• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • RUSSIAN PRESIDENT PUTIN ALONG WITH PM MODI MAY WITNESS JALLIKATTU IN JANUARY BA

రష్యా టు మధురై... జల్లికట్టుకు చీఫ్ గెస్ట్‌గా పుతిన్?

రష్యా టు మధురై... జల్లికట్టుకు చీఫ్ గెస్ట్‌గా పుతిన్?

జల్లికట్టు, పుతిన్ (ప్రతీకాత్మక చిత్రం)

మొన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడులోని మహాబలిపురాన్ని సందర్శించారు. వచ్చే ఏడాది జనవరిలో జరిగే జల్లికట్టు ఉత్సవాలను వీక్షించేందుకు పుతిన్ తమిళనాడు రానున్నట్టు తెలిసింది.

  • Share this:
    మొన్నటికి మొన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడులోని మహాబలిపురాన్ని సందర్శించారు. అయితే, తాజాగా మరో అంతర్జాతీయ నేత తమిళనాడు బాట పట్టనున్నట్టు సమాచారం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. వచ్చే ఏడాది జనవరిలో జరిగే జల్లికట్టు ఉత్సవాలను వీక్షించేందుకు రానున్నట్టు తెలిసింది. తమిళనాడులోని మధురై జిల్లాలో ఉన్న అలంగనల్లూర్‌ జల్లికట్టు ఉత్సవాలకు ఫేమస్. 2010 సంక్రాంతికి అక్కడ జరగబోయే జల్లికట్టు ఉత్సవాలకు రష్యా ప్రధాని హాజరుకానున్నట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పుతిన్‌తో పాటు ఈ వేడుకలను వీక్షించేందుకు వెళ్తారని మధురై జిల్లాలోని అధికారవర్గాలు చెప్పాయి.

    జల్లికట్టు అనేది తమిళనాడు ప్రజల సంప్రదాయ వేడుకల్లో ప్రధానమైంది. ‘జల్లి’ అంటే చిల్లర నాణేలు అని అర్థం. ‘కట్టు’ అంటే కట్టడం. ఎద్దుల కొమ్ములకు చిల్లర నాణేలు ఓ సంచిలో కట్టి.. వాటిని పట్టుకోవడం అనేది ఈ ఆటలో ప్రధాన అంశం. ఆ తర్వాత అది క్రమక్రమంగా రూపాంతరం చెందింది. ఆటగాళ్లు ఎద్దులను వదిలిపెట్టి.. వాటి మోపురాలను పట్టుకుని ఎంత ఎక్కువసేపు వెళ్లగలరో పరిశీలిస్తుంటారు. ఎక్కువసేపు అలా పట్టుకుని వేలాడేవారిని వీరులుగా పరిగణిస్తూ ఉంటారు.

    జల్లికట్టు పేరుతో ఎద్దులను హింసిస్తున్నారంటూ జంతు ప్రేమికులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఆ ఆటను నిషేధించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు 2016లో ఆదేశించింది. అయితే, దీని మీద తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. చెన్నై మెరీనా బీచ్‌లో భారీ ఆందోళనలు జరిగాయి. తమిళనాడులోని మిగిలిన ప్రాంతాల్లో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి ప్రభుత్వం జల్లికట్టు యధావిధిగా జరుపుకొనేందుకు అనుమతిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తీసుకొచ్చింది.

    ఆ తండ్రి రియల్ బాహుబలి.. కొడుకును ఎలా కాపాడాడో చూడండి..

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు