Home /News /international /

RUSSIAN SOCIAL MEDIA STAR AND HER HUSBAND DEPORTED FROM BALI STAGING A NUDE PHOTO SHOOT ON A SACRED TREE SK

పవిత్ర స్థలంలో నగ్నంగా ఫొటోలు.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్.. మరీ ఇంత బలుపా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Indonesia: అలీనా ఫజ్లీవా, ఆమె భర్త తమ తప్పును తెలుసుకున్నారు. తెలియక ఈ పొరపాటు జరిగిందని.. ఇండోనేసియా ప్రజలకు క్షమాపణలు చెప్పారు. బాలిలో ఎన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయని.. కానీ వాటి ప్రత్యేకతను చెప్పే బోర్డులు చాలా చోట్ల లేవని పేర్కొంది.

ఇంకా చదవండి ...
  మనం ఎప్పుడూ ఒకే దగ్గర ఉండలేం. ఒకే ఊరు.. ఒకే చోట ఉంటే.. చాలా బోర్ కొడుతుంది. అందుకే అప్పుడప్పుడు ఆహ్లాదం కోసం విహార యాత్రలకు వెళ్తుంటాం. ఇలా వేరొక ప్రాంతానికి వెళ్లినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అక్కడి సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలి. నాకు నచ్చినట్లుగానే ఉంటానంటే కుదరదు. కాదని.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే..ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రష్యాకు చెందిన ఓ జంట కూడా ఇండోనేసియా(Indonesia)లో ఇలాగే చిక్కుల్లో పడింది. పవిత్ర స్థలంలో నగ్నంగా ఫొటోలు దిగడంతో అక్కడి ప్రభుత్వం సీరియస్ అయింది. వారిని వెంటనే.. దేశం నుంచి పంపించివేసింది. ఇండోనేషియాలోని ప్రముఖ హాలిడే ఐలాండ్ బాలి (Bali Trip)లో ఈ ఘటన జరిగింది.

  రష్యాకు చెందిన అలీనా ఫాజ్లీవా ఇన్‌స్టగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాలో ఆమెకు వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచ దేశాలు తిరగడం.. అక్కడి అనుభూతులను సోషల్ మీడియాలో పంచుకోవడం ఈమె హాబీ. ఇటీవల అలీనా ఫాజ్లీవా తన భర్త ఆండ్రీ‌వ్‌తో కలిసి ఇండోనేషియాలో పర్యటించారు. ఈ క్రమంలోనే తబనాన్ జిల్లాలోని ఓ పురాతన ఆలయానికి కూడా వెళ్లారు. ఐతే అక్కడున్న 700 ఏళ్ల నాటి మర్రి చెట్టు దగ్గర అలీనా ఫాజ్లీవా నగ్నంగా పోజులిచ్చింది. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ చిత్రాన్ని అలీనా భర్త ఆండ్రీవ్ తీశారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కడ ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. పవిత్ర స్థలంలో ఇలా పిచ్చివేశాలు వేయడమేంటని మండిపడింది. ఈ క్రమంలోనే వారిని ఇండోనేసియా నుంచి డిపోర్ట్ చేశారు. అంతేకాదు దేశం విడిచి వెళ్లే ముందు ఆ పవిత్ర స్థలాన్ని వారి చేతే శుభ్రం చేయించారు.

  Viral Video: వామ్మో... కుప్పలుగా వేలాడుతున్న పాములు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

  ఈ అంశంపై బాలి గవర్నర్ వేన్ కోస్టర్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చి తమ సంస్కృతి, నాగరికతను అవమానించే విధంగా ప్రవర్తించే పర్యాటకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పవిత్ర స్థలాల్లో వెధవ వేషాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వీరిలాగే గత ఏడాది 200 మందిని బహిష్కరించిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ఇందులో కోవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన వారు కూడా ఉన్నారు.

  Pakistan:తనను తాను గాడిదతో పోల్చుకున్న ఇమ్రాన్ ఖాన్..ఫన్నీగా కామెంట్లు చేస్తున్న నెటిజన్లు

  కాగా, అలీనా ఫజ్లీవా, ఆమె భర్త తమ తప్పును తెలుసుకున్నారు. తెలియక ఈ పొరపాటు జరిగిందని.. ఇండోనేసియా ప్రజలకు క్షమాపణలు చెప్పారు. బాలిలో ఎన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయని.. కానీ వాటి ప్రత్యేకతను చెప్పే బోర్డులు చాలా చోట్ల లేవని పేర్కొంది. అందువల్లే తెలియక తప్పు చేశానని అలీనా ఫజ్లీవా తెలిపింది. తన తప్పును అంగీకరిస్తున్నానని.. పవిత్ర స్థలాల్లో గౌరవప్రదంగా ప్రవర్తించడం చాలా ముఖ్యమని చెప్పింది. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని స్పష్టం చేసింది అలీనా. ఇక గత నెలలో కెనడియన్ నటుడు, వెల్నెస్ గురు జెఫ్రీ క్రెగెన్‌ను కూడా బాలి నుంచి ఇండోనేసియా బహిష్కరించింది. ఈయన కూడా ఓ పవిత్ర స్థలానికి వెళ్లి అక్కడ డాన్స్‌లు చేస్తూ.. రచ్చ రచ్చ చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో.. జెఫ్రీని బాలి నుంచి పంపించివేశారు అధికారులు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Indonesia, International, International news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు