Samsung heir Jay Y. Lee pardoned : దక్షిణ కొరియా (South Korea)కు చెందిన దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ శ్యామ్ సంగ్ (Samsung)వైస్ ఛైర్మన్ జయ్ వై లీ (Jay Y.Lee)కు ఊరట లభించింది. లంచం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష ఎదుర్కొంటున్న శ్యామ్ సంగ్ వారసుడు జయ్ వై లీ (54)కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించింది. దీంతో లంచం కేసులో 18 నెలల జైలు శిక్ష అనుభవించిన జయ్ వై లీకి కేసు నుంచి పూర్తిగా విముక్తి లభించింది. శ్యామ్ సంగ్ గ్రూప్ అధినేత లీ కున్ హీ పెద్ద కుమారుడైన లీ జే యాంగ్...ప్రస్తుతం శ్యామ్ సంగ్ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే శ్యామ్‌సంగ్ కు చెందిన రెండు అనుబంధ కంపెనీల విలీనం విషయమై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడానికి 2015లో అప్పటి దేశాధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హైకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై జయ్ వై లీని దక్షిణ కొరియా ప్రభుత్వం 2017లో అరెస్ట్ చేసింది. కేసును విచారించిన న్యాయస్థానం జయ్ వై లీకి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. తనకు విధించిన శిక్షపై జయ్ వై లీ అప్పీలేట్ కోర్టును ఆశ్రయించగా.. 2018లో కోర్టు ఈ శిక్షను తాత్కాలికంగా నిలిపేసింది. ఆ తర్వాత ఈ వ్యవహారం దక్షిణ కొరియా సుప్రీంకోర్టుకు చేరగా.. జయ్ వై లీకి రెండున్నర ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా 18 నెలలు జైలు జీవితం గడిపిన జయ్ వై లీ.. ఏడాది క్రితం పెరోల్‌పై విడుదల అయ్యారు. ఆయన ఏడాది క్రితం పొందిన పెరోల్‌కు దక్షిణ కొరియా సర్కార్ షరతులు విధించింది. ఐదేండ్లు ఉద్యోగ బాధ్యతలు చేపట్టరాదని, బోర్డుకు హాజరు కాకుండా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు సమర్పించే నివేదికలను మాత్రమే తీసుకోవాలని పేర్కొంది.
అయితే ఈ కేసులో జయ్ వై లీకి క్షమాబిక్ష పెట్టాలని తాజాగా దక్షిణ కొరియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15న దక్షిణ కొరియా దేశ స్వాతంత్య్ర వార్షికోత్సవం సందర్భంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఈ క్షమాభిక్ష ప్రకటన చేస్తారు. క్షమాబిక్ష లభించడంతో ఐదేళ్ల పాటు పూర్తిస్థాయి వ్యాపార కార్యకలాపాలపై విధించిన నిషేధం కూడా తొలగిపోయింది. శ్యామ్‌సంగ్ బోర్డులో చేరేందుకు.. వివిధ సంస్థలు, దేశాలతో వాణిజ్య ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్లేందుకు జయ్ వై లీకి అనుమతి లభిస్తుంది. దేశంలో నెలకున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి తన వంతు సహకారం అందించేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు దక్షిణ కొరియా వెల్లడించింది. ఈ నెల 15న దక్షిణ కొరియా దేశ స్వాతంత్య్ర వార్షికోత్సవం సందర్భంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఈ క్షమాభిక్ష ప్రకటన చేస్తారు. "ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగించింది. లీతో పాటు క్షమాభిక్ష అందుకున్న ఇతర ఉన్నత స్థాయి అధికారులు, వ్యాపారులు.. సాంకేతికత, ఉద్యోగ కల్పనలో క్రియాశీల పెట్టుబడి ద్వారా దేశం నిరంతర వృద్ధి ఇంజిన్‌కు నాయకత్వం వహించగలరు"అని దక్షిణ కొరియా న్యాయశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా తర్వాత లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లకు గిరాకీ పెరిగింది. దీనికితోడు కరోనా టైంలో లాక్‌డౌన్ వల్ల వీటిల్లో వినియోగించే సెమీ కండక్టర్ల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ ప్రభావం ఇప్పటికీ ఆటోమొబైల్, టెక్నాలజీ రంగాలను వెంటాడుతున్నది. క్షమాభిక్ష లభిస్తే సెమీ కండక్టర్ల తయారీ సంస్థల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి శ్యామ్‌సంగ్ బోర్డుకు జయ్ వై లీ సారధ్యం వహిస్తారు.
నా సేవింగ్స్ అకౌంట్ డబ్బులు ఇస్తారా? ఇవ్వరా? బ్యాంకు ఉద్యోగులను ’కిడ్నాప్‘ చేసిన కస్టమర్
అయితే ఈ కుంభకోణం బయటపడిన తర్వాత అప్పటి దేశాధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హై సర్కార్ కుప్పకూలింది. గతేడాది దక్షిణ కొరియా ప్రభుత్వం పార్క్ గున్‌హైకు క్షమాభిక్ష పెట్టింది.దివంగత మాజీ అధ్యక్షుడు పార్క్ చుంగ్ కుమార్తెనే పార్క్ గున్‌హై. దేశ తొలి అధ్యక్షురాలిగా ఆమె చరిత్ర సృష్టించింది. పార్క్ అవినీతికి వ్యతిరేకంగా దేశంలో కొన్ని నెలల పాటు ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత ఆమె తన పదవి నుంచి వైదొలిగారు. 2017లో ఆమెను అరెస్టు చేశారు. అవినీతి, ఆరోపణలు రుజువు కావడంతో 2017లో ఆమెకు 24 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ.. అక్కడి న్యాయ స్థానం తీర్పు చెప్పింది. అప్పట్లో.. కోర్టులో గున్‌హై విచారణను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆమె దుర్వినియోగం చేసినందుకు ఈ శిక్ష విధిస్తున్నట్టు అప్పట్లో న్యాయమూర్తి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samsung, South korea