ఉక్రెయిన్ (Ukraine) దళాలకు ఘోరమైన నష్టాన్ని కలిగిస్తున్న చిన్న రష్యన్ డ్రోన్లు(Russian Drones). లేజర్ గైడెడ్(Guided) ఆర్టిలరీ రౌండ్లతో ప్రాణాంతకంగా మారిన డ్రోన్లు(Drones). రష్యా డ్రోన్లు(Russia Drones) ఊహించినంత అధునాతనంగా లేవని నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల రష్యన్ సైనిక నిఘా డ్రోన్‌ను(Drones) విడదీస్తున్న సైనికుడి వీడియోను (Videos) ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. డ్రోన్ అసాధారణమైన డిజైన్‌లో(Device) ఉందని.. ప్రధాన భాగంలో లోయర్ ఎండ్(Lower End) Canon DSLR కెమెరా(Camera) ఉందని వెల్లడి. రష్యా డ్రోన్ లోపల ఏముందంటే.. వీడియోలో ఉక్రెయిన్‌లో కుప్పకూలిన రష్యన్ ఓర్లన్-10 మానవరహిత వైమానిక వాహనం(UAV) పక్కన కూర్చున్న సైనికుడు.. ఫోటోలు తీయడానికి డ్రోన్‌లో వినియోగించిన ప్రైమరీ కెమెరా కెమెరా Canon EOS 750 D గా సైనికుడు గుర్తించాడు. DSLR కెమెరా 2015లో 750 డాలర్ల ధరతో అందుబాటులోకి రాగా.. ప్రస్తుతం ఉపయోగించిన కెమెరా విలువ మార్కెట్లో 300 నుంచి 400 డాలర్లు ఉంది.
కెమెరాను హుక్-అండ్-లూప్ ఫాస్టెనర్ స్ట్రిప్‌తో కూడిన బోర్డుకు అమర్చారని.. దీన్ని వెల్క్రో అని కూడా పిలుస్తారని వెల్లడి. స్తంభించిపోయిన స్థితిలో కెమెరా మోడ్ డయల్.. ప్రమాదసమయాల్లో రికార్డు చేయకుండా నిషేధించే సదుపాయం. డ్రోన్ పైభాగంలోని ఇంధన ట్యాంక్ టోపీని ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌తో తయారు చేసి ఉండవచ్చని సమాచారం. డ్రోన్లోని వివిధ భాగాలను కూడా ఒక రకమైన డక్ట్ టేప్‌తో కలిపి ఉంచినట్లు వీడియోలో దృశ్యాలు కనిపించాయి. డ్రోన్‌ను చూస్తుంటే రష్యన్ టెక్నాలజీలో లోపాలు బయటపడుతున్నాయని కొందరు నిపుణులు అంటున్నారు. ఆధునిక వాణిజ్య సాంకేతికతను ఉత్తమంగా ఉపయోగించుకునే సరళమైన, ఆచరణాత్మక మార్గంగానూ ప్రాధాన్యం.
ఉక్రెయిన్‌లో రష్యన్ UAVల విజయం..
రష్యాకు చెందిన మానవరహిత వైమానిక దళం కంటే మానవ సహిత వైమానిక దళం ప్రభావితంగా కనిపించట్లేదు. మాస్కో కనీసం 19 యుద్ధ విమానాలు, 32 హెలికాప్టర్లను కోల్పోయిందని.. ఇంకా నష్టం పెరిగే అవకాశాలు ఉన్నాయని రిపోర్ట్స్‌లో తెలుస్తోంది. రష్యా విడుదల చేసిన డ్రోన్ వీడియోలలో కనిపిస్తున్న ఉక్రెయిన్ సాయుధ వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. రష్యా UAVలలో ప్రాణాంతక క్రాస్నోపోల్ లేజర్-గైడెడ్ ఆర్టిలరీ షెల్ అనే ఆయుధాలు వినియోగిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
ఉక్రెయిన్‌లో క్రాస్నోపోల్ లేజర్-గైడెడ్ ఆర్టిలరీ షెల్‌ను విస్తృతంగా రష్యా మోహరించింది. తొలుత సిద్ధం చేసిన క్రాస్నోపోల్ బరువు 110 పౌండ్లు.. 20 కి మీ ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే శక్తి ఉంటుంది. అప్‌గ్రేడ్ వెర్షన్లకు 95 శాతం విశ్వసనీయతతో 43 కి.మీ పరిధిలోని లక్ష్యాలను చేధించే సామర్థ్యం ఉంటుంది. 14 పౌండ్ల వార్‌హెడ్ నిటారుగా వస్తుందని, సన్నని టాప్ కవచం ద్వారా గుద్దుతుందని, భారీ ట్యాంక్‌లను కూడా పడగొట్టగలదని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. డ్రోన్లతో అనుసంధానం చేయడంతో క్రాస్నోపోల్ మరింత విజయవంతమయ్యాయని నివేదికలు తెలుపుతున్నాయి. క్రాస్నోపోల్ లేజర్-గైడెడ్ ఆర్టిలరీ షెల్‌ను కాల్చడానికి రష్యా సాధారణంగా ఓర్లాన్-10 లను వినియోగిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ఓర్లాన్-10 అంటే ఏమిటి..?
ఓర్లాన్-10 అనేది ఒక రష్యన్ UAV.. 2010లో కెమెరాలు, సెన్సార్లను మోసుకెళ్లే సేవల్లోకి ప్రవేశించింది. 2020లో ఓర్లాన్-10కి లేజర్ డిజైనేటర్ అమర్చి కొత్తగా రష్యా అప్‌గ్రేడ్ చేసింది. డ్రోన్ మాడ్యులర్ ద్వారా కొత్త పరికరాలకు అనుగుణంగా పేలోడ్లను మార్చుకొనే అవకాశం ఉంటుంది. ఓర్లాన్-10 అనేది పది అడుగుల విస్తీర్ణం గల చిన్న వాహనం.. ఇది 18 గంటల పాటు 80 mph వేగంతో ప్రయాణించగలదు. ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు సుమారు 14 ఓర్లన్-10లు ధ్వంసమైనట్లు నివేదికలు చెబుతున్నాయి.
సాధారణంగా పెద్ద తుపాకీలతో సమన్వయం చేసిన డ్రోన్లను ఉపయోగించి గణనీయమైన ప్రయోజనాలను పొందాలనే యోచనలో రష్యా ఉంది. రష్యన్ ఓర్లాన్-10 యూనిట్‌కు 87,000 నుంచి 120,000 డాలర్ల మధ్య ఖర్చు అవుతుందంటున్న నివేదికలు చెబుతున్నాయి. ఓర్లాన్-10ను ష్యా ఆధారిత స్పెషల్ టెక్నాలాజికల్ సెంటర్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. హల్ అండ్ ఇంజిన్ రష్యాలో తయారు కాగా.. ఎలక్ట్రానిక్ భాగాలు తైవాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. వీటిని తరచుగా డాన్‌బాస్‌లో నిఘా, ఆర్టిలరీ ఫైర్ సర్దుబాటు కోసం రష్యా వినియోగిస్తోందని సమాచారం. డ్రోన్‌లో ఉపయోగించే కొన్ని ఎలక్ట్రానిక్ భాగాలు జపాన్ నుంచి కూడా వచ్చినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
Business Idea: ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్... రూ.70,000 పెట్టుబడి చాలు
ఇప్పటి వరకు ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్ల వినియోగం..?
కమెర్షియల్ క్వాడ్కాప్టర్ల నుంచి ఫిక్స్డ్ వింగ్ మిలిటరీ మోడల్స్ వరకు ఉక్రెయిన్‌కు డ్రోన్లు ముఖ్యమని స్పష్టం అవుతోంది. ఉక్రెయిన్ తక్కువ బడ్జెట్ దళాలు, రష్యా మిలిటరీ మధ్య అసమాన యుద్ధంలో కీలకంగా మారిన డ్రోన్లు. మిలియన్ల డాలర్లు ఖర్చయ్యే రష్యన్ సాయుధ వాహనాలపై ఉక్రెయిన్ సైనిక డ్రోన్లను విజయవంతంగా ఉపయోగించాయి. రష్యాకు సరఫరా వాహనాలు, సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్స్ లాంచర్లను నాశనం చేయడానికి టర్కిష్ బైరక్టార్ TB2 ఉక్రెయిన్ వినియోగించింది. ఉక్రెయిన్ కంపెనీ UA డైనమిక్స్ తయారు చేసిన చిన్న డ్రోన్ పనిషర్కు 4 పౌండ్ల బాంబును మోసుకెళ్లే శక్తి ఉంది. స్విచ్‌బ్లేడ్స్, ప్యూమాస్ అనే 100 చిన్న మిలిటరీ డ్రోన్లను కూడా ఉక్రెయిన్‌కు పంపుతున్న యూఎస్ పేర్కొంది. ఉక్రెయిన్‌లో యుద్ధంలో దాదాపు 1,000 డ్రోన్లు ఉపయోగిస్తున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ సైన్యం డ్రోన్ డెవలపర్లు ప్రత్యామ్నాయాలను కనిపెట్టడంలో నిమగ్నం అయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War