ఓ మై గాడ్...మొక్కజొన్న చేనులో ల్యాండైన విమానం....

ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఆకాశంలో పక్షుల గుంపు విమానంపై వైపు దూసుకొచ్చింది. విమాన ఇంజిన్‌లో పక్షులు చిక్కుకుపోవడంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఫ్లైట్‌ని వెంటననే కిందకు దించాల్సిన పరిస్థితి నెలకొంది.

news18-telugu
Updated: August 15, 2019, 10:00 PM IST
ఓ మై గాడ్...మొక్కజొన్న చేనులో ల్యాండైన విమానం....
మొక్కజొన్న చేనులో ల్యాండైన విమానం (Image: cnn)
  • Share this:
రష్యా రాజధాని మాస్కోలో పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్‌లో పక్షులు చిక్కుకోవడంతో  సమీపంలో ఉన్న మొక్కజొన్న తోటలో ఫ్లైట్‌ని ల్యాండ్ చేశారు పైలట్లు. ఈ ప్రమాదంలో 23 మందికి గాయాలయ్యాయని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... ఉరల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన A321 విమానం గురువారం ఉదయం జుకోస్కి ఎయిర్‌పోర్టు నుంచి సింఫరోపోల్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది. ఆ విమానంలో 226 మంది ప్రయాణికులతో పాటు ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు.

ఐతే ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఆకాశంలో పక్షుల గుంపు విమానంపై వైపు దూసుకొచ్చింది. విమాన ఇంజిన్‌లో పక్షులు చిక్కుకుపోవడంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఫ్లైట్‌ని వెంటననే కిందకు దించాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నట్లు ఏటీసీకి సమాచారం ఇచ్చారు పైలట్లు. అనంతరం ఓ మొక్కజొన్న చేనులో విమానాన్ని దించారు. ఈ ఘటనలో 23 మంది గాయాలైనట్లు తెలుస్తోంది. జుకోస్కి కిలోమీటర్ దూరంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.

ల్యాండింగ్ సమయంలో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. గాల్లో పక్షులు విమానాన్ని ఢీకొట్టడం..ఫ్లైట్ ఒక్కసారిగా కిందుకు దూసుకురావడం..వెంటనే మొక్కజొన్న చేనులో ల్యాండవడం.. వెంట వెంటనే జరిగిపోయాయి. ఐతే విమానం క్షేమంగా ల్యాండవడంతో ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై ఏవియేషన్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మొక్కజొన్న తోటలో ల్యాండైన విమానం


First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు