RUSSIAN UKRAINE WAR UPDATES RUSSIAN DRONES NOT SEEN IN UKRAINE WAR IS THAT RUSSIA STRATEGY MKS GH
Russia Ukraine War: ఉక్రెయిన్ వణికిస్తున్నా కిల్లర్ డ్రోన్స్ బయటికి తీయని రష్యా.. ఏంటి వ్యూహం?
ప్రతీకాత్మక చిత్రం
యుద్ధం రెండో నెలలోకి ప్రవేశించినా.. రష్యా తన అమ్ములపొదిలోని కిల్లర్ డ్రోన్స్ ను ఇంకా బయటికి తీయలేదు. ఉక్రెయిన్ నుంచి ఊహించని రీతిలో ప్రతిఘటన ఎదురవుతున్నా డ్రోన్లతో సమాధానానికి వెనుకడుగు వేస్తోంది.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం రెండో నెలలోకి ప్రవేశించినా.. రష్యా తన అమ్ములపొదిలోని కిల్లర్ డ్రోన్స్ ను ఇంకా బయటికి తీయలేదు. ఉక్రెయిన్ నుంచి ఊహించని రీతిలో ప్రతిఘటన ఎదురవుతున్నా, ఉక్రెయిన్ తన టర్కిష్ డ్రోన్లలో ఏకంగా రష్యా ఇంధనకేంద్రంపై దాడి చేసినా కిల్లర్ డ్రోన్ల వినియోగం విషయంలో పుతిన్ సంయమనం పాటిస్తున్నారు. దీనిపై ఆసక్తికర విశ్లేషణలు వెలువడుతున్నాయి..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభానికి ముందు రష్యా డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు భావించారు. రష్యాకి చెందిన కిల్లర్ రోబోట్స్ శక్తివంతమైన ఆయుధాలుగా ఉపయోగపడతాయని అంచనావేశారు. కానీ రెండో నెలలోకి యుద్ధం ప్రవేశించినా రష్యా డ్రోన్లు ఇప్పటికీ కనిపించడంలేదు.
* ఉక్రెయిన్ వెర్సస్ రష్యా: ది వార్ ఆఫ్ డ్రోన్స్
2021 ఒప్పంద ప్రకారం టర్కీ నుంచి అందిన టర్కిష్ బైరక్టార్ TB2 డ్రోన్లపైనే ఉక్రెయిన్ ప్రధానంగా ఆధారపడింది. రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్స్‌కు రాకెట్స్, మిసైల్స్‌ను మోయగల శక్తి ఉంది. గ్రౌండ్ ఫోర్సెస్ ఈ డ్రోన్లను నిర్వహిస్తున్నారు. రష్యా సైనికుల లక్ష్యాలను గుర్తించి దాడులు చేయడానికి కమర్షియల్ డ్రోన్లను ఉక్రెయిన్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. రష్యన్ ట్యాంకులను లక్ష్యంగా చేసుకోక ముందు స్వదేశీ డ్రోన్లతో జ్యూరీ-రిగ్గింగ్ పేలుడు పదార్థాలను తరలించడాన్ని ఉక్రెయిన్ పరిశీలించినట్లు నివేదికలున్నాయి.
రష్యా డ్రోన్లకు సంబంధించి తెలిసిన తక్కువ సమాచారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యమున్న కొత్త డ్రోన్ల గురించి తెలిసింది శూన్యం. శత్రువుల ఎయిర్కాఫ్ట్లను ట్రాక్ చేసి ధ్వంసం చేయగల యూఏవీ సామర్థ్యమున్న స్వార్మ్ డ్రోన్లను పరీక్షిస్తున్న రష్యా. వీటిని ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఉపయోగించినట్లు చెప్పడానికి కొరవడిన ఆధారాలు
* ఉద్దేశపూర్వకంగానే రష్యా డ్రోన్లను ఉపయోగించట్లేదా?
యుద్ధం తీవ్రమయ్యాక ఉపయోగించేందుకు డ్రోన్లను రష్యా వినియోగించడం లేదని విశ్లేషణలు ఉన్నాయి. సైనికులకు ప్రమాదం లేకుండా డ్రోన్లతో రసాయన, జీవ, అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం ఉందంటున్నారు. ఉక్రెయిన్‌లో లాజిస్టిక్స్ సమస్యలతో డ్రోన్ల వినియోగానికి రష్యా దూరంగా ఉంటున్నట్లు కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. డ్రోన్ల సాంకేతికతపై నమ్మకం లేకనే రష్యా ఉపయోగించట్లేదని RAND ఇన్స్టిట్యూట్ నిపుణులు అంటున్నారు. డ్రోన్ టెక్నాలజీ శత్రువుల చేతుల్లోకి వెళ్లకుండా కూడా రష్యా జాగ్రత్త పడుతుండవచ్చని కూడా విశ్లేషణలున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్లను ఉపయోగిస్తోందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
* డ్రోన్స్: ది ఫ్యూచర్ ఆఫ్ వార్ఫేర్
స్వయంప్రతిపత్త ఆయుధ సాంకేతికతలపై భారీగా పెట్టుబడులు పెడుతున్న ప్రపంచ దేశాలు. ట్యాంకులు, ఎయిర్‌క్రాఫ్ట్‌ల కంటే తక్కువ ఖర్చుతో అందుతున్న డ్రోన్లకు ప్రాధాన్యం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధితో అంచనా వేయడానికి కష్టతరమైన అవకాశాలు, ముప్పులు పెరుగుతాయని 2017లో చెప్పిన పుతిన్. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పుడు శత్రు విమానాల నుంచి రక్షణకు ఇంటర్‌సెప్టర్ డ్రోన్లను ఉపయోగించిన రష్యా.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.