దావోస్‌కు సద్గురు పయనం...ట్రిలియన్ మొక్కలు నాటే కార్యక్రమానికి అంకురం..

WEF శిఖరాగ్ర సమావేశం 2020 జనవరి 21 మరియు 24 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనుంది. ఇందులో పాల్గొనేవారికి సద్గురు ధ్యాన సెషన్లు, కాన్షియస్నెస్ రిట్రీట్ నిర్వహించనున్నారు.

news18-telugu
Updated: January 20, 2020, 7:38 PM IST
దావోస్‌కు సద్గురు పయనం...ట్రిలియన్ మొక్కలు నాటే కార్యక్రమానికి అంకురం..
సద్గురు
  • Share this:
దావోస్‌ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు, ఈ ఏడాది జరగబోయే సమ్మిట్‌లో ముఖ్య వక్తలలో ఒకరిగా ఉన్నారు. 50 వ వార్షికోత్సవం నేపథ్యంలో సద్గురు ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. WEF శిఖరాగ్ర సమావేశం 2020 జనవరి 21 మరియు 24 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనుంది. ఇందులో పాల్గొనేవారికి సద్గురు ధ్యాన సెషన్లు, కాన్షియస్నెస్ రిట్రీట్ నిర్వహించనున్నారు. అలాగే ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్‌ఇపి) ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎఒ) నేతృత్వంలోని ప్రపంచ ఆర్థిక ఫోరం చొరవతో 1 ట్రిలియన్ ట్రీస్ కార్యక్రమంలో సద్గురు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం జనవరి 23 న జరగనుంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1 ట్రిలియన్ చెట్లను నాటే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించారు.

దేశాధినేతలు, వ్యాపారవేత్తలు, ప్రపంచ సంస్థలు, అనేక విద్యాసంస్థల ప్రతినిధులతో సహా ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన నాయకులు ఈ సదస్సులో హాజరుకానున్నారు. ఎడారీకరణ అలాగే వాతావరణ మార్పు వంటి ప్రపంచ పర్యావరణ పోకడలను తిప్పికొట్టడానికి కార్యాచరణ అలాగే ప్రభుత్వ-ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ఈ వేదిక ప్రయత్నించనుంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా 2021-2030 దశాబ్దంలో గొప్ప కృషి ప్రారంభించింది. అందుకు మద్దతుగా ఈ కార్యక్రమం రూపొందించబడింది.

 

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు