హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Saudi Arabia : సౌదీ అరేబియాలో భారీగా బయటపడిన బంగారం,రాగి నిక్షేపాలు

Saudi Arabia : సౌదీ అరేబియాలో భారీగా బయటపడిన బంగారం,రాగి నిక్షేపాలు

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gold Ore : ముస్లింల అత్యంత పవిత్రమైన మదీనా(Medina)లో భారీగా బంగారం(Gold), రాగి(Copper) ధాతు నిక్షేపాలు ఉన్నట్లు సౌదీ అరేబియా(Saudi Arabia) ప్రకటించింది

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Gold Ore : ముస్లింల అత్యంత పవిత్రమైన మదీనా(Medina)లో భారీగా బంగారం(Gold), రాగి(Copper) ధాతు నిక్షేపాలు ఉన్నట్లు సౌదీ అరేబియా(Saudi Arabia) ప్రకటించింది. అబాఅల్ రాహా( Aba al-Raha) సరిహద్దుల్లో బంగారు ఖనిజం కనుగొన్నట్లు సౌదీ జియోలాజికల్ సర్వే(Saudi Geological Survey) ట్విట్టర్ ద్వారా తెలిపింది. మరోవైపు వాడి అల్ ఫరా, అల్ మదిక్ 4 ప్రాంతాల్లో రాగి నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బంగారం, రాగి గనుల వల్ల ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించవచ్చు అని సౌదీ జియోలాజికల్ సర్వే తన రిపోర్ట్‌లో తెలిపింది. కొత్తగా కనుగొన్న గనులు మైనింగ్ కోసం గుణాత్మక పురోగతిని, ఆశాజనక పెట్టుబడి అవకాశాలను కలిగిస్తాయని తెలిపింది.

కొత్త మైనింగ్‌ ప్రాంతాల వల్ల సుమారు 533 మిలియన్ల డాలర్ల పెట్టుబడిని ఆకర్షించవచ్చు అని, దాదాపు 4 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని సౌదీ అధికారులు తెలిపారు. కాగా,సౌదీలో 5,300కిపైగా ఖనిజ సంపద ప్రదేశాలున్నాయని,రన్, రాగి, బంగారం వంటి సాధారణ ఖనిజాలు, క్లే, మైకా వంటి అసాధారణ ఖనిజాలు, రత్నాలు ఉన్నాయని సౌదీ జియోలిజస్ట్స్ కో ఆపరేటివ్ అసోసియేషన్ ఛైర్మన్ అబ్దులజీజ్ బిన్ లబన్ ఈ జనవరిలో తెలిపారు.

ఇరాన్ వింత చట్టాలు..తండ్రి కూతురిని పెళ్లి చేసుకోవచ్చు,అలా చేస్తే కొరడా దెబ్బలు!

ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ స్థాపించిన విజన్ 2030 లో భాగంగా విస్తరణ కోసం గుర్తించబడిన రంగాలలో మైనింగ్ ఒకటి. జూన్‌లోప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ పరిశోధన, అభివృద్ధి రంగానికి జాతీయ ప్రాధాన్యతలను ప్రకటించారు. మేలో సౌదీ పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ... మైనింగ్ రంగంలోకి 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే ప్రణాళికలను వివరించింది

Published by:Venkaiah Naidu
First published:

Tags: Gold Mines, Saudi Arabia

ఉత్తమ కథలు