అయ్యో పాపం.. లైవ్‌లో చనిపోయిన యాక్టర్.. ప్రాణాలు పోతూ అరుస్తుంటే.. అక్కడున్న వాళ్లంతా యాక్టింగే అనుకున్నారు..

ప్రతీకాత్మక చిత్రం

Actor Dies on Stage: 38 సంవత్సరాల Yevgeny Kulesh కూడా అందులో ఉన్నాడు. స్టేజీ మీద బ్యాక్ గ్రౌండ్ మార్చే క్రమంలో అతడు కూడా సాయం చేస్తున్నాడు. అయితే, ఆ సమయంలో ఇనుప గేటు లాంటిదాని కింద పడిపోయాడు. ధియేటర్లో కూర్చుని చూస్తున్న జనం అంతా కూడా ఇదేదో నాటకంలో భాగం అనుకున్నారు.

 • Share this:
  Actor dies on Stage: చాలా మంది నటులు తాము మేకప్‌లో ఉండగానే చనిపోవాలని కోరుకుంటారు. అది వారు గర్వంగా భావిస్తారు. నటన అంటే వారికి అంత ఇష్టం. సినిమా నటులు, సీరియల్ నటులు, స్టేజీ నటులు ఎవరైనా సరే అది తమకు దక్కిన గౌరవంగా భావిస్తారు. నటన మీద వారికి ఉండే మమకారం అది. అయితే, అనుకోకుండా ఓ వ్యక్తి ఏకంగా స్టేజీ మీదే ప్రాణాలు కోల్పోయాడు. స్టేజీలో సీన్ కోసం మార్పులు చేస్తున్న సమయంలో ఓ పెద్ద ఇనుప గేటు లాంటి దాని కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అతడు నేల మీద పడి రక్తం కారుతూ అరుస్తూ తన ప్రాణాలు కాపాడండంటూ అరుస్తుంటే అక్కడ చూస్తున్న వారు మాత్రం అది కూడా నటనలో భాగమే అనుకున్నారు. కానీ, చివరికి స్టేజీ మీద యాక్టింగ్ చేస్తున్న వారు గమనించి అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ప్రాణాలు పోయాయి.

  అసలు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. రష్యాలోని ఫేమస్ బోల్సోయ్ ధియేటర్‌లో జరిగింది. అక్కడ స్టేజీ మీద ఓ నాటకం వేస్తున్నారు. నాటకం రసవత్తరంగా సాగుతోంది. చాలా మంది ఈ నాటకం చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆ సీన్ అయిపోయిన తర్వాత నెక్ట్స్ సీన్ కోసం అందులో ఉండే నటులు స్టేజీ వెనుక కొన్ని మార్పులు చేస్తున్నారు.

  Adulterated Oil: మీరు వాడే వంట నూనె కల్తీదా? కాదా? తెలుసుకోవాలా.. అయితే ఈ సింపుల్ చిట్కాలు తెలుసుకోండి..  38 సంవత్సరాల Yevgeny Kulesh కూడా అందులో ఉన్నాడు. స్టేజీ మీద బ్యాక్ గ్రౌండ్ మార్చే క్రమంలో అతడు కూడా సాయం చేస్తున్నాడు. అయితే, ఆ సమయంలో ఇనుప గేటు లాంటిదాని కింద పడిపోయాడు. ధియేటర్లో కూర్చుని చూస్తున్న జనం అంతా కూడా ఇదేదో నాటకంలో భాగం అనుకున్నారు. అయితే, అతడు దాని కింద పడిపోయిన విషయాన్ని గమనించిన స్టేజీ మీద వ్యక్తులు వెంటనే పెద్దగా అరవడంతో స్టేజీ తెరలు మూసేశారు.

  అడుక్కోడానికి సెలవు కోరిన ప్రభుత్వ ఉద్యోగి -గత జన్మ గుర్తుకురావడంతో -Asaduddin నకులుడు, Mohan Bhagwat శకుని అంటూ..  ధియేటర్ మేనేజ్‌మెంట్ వెంటనే ఆంబులెన్స్ తీసుకొచ్చి అతడిని ఆస్పత్రికి తరలించింది. కానీ ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. అతడు కింద పడి అరుస్తుంటే జనం అదేదో కామెడీ అనుకుని వీడియోలు కూడా తీశారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి.

  Dussehra Offer: దసరా బొనాంజా.. చికెన్ బిర్యానీ, రెండు కిలోల మటన్, మద్యం ఉచితం.. ఇంకా రూ.2 వేలు కూడా..  ఘటన జరిగిన వెంటనే ధియేటర్ యాజమాన్యం అలర్ట్ ప్రకటించింది. అందరూ జాగ్రత్తగా బయటకు వెళ్లాలని సూచించింది. ఓ ప్రమాదం జరిగిందని, అయితే, ఎవరూ భయపడవద్దని సూచించింది. నటుడు ప్రాణభయంతో అరుస్తున్న వీడియోను తీసిన జనం అది నిజమని తెలిసిన వెంటనే పెద్దగా అరుస్తూ బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేశారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: