హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Canada: కెనడాలో అంగరంగ వైభవంగా తాకా - 2022 సంక్రాంతి సంబురాలు

Canada: కెనడాలో అంగరంగ వైభవంగా తాకా - 2022 సంక్రాంతి సంబురాలు

కెనడాలో "తాకా" ఆధ్వ‌ర్యంల సంక్రాంతి సంబురాలు

కెనడాలో "తాకా" ఆధ్వ‌ర్యంల సంక్రాంతి సంబురాలు

Telugu Alliance of Canada | కెన‌డాలోని తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా ఆధ్వ‌ర్యంలో జనవరి 15, 2002న సంక్రాంతి సంబురాలను ఘనంగా జ‌రిగాయి. కెనడాలోని టొరంటో నగరంలోని శ్రుంగేరి కమ్యూనిటీ సెంటర్ (SVBF ఫౌండేషన్)లో ఈ వెడుక‌లు నిర్వ‌హించారు.

కెన‌డాలోని తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా (Telugu Alliance of Canada) ఆధ్వ‌ర్యంలో జనవరి 15, 2002న సంక్రాంతి సంబురాలను ఘనంగా జ‌రిగాయి. కెనడాలోని టొరంటో నగరంలోని శ్రుంగేరి కమ్యూనిటీ సెంటర్ (SVBF ఫౌండేషన్)లో ఈ వెడుక‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని YouTube, Twitter, Instagram, Facebook ల‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసారు. ఆన్‌లైన్‌ (Online)లో వందలాది మంది ఈ వేడుక‌ల‌ను వీక్షించారు. ఈ కార్యక్రమానికి అనిత సజ్జ, మహమ్మద్ ఖాజిల్, విద్య భావనం, మరియు రేణు కుందెమ్ వ్యాఖ్యాతలు (Anchors) గా వ్యవహరించారు. ఆద్య‌తం ఎంతో ఆస‌క్తిగా ఈ కార్య‌క్ర‌మాను నిర్వ‌హించారు.

కార్య‌క్ర‌మాల వివ‌రాలు..

మొదటగా తాకా అధ్యక్షులు కల్పనా మోటూరి, అనిత సజ్జ, సీత శ్రావణి పొన్నలపల్లి కార్యక్రమాన్నిజ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. కల్పనా గారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి కోవిద్-19 (Covid 19) కష్ట కాలంలో తాకా చేస్తున్న ఎన్నో మంచి కార్యక్రమాలు గురించి వివరించారు.

Corona Vaccine: మ‌రింత అందుబాటులోకి వాక్సిన్‌లు.. కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ల‌కు లైన్ క్లియ‌ర్‌!

అనంత‌రం తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను అందరినీ ఆహ్వానించి సంక్రాంతి (Sankranti) పండుగ ప్రాముఖ్యతను వివరించారు. 20 కి పైగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కళా నృత్యాలు, సినిమా పాటలు, డాన్సులు తో దాదాపు 4 గంటల పాటు వీక్ష‌కుల‌ను క‌ట్టిపడేసేలా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.


క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌..

ప్రతి సంవత్సరం తాకా వారు ఆనవాయితీ ప్రకారం టొరంటో కాలమానం లో ప్రచురించిన తెలుగు క్యాలెండర్ ను సంక్రాంతి పండుగ నాడు ఆవిష్కరిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా టొరంటో తెలుగు తిధులు, నక్షత్రాలు కు అనుగుణంగా ప్రచురించిన తెలుగు క్యాలెండర్ (Calender) ఆవిష్కరణ కార్యక్రమం ఘ‌నంగా నిర్వ‌హించారు.

Health Tips: క‌రోనా వేళ‌.. పిలల్ల‌కు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆయుర్వేద చిట్కాలు!

సేవ‌ల‌కు స‌త్కారం..

క్యాలెండ్ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా తెలుగు క్యాలెండర్ ముద్రణ కు సహకరించిన, టొరంటోకు తీసుకువచ్చిన రాకేష్ గరికిపాటి గారికి, ప్రసన్న తిరుచిరాపల్లికి కల్పనా మోటూరి ప్ర‌త్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాకా ప్రస్తుత కార్యవ్రర్గం 2019-2021 మాజీ కార్యవర్గపు సభ్యులను వారి చేసిన కృషికి గాను మెమెంటోలతో సత్కరించారు.


అనంత‌రం ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, డైరెక్టర్స్ అనిత సజ్జ, గణేష్ తెరల,రాణి మద్దెల మరియు ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ్ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక మరియు ఇతర వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, లోకేష్ చిల్లకూరు,రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరిని అధ్యక్షులు కల్పన మోటూరి గారు అభినందించారు.


కార్య‌క్ర‌మంలో మాతృభూమిని గుర్తు చేసేలా.. భారత దేశ భక్తి గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, ప్రధాన దాత Get Home Realty వారికి, మరియు ఇతర దాతలకు, వీక్షించిన అతిధులకు తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి గారు వందన సమర్పణతో కార్యక్రమాన్ని జయప్రదంగా ముగించారు.

First published:

Tags: Canada, International, Sankranti 2022

ఉత్తమ కథలు