హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Sako TRG 42 Rifle: అధునాతన స్నైపర్‌ రైఫిల్‌ సాకో TRG 42ను ప్రవేశపెట్టిన ఇండియన్‌ ఆర్మీ.. ఆ వివరాలు ఇలా..

Sako TRG 42 Rifle: అధునాతన స్నైపర్‌ రైఫిల్‌ సాకో TRG 42ను ప్రవేశపెట్టిన ఇండియన్‌ ఆర్మీ.. ఆ వివరాలు ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Sako TRG 42 Rifle: ఇండియన్ ఆర్మీ(Indian Army) సాకో(Sako) TRG 42 అనే రైఫిల్‌(Rifle)ను ప్రవేశపెట్టింది. వాస్తవాధీన రేఖ వద్ద విధులు నిర్వర్తించే సైనికులకు లేటెస్ట్ స్నైపర్ రైఫిల్స్ అందనుంది. 1,500 మీటర్ల లక్ష్యాలను చేధించగల సామర్థ్యం ఈ ఫిన్‌లాండ్‌ వెపన్ సొంతం.

ఇంకా చదవండి ...

Sako TRG 42 Rifle: ఇండియన్ ఆర్మీ(Indian Army) సాకో(Sako) TRG 42 అనే రైఫిల్‌(Rifle)ను ప్రవేశపెట్టింది. వాస్తవాధీన రేఖ వద్ద విధులు నిర్వర్తించే సైనికులకు లేటెస్ట్ స్నైపర్ రైఫిల్స్ అందనుంది. 1,500 మీటర్ల లక్ష్యాలను చేధించగల సామర్థ్యం ఈ ఫిన్‌లాండ్‌ వెపన్ సొంతం. ఫిన్‌లాండ్ సరికొత్త స్నైపర్‌ రైఫిల్‌ సాకో TRG 42ను భారత్ సైన్యానికి అందించింది. సాకో TRG 42ను జమ్ము కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(LOC)) వద్ద పనిచేస్తున్న సైనికులు ఉపయోగిస్తున్నారు. నియంత్రణ రేఖ వెంబడి ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా స్నైపర్స్‌ ఎదుర్కొనేలా చర్యలు తీసుకొన్నట్లు రిపోర్ట్స్‌. సైనికులు సరికొత్త రైఫిల్స్‌ను ఉపయోగించేందుకు అవసరమైన శిక్షణ పొందుతున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి.

సాకో TRG 42 ఫీచర్లు ఏంటి..?

సాకో 338 TRG 42 స్నైపర్‌ రైఫిల్స్‌ అనేది స్పెషల్‌ ఫోర్స్‌కు ట్రూ లాంగ్‌ రేంజ్‌ ప్రెసిషన్‌ టూల్స్. వీటికి ప్ర్యతర్థి దేశాల వద్ద ఉన్నవాటికంటే మెరుగైన ఫైర్‌పవర్‌, టెలిస్కోపిక్ రేంజ్‌ ఉన్నాయిని భారత సైనికులు అంటున్నారు. 2019, 20లో ప్రవేశపెట్టిన పాయింట్‌ 338 లాపువా మాగ్నమ్ స్కార్పియో టీజీటీ బై బెరెట్టా, పాయింట్‌ 50 కాలిబర్ M95 బై బెరెట్టాను సాకో రైఫిల్స్ రీప్లేస్‌ చేసింది. బోల్ట్‌ యాక్షన్‌ స్నైపర్‌ రైఫిల్‌.. సాకో TRG 42 స్నైపర్‌ రైఫిల్‌ను సాకో సంస్థ తయారు చేసింది. శక్తివంతమైన పాయింట్‌ 338 లాపువా మాగ్నమ్ సైజ్డ్‌ కాట్రిడ్జ్‌లను కాల్చేలా దీనిని తయారు చేశారు.

Germany Citizenship: జర్మనీకి వెళ్లే వారికి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం..? ఇందుకు ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి..?

దీని బరువు 6.55 కిలోలు. సాకో TRG 42 స్నైపర్‌ రైఫిల్.. 1,500 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని రిపోర్ట్స్‌. బ్లూ బ్యారెల్‌తో నలుపు, ఆకుపచ్చ రంగుల్లో అందుబాటులో ఈ రైఫిల్స్ అందుబాటుల్ ఉన్నాయి. ఆల్-బ్లాక్ స్టెల్త్ కాన్ఫిగరేషన్‌ రైఫిల్‌లో బ్లాక్ స్టాక్, బోల్ట్ ఫాస్ఫటైజ్డ్ బారెల్ యాక్షన్.. ప్రత్యేక స్టీల్‌ వినియోగంతో రైఫిల్స్‌కు సాలిడ్‌ వాల్ట్‌ లైక్‌ యాక్షన్‌.. రెండు వరుసల మ్యాగజైన్‌ను సెంటర్‌లైన్‌ నుంచి సులువుగా అందించేలా మూడా లాకింగ్‌ లగ్స్‌ దీని సొంతం.

ఫాస్ట్‌ బోల్ట్‌ థ్రో కోసం రైఫిల్‌లో 60 డిగ్రీల యాంగిల్‌ గల బోల్ట్ లిఫ్ట్ ఉంటుంది. వివిధ రకాల మందుగుండు సామగ్రిని పేల్చేలా రైఫిల్స్ తయారు చేశారు. ఇండియన్ ఆర్మీ యూనిట్లు, రెజిమెంటల్ సెంటర్ల నుంచి ఎంపిక చేసిన 10 స్నైపర్లకు రైఫిల్స్‌ అందజేశారు.

ఇండియన్‌ ఆర్మీ ఎందుకు సాకో TRG 42 రైఫిల్స్‌ ప్రవేశపెట్టింది..?

కొన్ని సంవత్సరాలుగా ఎల్‌ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి గస్తీ దళాలకు సవాలుగా మారిన స్నైపింగ్‌.. 2018, 2019 మధ్య సైన్యం నియంత్రణ రేఖ, ఐబీ వెంబడి స్నైపర్ల దాడులు పెరిగాయి. అలాంటి దాడులను ఎదుర్కొనేలా మెరుగైన స్నైపర్‌ రైఫిల్స్‌ ప్రవేశపెట్టి, స్నైపర్లకు శిక్షణ ఇస్తుంది ఇండియన్‌ ఆర్మీ.

First published:

Tags: Indian Army, Rifle

ఉత్తమ కథలు