హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Video : ముందుంది సింహాల గుంపు... ప్రాణాలతో బయటపడిన సఫారీ గైడ్...

Video : ముందుంది సింహాల గుంపు... ప్రాణాలతో బయటపడిన సఫారీ గైడ్...

వైరల్ వీడియోలో దృశ్యం (Image - YT - safariLIVE)

వైరల్ వీడియోలో దృశ్యం (Image - YT - safariLIVE)

South Africa : సింహాలతో పెట్టుకుంటే ప్రాణాలకే ప్రమాదం. ఆ విషయం ఆ సఫారీ గైడ్‌కి కూడా తెలుసు. మరి అతనెందుకు సింహాల దగ్గరకు వెళ్లాడు?

దక్షిణ ఆఫ్రికా... క్రూగర్ నేషనల్ పార్క్‌లో సఫారీ రైడింగ్ ఎంత థ్రిల్ ఇస్తుందో, అంత ప్రమాదకరం కూడా. ఎందుకంటే చుట్టూ అడవులు, ఎత్తైన గడ్డి మైదానాలు. ఎక్కడ ఏం ఉంటుందో, ఏ గడ్డి వెనక ఏ జంతువు ఉంటుందో తెలీదు. సఫారీ గైడ్‌ స్టీవ్‌కి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. దాదాపు చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు. అసలేమైందంటే... రెగ్యులర్‌గా టూరిస్టులను సఫారీ గైడ్‌కి తీసుకెళ్లే స్టీవ్... ఎప్పుడూ వెళ్లే రూట్లలో వెళ్లీ వెళ్లీ బోర్ కొట్టి... కొత్త రూట్లు వెతికాలని నిర్ణయించాడు. అందులో భాగంగా... గడ్డి మైదానాలు ఉన్న ఓ ఏరియా వైపు వెళ్లాడు. అక్కడ జీప్ ఆపి... అటువైపు వెహికిల్ వెళ్లేందుకు రూట్ ఉందేమో చూద్దామని నాలుగు అడుగులు ముందుకు వేశాడు. సడెన్‌గా షాకింగ్ సీన్. అతనికి కొన్ని అడుగుల ముందే... గడ్డి మాటున సింహాల గుంపు ఉంది. ఆ విషయం తెలియని స్టీవ్... అనుకోకుండా... అటే వెళ్లి... దాదాపు వాటికి చిక్కేంత ప్రమాదంలో పడ్డాడు. లక్కీగా ఆ సింహాలు ఆ సమయంలో వేటాడే ఉద్దేశంతో లేకపోవడంతో స్టీవ్ ప్రాణాలతో బయటపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయ్యింది.

' isDesktop="true" id="294578" youtubeid="_uMDy16lTzI" category="international">

ఈ వీడియో చూసిన ఎంతో మంది స్టీవ్‌ అదృష్టవంతుడని అంటున్నారు. నిజమే మరి... అన్ని సింహాలకు దొరికితే... ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇలాంటి సాహసాలు చెయ్యవద్దనీ, ఎంతో మందికి గైడ్‌గా వ్యవహరిస్తున్న స్టీవ్... ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.

First published:

Tags: VIRAL NEWS, Youtube

ఉత్తమ కథలు