హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US Election Result 2020: జో బిడెన్ గెలుపును ముందే చెప్పిన ఆ జంతువులు... ఎలా?

US Election Result 2020: జో బిడెన్ గెలుపును ముందే చెప్పిన ఆ జంతువులు... ఎలా?

అమెరికా ఎన్నికల ఫలితాలని ముందే చెప్పిన జంతువులు (credit - CNN)

అమెరికా ఎన్నికల ఫలితాలని ముందే చెప్పిన జంతువులు (credit - CNN)

US Presidential Election Animal Prediction: ఎన్నికలు, గేమ్స్ జరిగేటప్పుడు జంతువులు, ప్రాణులతో అంచనా వేయించడం ఎప్పుడూ జరిగేదే. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ అలాంటి ప్రయోగం చేశారు. అది గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

  US Presidential Election Animal Prediction: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్నదానిపై అమెరికాలో పెద్ద చర్చలే జరిగాయి. ఆ సందర్భంగా... రష్యాలోని... రొయెవ్ రుచే జూలో సరదాగా ఓ అంచనాను జంతువులతో వేయించారు. ఈ అంచనా కార్యక్రమంలో ఖాన్, బుయాన్, బార్టెక్ అనే మూడు జంతువులు పాల్గొన్నాయి. చిత్రమేంటంటే... ఇవి పుచ్చకాయల ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచేదీ ముందే చెప్పాయి. ఇందుకోసం సమాన సైజ్, సమాన కలర్ ఉన్న పుచ్చకాయలపై ట్రంప్, బిడెన్ ముఖాలను చిత్రీకరించారు. ఇలా 6 పుచ్చకాయలను సిద్ధం చేశారు.

  ముందుగా... బార్టెక్ పులి ఉండే బోనులో 2 పుచ్చకాయలు ఉంచారు. వాటికి ఒకవైపు ట్రంప్, బిడెన్ ముఖాలను చిత్రీకరించారు. ఐతే... పులికి మాత్రం ముఖాలు చిత్రీకరించిన వైపు కాకుండా పుచ్చకాయలను మరోవైపు తిప్పి ఉంచారు. వెంటనే బార్టెక్... బిడెన్ పుచ్చకాయను కదిపి... దొర్లించుకుంటూ వెళ్లి తినేసింది.

  ఆ తర్వాత ఖాన్ అనే తెలుపు బెంగాల్ టైగర్‌కి కూడా మరో 2 పుచ్చకాయలు ఇవ్వగా... అది కూడా జో బిడెన్ పుచ్చకాయను తన్నుకుంటూ ఆటాడుకుంది. ఆ తర్వాత మధ్యలో కన్నం పెట్టి తినేసింది.

  US Election Predictions, animals election predictions, russia zoo us elections, us elections trump win, us elections joe biden win, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, యుగాంతం, జో బిడెన్ గెలుపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేదెవరు?
  డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ (File Images)

  ఇక చివరిగా బుయాన్ ఎలుగు బంటికి 2 వాటర్ మెలన్స్ ఇస్తే... అది కూడా డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ నే సెలెక్ట్ చేసుకుంది. పుచ్చకాయను తినేసింది.

  ' isDesktop="true" id="649260" youtubeid="s9BCsdh7IPY" category="international">

  మొత్తానికి ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతారనీ, జో బిడెన్ గెలుస్తారనీ ఈ మూడు జంతువులూ ముందే అంచనా వేశాయి. నిజంగానే అదే జరిగింది. దాంతో ఈ జంతువుల కరెక్ట్ అంచనాపై ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: US Elections 2020

  ఉత్తమ కథలు