రష్యా మిలిటరీలో సిబ్బంది సంక్షోభం కొనసాగుతుంది. జాతి పరంగా ఉక్రెయిన్‌లో తన యుద్ధానికి అవసరమైన యోధులను కనుగొనేందుకు మాస్కో ప్రయత్నిస్తోంది. దీనికి గాను.. మాస్కో నార్త్ కాకసస్ ప్రాంతం నుంచి కొత్త యూనిట్లను ఏర్పాటు చేయడానికి భారీగా రిక్రూట్మెంట్ చేస్తుంది. అదే విధంగా, డాగెస్తాన్, ఇంగుషెటియా, కల్మికియా నుంచి రైఫిల్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రాంతీయ అధికారులు ప్రణాళికలు ప్రకటించిన రూపొందించారు. కాగా, గతంలో సైనిక శిక్షణ పొందిన కాంట్రాక్టు సైనికులతో పలు కంపెనీలు ఏర్పాడ్డాయి.
ఉక్రెయిన్ యుద్ధంలో చేరమని సైనిక వయసున్న పురుషులను ఒత్తిడి చేయడం, ప్రలోభపెట్టడం కూడా లక్ష్యంగా పెట్టుకుని స్థానిక రిక్రూట్మెంట్ డ్రైవ్‌లు చేపట్టారు. (ఈ ఉత్తర కాకసస్ రిపబ్లిక్ల) గవర్నర్లు మిలిటరీ రిజిస్ట్రేషన్, ఎన్లిస్ట్మెంట్ ఆఫీసుల ద్వారా అధికారిక రిక్రూట్మెంట్తో పాటు అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని ఆర్మీ, లా, డైరెక్టర్ సిటిజన్ సెర్గీ క్రివెంకో ఆదేశించారు. RFE/RL నార్త్ కాకసస్ సర్వీస్ ప్రాంతీయ వార్తా ఔట్‌లెట్‌తో రష్యా అంతటా ఇటువంటి యూనిట్ల ఏర్పాటు జరుగుతోందని క్రివెంకో తెలిపారు.
ఉత్తర కాకసస్ ఒక నిర్దిష్ట లక్ష్యం, ఈ ప్రాంతం మొత్తం దేశంలోనే అత్యల్ప జీవన ప్రమాణాలు, జీతాలు ఉన్నాయి. నిర్బంధించబడినవారు, ఒప్పందంపై సంతకం చేసిన వారు రష్యన్ సాయుధ దళాలలో సైనికుల హోదాను పొందుతారని సెర్గీ క్రివెంకో తెలిపారు. వాలంటీర్లుగా పేర్కొనే రెండో వర్గం వారితో ఎలాంటి ఒప్పందం ఉంటుంది? ఎలాంటి చట్టపరమైన బాధ్యతలు ఉన్నాయి? అనే అంశాలపై స్పష్టత లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రిజర్వ్‌లను పిలుస్తున్నాయని సైనిక సమస్యలపై పనిచేస్తున్న రష్యన్ మానవ హక్కుల సంఘాల నివేదికలు వెలువరించాయి.
అదే విధంగా.. రిజర్విస్ట్‌లను పరిశీలన, వ్యక్తిగత సమాచారం అప్డేట్ కోసం వీరిని నియమించనున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి వెళ్లడానికి ఒప్పందాలను చేసుకుంటారని సమాచారం. సైనిక సిబ్బందికి చట్టం ద్వారా ఎటువంటి సామాజిక ప్రయోజనాలు, వేతన హామీలు లేవని కొంతమంది రిజర్విస్టులు తెలిపారు . ఉక్రెయిన్‌పై నాలుగు నెలల యుద్ధం తర్వాత భారీ నష్టాలను క్రెమ్లిన్ చవిచూసింది.
అయినప్పటికీ డ్రాఫ్ట్-వయస్సు సైనికుల సాధారణ సమీకరణను ఆదేశించడానికి ఇప్పటివరకు రష్యా నిరాకరించింది. రష్యా అంతటా రిక్రూటర్లు కాంట్రాక్ట్ సైనిక సేవలను ప్రోత్సహించడానికి, రిజర్వ్‌లను తిరిగి రియాక్టివేట్ చేయడానికి అర్హులైన పురుషులకు అధికారులు పిలుస్తున్నారు. రష్యా, జూలై మధ్య నాటికి 18-27 సంవత్సరాల మధ్య వయస్సు గల 130,000 మంది పురుషులను సమీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. చట్టం ప్రకారం నిర్బంధించిన వారికి కనీసం నాలుగు నెలల శిక్షణ ఉంటే తప్ప వారిని యుద్ధానికి పంపలేరని సమాచారం. అనుభవం లేని సైనికులను యుద్ధానికి పంపినట్లు ధ్రువీకరణ అయిన అనేక కేసులకు విరుద్ధంగా, ఉక్రెయిన్‌కు సైనికులను బలవంతంగా పంపమని మాస్కోతెల్చిచెప్పింది. రష్యన్ సైన్యం ఎదుర్కొంటున్న విస్తృత సిబ్బంది సంక్షోభానికి జాతి పరంగా యూనిట్ల సృష్టి అవసరం కార్యకర్తలు అంటున్నారు.
రంజాన్ కదిరోవ్ అధికారంలో చెచెన్ బ్రిగేడ్లతో ఉక్రెయిన్ యుద్ధంలో జాతి పరంగా ఏర్పడిన సైనిక విభాగాలను రష్యా ఉపయోగించింది. ఉత్తర కాకసస్‌లోని రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ డాగెస్తాన్ ఉక్రెయిన్‌లో జరిగిన యుద్ధం అంతటా కాంట్రాక్ట్ సైనికులు కనిపించించారు. చెచ్న్యాలో, మానవ హక్కుల సంఘాలు, బ్లాగర్ల ప్రకారం నుంచి వీరు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కోసం ఈ ప్రాంతంలోని పారామిలిటరీ గ్రూపుల్లో చేరమని పోరాడే వయసు గల పురుషులకు బెదిరింపులకు గురిచేస్తున్నారు. తమకు వాగ్దానం చేసిన జీతాలు నిరాకరించారని, సరైన పరికరాలు లేదా సామాగ్రి లేకుండా యుద్ధానికి పంపారని నలుగురు పురుషుల ఫిర్యాదు చేశారు.
చెచెన్ పార్లమెంట్ స్పీకర్ తిట్టడంతో టెలివిజన్ సమావేశంలో ఫిర్యాదుల ఉపసంహరణ జరిగింది. దళాల కొరతను అధిగమించడానికి రష్యా తీసుకున్న అనేక చర్యలు తీసుకుంది. మేలో, ఉక్రెయిన్‌లో భారీ ప్రాణనష్టం మధ్య రిక్రూట్లను విస్తరించే ప్రయత్నంలో సైనిక సేవ కోసం వయోపరిమితిని రష్యా తగ్గించింది. మొదటిసారి సైనిక సేవా ఒప్పందాలపై 40 ఏళ్లు పైబడిన రష్యన్లు సంతకాలను చేస్తున్నారు. రష్యా కూడా ఉక్రెయిన్‌లో తన దాడిని బలోపేతం చేయడానికి క్రెమ్లిన్-లింక్డ్ వాగ్నర్ గ్రూప్ నుంచి ఫైటర్లను నియమించుకున్నట్లు నివేదిక వెలువడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War