• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • RUSSIAN VOTERS BACK REFORMS ALLOWING VLADIMIR PUTIN TO RULE UNTIL 2036 BN

రష్యా రాజ్యాంగం కీలక సంస్కరణలు.. 2036 వరకు పుతినే అధ్యక్షుడు..

రష్యా రాజ్యాంగం కీలక సంస్కరణలు.. 2036 వరకు పుతినే అధ్యక్షుడు..

రష్యా అధ్యక్షుడు పుతిన్(ఫైల్ ఫోటో)

ప్రస్తుత సంస్కరణల వల్ల పుతిన్ ప్రస్తుతం ఆరు సంవత్సరాల కాలపరిమితి ముగిసిన(అంటే 2024 తర్వాత) తర్వాత కూడా మరో రెండు సార్లు అంటే 2036 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్ కొనసాగేందుకు వీలు కలిగింది.

  • Share this:
    రష్యా దేశాధ్యక్ష పీఠంపై ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2036 వరకు కొనసాగేందుకు వీలు కల్పించే రాజ్యాంగ సంస్కరణలను రష్యా ప్రజలు ఆమోదించారు. అయితే రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించి రష్యా ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు వారం రోజుల పాటు ఎన్నికలు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. కాగా ఈ ఎన్నికల్లో 63 శఆతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 73 శాతం మంది పుతిన్‌ను దేశాధ్యక్షుడిగా 2036 వరకు కొనసాగించేందుకు తీసుకొచ్చిన సంస్కరణలకు అనుకూలంగా ఓటు వేసినట్టు రష్యా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇదిలావుంటే.. ఈ రాజ్యాంగ సవరణలను కొన్ని వారాలకు ముందే రష్యా పార్లమెంటు ఆమోదించింది.

    కొత్త రాజ్యాంగానికి సంబంధించిన కాపీలు సైతం బుక్ స్టాల్స్‌లో అందుబాటులో ఉంచారు. ఈ సంస్కరణల్లో పెన్షన్లు ఇవ్వడం, స్వలింగ వివాహంపై నిషేదం వంటి అంశాలు సైతం ఉన్నాయి. ప్రస్తుత సంస్కరణల వల్ల పుతిన్ ప్రస్తుతం ఆరు సంవత్సరాల కాలపరిమితి ముగిసిన(అంటే 2024 తర్వాత) తర్వాత కూడా మరో రెండు సార్లు అంటే 2036 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్ కొనసాగేందుకు వీలు కలిగింది. అయితే సంస్కరణలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి వారం రోజుల పాటు ఓటింగ్ చేపట్టింది.

    అందులో భాగంగా ఓటింగ్ చివరి రోజు జాతీయ సెలవుదినంగా ప్రకటించింది. ఓటర్లకు సంస్కరణలకు అనుకూలంగా ఓటు వేసేందుకు అపార్టుమెంట్లు, కార్లు, నగదుతో సహా బహుమతులు అందించారన్న విమర్శలు లేకపోలేదు. వాస్తవానికి ఈ ప్రజాభిప్రాయ సేకరణను ఏప్రిల్ 22వ తేదీనే నిర్వహించాల్సి ఉండగా, కరోనా వైరస్ మహమ్మారి వాయిదా వేశామని పుతిన్ ఒక ప్రకటనలో తెలిపారు. రష్యా భవిష్యత్ కోసం స్థిరత్వం, భద్రత, శ్రేయస్సు వంటి అంశాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

    అయితే ఈ సందర్భంగా 79 సంవత్సరాల వాలెంటినా కుంగూర్ సేవా అనే ఓటరు స్పందిస్తూ..మాకు ప్రతి సంవత్సరం పెన్షన్ పెంచడం చాలా అవసరం, మాకు మంచి అధ్యక్షుడు ఉన్నంత కాలం మా జీవితం బాగుంటుంది. ఈ సంస్కరణలకు పూర్తి మద్దతునిస్తున్నానంటూ ఆమె వ్యాఖ్యనించింది. ఓటింగ్ ప్రక్రియలో కొన్ని అవకతవకలు జరిగాయంటూ కొంతమంది ఆరోపించారు. ఏదిఏమైనా 2036 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ను ఉంచేలా చేసిన సంస్కరణలు దాదాపుగా విజయవంతమయ్యాయి.
    First published:

    అగ్ర కథనాలు