RUSSIAS ACTIONS ON UKRAINE WILL HAVE SERIOUS CONSEQUENCES IF THEY ARE NOT STOPPED SAYS SECRETARY OF STATE ANTHONY BLINKEN GH VB
USA: యుద్ధం ప్రారంభించడం కాదు.. ఆపడమే లక్ష్యం.. రష్యా ముందుకెళ్తే తీవ్ర పరిణామాలు..!
ప్రతీకాత్మక చిత్రం
రష్యా తమ బలగాలను(Military Troops), యుద్ధ ట్యాంకులను, విమానాలను ఉపసంహరించుకోవాలని, చర్చలకు సిద్ధమవ్వాలని ఆంటోని బ్లింకెన్ కోరారు. ఉక్రెయిన్‌పై దాడులు చేయమని రష్యా ఈ రోజు ఎలాంటి సదుద్దేశం లేకుండా ప్రకటించే అవకాశం ఉందని, కానీ ఆ విషయం స్పష్టంగా ప్రపంచానికి తెలియజేయాలని చ
ఉక్రెయిన్(Ukraine), రష్యా(Russia) మధ్య నెలకొన్న పరిస్థితులపై గురువారం ఉదయం న్యూయార్క్‌లో జరిగిన యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్ మీటింగ్‌లో (UN Security Council Meeting) సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్ (Antony Blinken) మాట్లాడారు. ఉక్రెయిన్ను నాశనం చేసే లక్ష్యంతో రష్యా పావులు కదుపుతోందని, తగిన సమాచారం తమ వద్ద ఉందని ఆరోపించారు. రష్యా ఆరోపిస్తున్నట్లు తమ ఉద్దేశం యుద్ధాన్ని ప్రారంభించడం కాదని, ఓ యుద్ధాన్ని జరుగకుండా ఆపాలనే ఉద్దేశంలో ఉన్నామని స్పష్టం చేశారు. రష్యా తమ బలగాలను(Military Troops), యుద్ధ ట్యాంకులను, విమానాలను(Flights) ఉపసంహరించుకోవాలని, చర్చలకు సిద్ధమవ్వాలని ఆంటోని బ్లింకెన్ కోరారు.
ఉక్రెయిన్‌పై దాడులు చేయమని రష్యా ఈ రోజు ఎలాంటి సదుద్దేశం లేకుండా ప్రకటించే అవకాశం ఉందని, కానీ ఆ విషయం స్పష్టంగా ప్రపంచానికి తెలియజేయాలని చెప్పారు. రష్యా సైనికులను వెనక్కి పిలవాలని, ట్యాంకులను, విమానాలను రష్యన్ బేస్‌కు తరలించాలని కోరారు. చర్చలకు ముందుకు రావడం ద్వారా రష్యా ఉద్దేశం యుద్ధం కాదనేది తెలియజేయాలని తెలిపారు. 150,000 ట్రూప్స్‌ను ఉపసంహరించుకొన్నట్లు రష్యా చేసిన ప్రకటనను బ్లింకెన్ తప్పుబట్టారు. వాస్తవానికి సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలు వేరని చెప్పారు.
తమకున్న సమాచారం మేరకు కొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్‌పై దాడులు జరపడానికి సైనికులను, ట్యాంకులను, యుద్ధ విమానాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిసిందని వివరించారు. రష్యా వెళ్తున్న ధోరణి ఒక్క ఉక్రెయిన్‌కే కాదని ప్రపంపం మొత్తానికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని అన్నారు. ఇప్పుడు నెలకొని ఉన్న పరిస్థితులు యూఎన్ కౌన్సిల్లో ఉన్న ప్రతి సభ్యుడు, ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. రెండు ప్రపంచ యుద్ధాలను చూసిన దేశాలు శాంతి, భద్రత, విలువలపై నిలబడి ఉన్నాయన్నారు. కోల్డ్‌వార్ ముప్పు ముందు ఉందని, ఏ దేశం కూడా మరో దేశం సరిహద్దులను బలవంతంగా మార్చలేదని అభిప్రాయపడ్డారు.
