Home /News /international /

RUSSIAN FILM SHOOT TOWARDS SPACE STATION MK GH

Russian film: అంతరిక్షంలో తొలిసారి సినిమా షూటింగ్​.. నింగిలోకి దూసుకెళ్లిన రష్యా నటి, డైరెక్టర్​

(Image: BBC)

(Image: BBC)

‘ది ఛాలెంజ్​’ అనే సినిమా షూటింగ్​లో భాగంగా రష్యాకు చెందిన 37 ఏళ్ల నటి యులియా పెరెసిల్డ్​, డైరెక్టర్​ క్లిమ్​ షిపెంకో నింగిలోకి వెళ్లారు. కాస్మోనాట్​ ఆంటోన్​ ష్కాప్లెరోవ్​ రష్యన్​ సూయెజ్​ స్పేస్​ క్రాఫ్ట్​లో వీరు ప్రయాణించారు.

అంతరిక్షం నేపథ్యంగా చేపట్టే ఏ ప్రయోగమైనా ఆసక్తికరంగా ఉంటుంది. అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? మనుషులు జీవించడానికి వీలవుతుందా? అనే ప్రశ్నలు మన మెదళ్లలో మెదులుతుంటాయి. అందుకే అనేక సైన్స్​ ఫిక్షన్​ సినిమాల్లో అంతరిక్షాన్ని చూపిస్తుంటారు. అయితే నింగిలోకి వెళ్లకుండా, ఇక్కడే సెట్​ వేసి లేదా గ్రాఫిక్స్​ ఉపయోగించి అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ రష్యాకు చెందిన ఓ చిత్ర బృందం పెద్ద సాహసమే చేసింది. నేరుగా అంతరిక్షంలో షూటింగ్​ చేయాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా.. షూటింగ్​ కోసం ఆ సినిమా డైరెక్టర్​, హీరోయిన్​ ప్రత్యేక వ్యోమనౌకలో మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్​ఎస్​)కు బయలుదేరి వెళ్లారు.

‘ది ఛాలెంజ్​’ అనే సినిమా షూటింగ్​లో భాగంగా రష్యాకు చెందిన 37 ఏళ్ల నటి యులియా పెరెసిల్డ్​, డైరెక్టర్​ క్లిమ్​ షిపెంకో నింగిలోకి వెళ్లారు. కాస్మోనాట్​ ఆంటోన్​ ష్కాప్లెరోవ్​ రష్యన్​ సూయెజ్​ స్పేస్​ క్రాఫ్ట్​లో వీరు ప్రయాణించారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.25 గంటలకు కజకిస్థాన్​లోని బైకనూర్​ కాస్మోడ్రోమ్​ నుంచి ఈ స్పేస్​ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది. డైరెక్టర్​, హీరోయిన్​ 12 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండి సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

అంతరిక్ష కేంద్రంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యోమగామిని కాపాడేందుకు భూమి నుంచి ఓ డాక్టర్​ ఐఎస్​ఎస్​కు వెళ్లే సన్నివేశానికి సంబంధించిన షూట్​ అక్కడ జరపనున్నారు. సినిమాలో ఈ సీన్​ దాదాపు 35 నుంచి 40 నిమిషాల పాటు ఉండనున్నట్లు తెలుస్తోంది. డాక్టర్​ ప్రాత్రలో హీరోయిన్​ యులియా నటిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్​ ప్రాత్ర కోసం గతేడాది ఆడిషన్​ నిర్వహించారు. ఇందులో యులియా ఎంపికవ్వగా.. ఆడిషన్​ తర్వాత ఆమె కొంతకాలం శిక్షణ కూడా తీసుకున్నారు.

12 రోజులు అంతరిక్షంలోనే..
ఈ షూటింగ్​ విజయవంతంగా పూర్తయితే అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశంగా రష్యా రికార్డుకెక్కనుంది. హాలీవుడ్ స్టూడియోల్లో కాకుండా నిజంగా ఇలా నటీనటులు అంతరిక్షంలోకి వెళ్లి సినిమా తీయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ సినిమా షూటింగ్​ కోసం నటి యూలియా పెరెసిల్డ్, డైరెక్టర్ క్లిమ్ షిపెంకోలు దాదాపు15 కేజీలు (33 పౌండ్లు) బరువు తగ్గారు.
Published by:Krishna Adithya
First published:

Tags: International

తదుపరి వార్తలు