుంచి పదహారేళ్ల లోపు వయసు వాళ్లకు రెండు డోసులు ఉంటే చాలని తెలిపింది. ఆరోగ్యపరమైన మినహాయింపులు ఉంటే తప్ప ఎవరినీ బయటకు పంపేది లేదని క్లారిటీ ఇచ్చింది.
కొవిడ్ కేసులు పెరిగిపోతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. అయితే ఈ ప్రయాణ నిషేధం ఎంతకాలం పాటు అనే విషయంపై ఎలాంటి స్పష్టం ఇవ్వలేదు సౌదీ ప్రభుత్వం. శనివారం సౌదీ అరేబియాలో 414 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయని సౌదీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మార్చి, ఏప్రిల్ వారాంతపు కేసులతో పోలిస్తే.. ఇది ఐదు రెట్లు ఉండడంతో ఆందోళన చెందుతోంది ఆ దేశం. ఈ నేపథ్యంలోనే ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు తెలుస్తోంది.
ALSO READ ట్రంప్ పై పుతిన్ ప్రేమ..బైడెన్ సహా అమెరికా ప్రముఖులపై రష్యా ఆంక్షలు..ట్రంప్ కు మాత్రం మినహాయింపు
అలాగే, ప్రస్తుతం ప్రపంచ దేశాలను భయపెడుతున్న మరో వైరస్ మంకీపాక్స్ కేసులు ఇప్పటి వరకూ తమ దేశంలో నమోదు కాలేదని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏదైనా అనుమానిత మంకీపాక్స్ కేసుల గుర్తింపు, పర్యవేక్షణతో పాటు దానిని ఎదుర్కొనే సామర్థ్యం తమ దేశానికి ఉందని సౌదీ ఆరోగ్య శాఖ డిప్యూటీ మంత్రి అబ్దుల్లాహ్ అషిరి తెలిపారు. ఏదిఏమైనప్పటికీ మంకీపాక్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ 12 దేశాల్లో 80కిపైగా కేసులు నమోదయినట్టు WHO తెలిపింది. మొదట యూకేలో మే మొదటి వారంలో మంకీపాక్స్(Monkeyfox)కేసు బయటపడగా.. ప్రస్తుతం 12 దేశాలకు ఈ వైరస్ వ్యాప్తిచెందింది. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, పోర్చగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఇరాన్‌లో కూడా ఈ కేసులను గుర్తించారు. కెనడాలో అధికంగా కేసులు నమోదయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid 19 restrictions, Covid cases, India, Saudi Arabia, Travel ban