హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Nobel Prize : నోబెల్ బహుమతి అమ్మేసిన రష్యా జర్నలిస్ట్..ఎందుకో తెలుసా

Nobel Prize : నోబెల్ బహుమతి అమ్మేసిన రష్యా జర్నలిస్ట్..ఎందుకో తెలుసా

రష్యా జర్నలిస్ట్ దిమిత్రి ముర‌తోవ్

రష్యా జర్నలిస్ట్ దిమిత్రి ముర‌తోవ్

Journalist Sells Nobel Prize : కొద్ది నెలలుగా కొనసాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War) కారణంగా ఉక్రెయిన్‌లో వేలాదిమంది చిన్నారులు నిరాశ్రయులైన విషయం తెలిసిందే.

Journalist Sells Nobel Prize :  కొద్ది నెలలుగా కొనసాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War) కారణంగా ఉక్రెయిన్‌లో వేలాదిమంది చిన్నారులు నిరాశ్రయులైన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన చిన్నారులకు సాయంం చేసేందుకు తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace Prize) బంగారు పతకాన్ని రష్యన్ జర్నలిస్ట్(Russian Journalist) అమ్మేశారు. 1999లో స్థాపించబడిన స్వతంత్ర వార్తాపత్రిక నోవాయా గెజిటా ఎడిటర్-ఇన్-చీఫ్ డిమిత్రి మురాటోవ్..ప్రపంచ శరణార్థుల దినోత్సవం రోజున సోమవారం 2021లో గెల్చుకున్న నోబెల్ బహుమతిని వేలంపాటలో పెట్టగా...రికార్డు స్థాయిలో 103.5 మిలియన్ డాలర్లకు(సుమారు 800 కోట్ల‌ు) అది అమ్ముడుపోయింది. ఊహించని రీతిలో మురతోవ్ నోబెల్‌ బహుమతి మరే ఇతర నోబెల్‌ బహుమతులు సాధించని విధంగా వేలంలో రికార్డు స్థాయిలో అత్యధిక ధర పలికింది. 2014లో జేమ్స్ వాట్స‌న్ త‌న నోబెల్ బ‌హుమ‌తిని అమ్మారు. 1962లో గెలిచిన ఆ బ‌హుమ‌తికి అప్ప‌ట్లో అత్య‌ధికంగా 4.76 మిలియ‌న్ల డాల‌ర్లు వ‌చ్చాయి. ఇప్పుడు అత్యధిక ధరకు దిమిత్రి ముర‌తోవ్ నోబెల్ బహుమతి వేలంలో అమ్ముడుపోయింది.

హెరిటేజ్‌ వేలం కంపెనీ ఈ నోబెల్‌ ప్రైజ్‌ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిరాశ్రయులైన పిల్లల కోసం కృషి చేస్తున్న యూనిసెఫ్‌ అందజేస్తామని స్పష్టం చేసింది. వేలంలో వ‌చ్చిన సొమ్ము నేరుగా యునిసెఫ్ అకౌంట్‌లోకి వెళ్తుంద‌ని, ఆ సంస్థ ఉక్రెయిన్ పిల్ల‌ల‌కు ఖ‌ర్చు చేస్తుంద‌ని ముర‌తోవ్ అన్నారు. 2021లో ఫిలిఫ్పీన్స్‌కు చెందిన జ‌ర్న‌లిస్టు మరియా రెస్సాతో కలసి ఈ నోబెల్‌ బహుమతిని గెలుచుకున్నారు ముర‌తోవ్‌. ముర‌తోవ్‌కు ఇచ్చిన నోబెల్ ప్రైజ్‌లో 23 క్యారెట్లకు చెందిన 175 గ్రాములు బంగారం ఉంటుంది.

Israel : ఇజ్రాయెల్ లో మళ్లీ రాజకీయ సంక్షోభం..పార్లమెంట్ రద్దు..3ఏళ్లలో ఐదోసారి ఎన్నికలు

1999లో ర‌ష్యాలో స్వ‌తంత్య్ర ప‌త్రిక నొవాయా గెజిటాను ముర‌తోవ్‌ స్థాపించారు. ఎడిట‌ర్ ఇన్ చీఫ్‌గా చేశారు. అయితే మార్చిలో ఆ ప‌త్రిక‌ను మూసివేశారు.. ఉక్రెయిన్‌పై దాడి నేప‌థ్యంలో ర‌ష్యా త‌మ దేశంలోని జ‌ర్న‌లిస్టుల‌పై కొర‌ఢా రుళిపించిన విష‌యం తెలిసిందే. ఎప్పుడైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగాడో అప్పటి నుంచి రష్యాలోని మీడియా సంస్థలపై మరింత ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో మురాటోవో గెజిటా వార్తాపత్రిక ఉక్రెయిన్‌లో యుద్ధం విషయమై రష్యా దుశ్చర్యను ఎండగడుతూ రాసింది. దీంతో పుతిన్‌ ప్రభుత్వం వరుస హెచ్చరికలను జారీ చేసి తదనంతరం పూర్తిగా ఆ పత్రిక కార్యకలాపాలను నిలిపేసింది.

First published:

Tags: Nobel Prize, Russia, Sellers, Ukraine