Home /News /international /

RUSSIAN TANK COMMANDER IS SENTENCED TO LIFE FOR KILLING CIVILIAN IN UKRAINE PVN

War crime trial : ఉక్రెయిన్ దూకుడు..పౌరుడిని చంపిన కేసులో రష్యా సైనికుడికి జీవిత ఖైదు

రష్యా సైనికుడికి జీవిత ఖైదు

రష్యా సైనికుడికి జీవిత ఖైదు

Russian commander sentenced to LIFE: ఉక్రెయిన్ దేశంపై ఫిబ్రవరి 24వ రష్యా దాడి ప్రారంభించిన విషయం తెలిసిందే. తమ లక్ష్యం కేవలం ఉక్రెయిన్ మిలిటరీ బేస్‌ లేనని, ఉక్రెయిన్(Ukraine)పౌరులు తమ లక్ష్యం కాదని రష్యా తెలిపింది.

Russian commander is sentenced to LIFE: ఉక్రెయిన్ దేశంపై ఫిబ్రవరి 24వ రష్యా దాడి ప్రారంభించిన విషయం తెలిసిందే. తమ లక్ష్యం కేవలం ఉక్రెయిన్ మిలిటరీ బేస్‌ లేనని, ఉక్రెయిన్(Ukraine)పౌరులు తమ లక్ష్యం కాదని రష్యా తెలిపింది. కానీ, మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత పలుచోట్ల పౌరులూ దుర్మరణం చెందారు. అదీగాక, ఉక్రెయిన్‌పై దండయాత్రలో రష్యా(Russia)బలగాలు అనేక అకృత్యాలకు పాల్పడటం ,ఉక్రెయిన్ సాధారణ పౌరులపైనా దాష్టీకాలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. వీటిని ఉక్రెయిన్ యుద్ధ నేరాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌లో యుద్ధ నేరానికి పాల్పడ్డాడని పేర్కొంటూ ఓ రష్యా సైనికుడికి ఉక్రెయిన్ కోర్టు శిక్ష విధించింది. రష్యా కమాండర్‌ యుద్ధ నేరాలకు పాల్పడ్డాడన్న అభియోగంపై విచారణ చేపట్టిన ఉక్రెయిన్‌ న్యాయస్థానం.. ఆ సైనికుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. యుద్ధ నేరాలపై చేపట్టిన తొలి కేసు విచారణలో భాగంగా సామాన్య పౌరుడిని చంపినందుకు రష్యన్‌ యుద్ధ కమాండర్‌కు ఈ శిక్ష విధించింది. ఉక్రెయిన్‌ దళాలకు పట్టుబడిన మాస్కో సైనికుడు సార్జంట్ వాడిమ్ షిషిమరిన్‌.. ఫిబ్రవరి 28న చుపాఖివ్కాలో 62 ఏళ్ల ఒలెక్సాండర్ షెలిపోవ్‌ను చంపినందుకు ఈ శిక్ష విధించారు.

21 ఏళ్ల సార్జెంట్ వాడిమ్ షిషిమరిన్, ఫిబ్రవరి 28న ఈశాన్య ఉక్రేనియన్ గ్రామమైన చుపాఖివ్కాలో కారులో వెళ్తున్న 62 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపాడు. రష్యా సైనిక అధికారి ఆదేశాల మేరకు నిరాయుధుడైన ఆ వృద్ధుడి తలపై గన్‌తో కాల్పులు జరిపాడు. నిరాయుధుడైన వృద్ధుడ్ని కాల్చి చంపిన నేరాన్ని అతడు ఒప్పుకున్నాడు. తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అలా వ్యవహరించానని తెలిపాడు. దీంతో న్యాయమూర్తి సెర్హి అగాఫోనోవ్ రష్యా సైనికుడికి జీవిత కారాగార శిక్ష విధించారు. ఈ మేరకు సోమవారం తీర్పు వెల్లడించారు. అయితే శిక్ష విధింపు సమయంలో తనను క్షమించమని షెలిపోవ్‌ భార్యను షిషిరిన్‌ అభ్యర్థించాడు. ఈ సమయంలో మీరు ఎవర్ని రక్షించేందుకు ఈ దాడి చేస్తున్నారని షెలిపోవ్‌ భార్య.. షిషిరిన్‌ను ప్రశ్నించారు. తన భర్తను చంపి మమ్మల్ని రక్షిస్తారా అని నిలదీశారు. దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వని రష్యా సైనికుడు.. ఆమెను మరోసారి క్షమించమని అడిగాడు.

ALSO READ  Joe Biden : తైవాన్ జోలికొస్తే అంతే..చైనాకు బైడెన్ డైరెక్ట్ వార్నింగ్..తక్కువ అంచనా వేయొద్దన్న డ్రాగన్

విచారణలో భాగంగా షెలిపోవ్‌ను కాల్చి చంపినట్లు అంగీకరించిన 21 ఏళ్ల షిషిరిన్‌.. తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అలా వ్యవహరించానని తెలిపాడు. తనను క్షమించమని షెలిపోవ్‌ భార్యను షిషిరిన్‌ అభ్యర్థించాడు. మరోవైపు.. తమ దేశంలో రష్యా 11 వేల కంటే ఎక్కువ యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆరోపిస్తున్న ఉక్రెయిన్‌.. వాటిపై దర్యాప్తు చేస్తోంది. చాలామంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌ అదుపులో ఉండడం వల్ల వారిని యుద్ధ నేరాల కింద విచారిస్తోంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Russia-Ukraine War, Ukraine

తదుపరి వార్తలు