ఉక్రెయిన్‌పై దాడులు జరిపేందుకు రష్యా సిద్ధం చేసిన ప్రణాళికలో భాగమే నిరాధారణ ఆరోపణలని చెప్పారు. ప్రపంచం ముందు తమ చర్యలను సరైనవేనని చెప్పుకొనేందుకు సామూహిక హత్యలు, మిన్స్క్ ఒప్పందం ఉల్లంఘనను ముందుకు రష్యా తీసుకొస్తోందని అన్నారు. అమెరికా చర్యలను ఎదుర్కొనే లక్ష్యంతోనే రష్యా పక్షాన చైనా చేరిందన్నారు. ఉక్రెయిన్ను వివాదరహితం చేయడానికి తమపై నిందలు మోపుతున్నారని రష్యా, చైనా చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఉక్రెయిన్‌లో డన్బాస్లో ఉద్రిక్తర పరిస్థితులు ఉన్నాయని, మిన్స్క్ ఒప్పందాల పరిరక్షణ లక్ష్యమనే ముసుగులో యుద్ధానికి రష్యా వ్యూహాలు సిద్ధం చేసుకొంటోందని ఆరోపించారు.
రష్యా నిందలను తిప్పికొట్టడంలో ఉక్రెయిన్‌కు ఇతర దేశాల సహకారం అవసరం లేదని, స్వతహాగా ఆ పని చేసుకొనే సత్తా ఉక్రెయిన్‌కు ఉందని పునరుద్ఘాటించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రపంచానికి మేలు చేసే చర్యలు విస్మరించమని, కచ్చితంగా జరుగబోయే దారుణాలను అడ్డుకొని తీరుతామని చెప్పారు. ఎన్4 సమ్మిట్ నిర్వహణకు రష్యా సిద్ధంగా లేకున్నా ముందుకే వెళ్తామని కుండ బద్దలు కొట్టారు.
ఉక్రెయిన్‌లోని కొన్ని కీలక ప్రాంతాలే లక్ష్యంగా రష్యా వ్యూహాలు సిద్ధం చేసుకొందని, దీనిపై ఎప్పటికప్పుడు ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని వెస్ర్టన్ కంట్రీస్ అప్రమత్తం చేస్తున్నాయని బ్లింకెన్ తెలిపారు. ప్రపంచానికి రష్యా అసలు ఉద్దేశాలు తెలియజేయడమే లక్ష్యమని, ప్రపంచానికి నిజం తెలిస్తే యుద్ధం ఆలోచనను రష్యా విరమించి మరో మార్గం ఎంచుకొనే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు. ఆరోపణలు సృష్టించి, =, ఉక్రెయిన్ క్రైసిస్‌పై సమావేశాలు నిర్వహించాలని, అంతిమంగా దాడులకు మార్గం సుగమం చేయాలనేది రష్యా ప్లాన్‌గా అభివర్ణించారు. ఈ ఆరోపణలను ముందు పెట్టి దాడికి దిగితే ప్రపంచం ముందు రష్యా దోషిగా నిలవడం కాయమన్నారు.
గతంలో ఇతర దేశాలపై చేసిన దాడులన్నీ, చెప్పినవన్నీ అవాస్తవాలే అవుతాయని, ఎప్పుడూ దౌత్య సంబంధాలను రష్యా గౌరవించలేదని భావించాల్సిందేనని చెప్పారు. ఆవేశపూరిత నిర్ణయాలకు రష్యా వెళ్తే.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా అమెరికా యూరోపియన్ దేశాలు ఉన్నాయన్నారు. రష్యా మిలిటరీ యాక్టివిటీస్‌పై పూర్తి వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే తమ సైన్యం గొప్పదని చాటే పనిలో చైనా (China)ఉందని, ఆదేశం చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆసియా- పసిఫిక్ రీజియన్‌లో చైనా అనవసర వివాదాలు సృష్టిస్తోందని, ఆయా దేశాల్లో గందరగోళ పరిస్థితులకు కారణమవుతోందని అన్నారు. కోల్డ్‌వార్ మెంటాలిటీ దాచి.. ఆధిపత్యం చలాయించే యోచనలో డ్రాగన్ దేశం ఉందని వివరించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.