హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia Warning : ఆ ఆలోచనలుంటే మానుకోండి.. పుతిన్ సీరియస్ వార్నింగ్

Russia Warning : ఆ ఆలోచనలుంటే మానుకోండి.. పుతిన్ సీరియస్ వార్నింగ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Russia Warning To Sweden And Finland : నాటో(NATO)కూటమిలో చేరిక విషయమై స్వీడ‌న్‌, ఫిన్లాండ్ దేశాల‌కు రష్యా(RUSSIA)తీవ్ర‌మైన హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. నాటోలో చేరాల‌న్న ఉద్దేశం స‌రికాద‌ని, కాద‌ని ప్ర‌య‌త్నాలు చేస్తే.. రాబోయే ప‌రిణామాల‌కు బాధ్య‌త వ‌హించాల్సి వుంటుంద‌ని పుతిన్ సర్కారు ఆ దేశాలను తీవ్రంగా హెచ్చ‌రించింది.

ఇంకా చదవండి ...

Russia Warning To Sweden And Finland : నాటో(NATO)కూటమిలో చేరిక విషయమై స్వీడ‌న్‌, ఫిన్లాండ్ దేశాల‌కు రష్యా(RUSSIA)తీవ్ర‌మైన హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. నాటోలో చేరాల‌న్న ఉద్దేశం స‌రికాద‌ని, కాద‌ని ప్ర‌య‌త్నాలు చేస్తే.. రాబోయే ప‌రిణామాల‌కు బాధ్య‌త వ‌హించాల్సి వుంటుంద‌ని పుతిన్ సర్కారు ఆ దేశాలను తీవ్రంగా హెచ్చ‌రించింది. నాటో సభ్యత్వానికి ఇరు దేశాల్లో మద్దతు పెరుగుతుండడంతో రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఈ తాజా హెచ్చరిక చేశారు. డెమోస్కోప్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన సర్వే ప్రకారం..నాటో మిలిటరీ కూటమిలో స్వీడన్(SWEDEN)సభ్యత్వానికి ఇప్పుడు దేశంలోని 57 శాతం జనాభా మద్దతు ఉంది, మార్చిలో ఇది 51 శాతంగా ఉండింది. ఈ నేపథ్యంలోనే నాటో కూటమిలో చేరిక విషయమై స్వీడన్,ఫిన్లాండ్ దేశాలను రష్యా హెచ్చరించింది. ఈ విష‌యాన్ని ద్వైపాక్షిక చ‌ర్చ‌ల ద్వారా, బ‌హిరంగంగా కూడా ఇప్ప‌టికే చెప్పామ‌ని ర‌ష్యా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి మారియా జ‌ఖ‌రోవా పేర్కొన్నారు.

ఈ ప్ర‌క‌ట‌న‌ను చూసి ఏమీ ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేద‌ని, ద్వై పాక్షిక చ‌ర్చ‌ల స‌మ‌యంలోనూ, బ‌హిరంగంగాను ఇప్పటికే ఆ దేశాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ర‌ష్యా మాజీ ప్రెసిడెంట్ దిమిత్రీ మొద్వేదేవ్ కూడా ఇదే విష‌యాన్ని తెలిపారు. స్వీడ‌న్‌, ఫిన్లాండ్ దేశాల‌ను నాటోలో చేర్చాల‌ని ప్ర‌యత్నాలు చేస్తే తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి వుంటుంద‌ని అమెరికా, యూరోపియ‌న్ యూనియ‌న్ల‌ను ఆయ‌న హెచ్చ‌రించారు. బాల్టిక్ దేశాలు, స్కాండినోవియా ప్రాంతాల్లో అణ్వాయుధాల‌ను కూడా మోహ‌రిస్తామ‌ని దిమిత్రీ సూటిగా హెచ్చ‌రించారు.

ALSO READ Russian Foreign Minister: " జైశంకర్ నిజమైన దేశ భక్తుడు".. భారత విదేశాంగ మంత్రిపై రష్యా ప్రశంసలు..

మరోవైపు, ఉక్రెయిన్ పై రష్యా(RUSSIA-UKRAINE WAR)తన దండయాత్రను కొనసాగిస్తోంది. . ఇప్పటికే బాంబులు,క్షిపణులు, విమానాల దాడులతో ఉక్రెయిన్ తన రూపు రేఖలను కోల్పోయింది. ఇప్పటికే కీవ్, మేరియుపోల్, లివివ్,ఖర్కీవ్ లపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ ప్రధాన నగరాలలో ఒకటైన మేరియుపోల్ ను రష్యా ఆక్రమించుకుంది. అక్కడి ప్రధాన ప్రాంతాలలోని భవనాలను రష్యా బాంబులతో నెలమట్టం చేసింది. కానీ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ ఉక్రెయిన్ సైనికులు, రష్యాను నిలువరిస్తున్నారు. వారు దాడులకు గట్టిగా తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో రష్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికైన మేరియుపోల్ లో ఉన్న మిగతా సైనికులు లొంగిపోవాలని ఆదేశించింది. అదే విధంగా, వారిని జెనివా ఒప్పందం ప్రకారం, పునారావాసం కల్పిస్తామని తెలిపింది. దీనిపై ఉక్రెయిన్ ఘాటుగా స్పందించింది. లొంగిపోయే ప్రసక్తేలేదని తెల్చిచెప్పింది. మేరియు పోల్ ను రకించుకునేందుకు తాము.. చివరి వరకు పోరాడతామని ఉక్రెయిన్ అధ్యకుడు జెలెన్ స్కీ తెలిపారు. మేరియుపోల్ లో ఉన్న సైనికులపై రష్యా మారణ కాండను కొనసాగిస్తుందని జెలెన్ స్కీ తెలిపారు. రష్యను ఎదుర్కొవడానికి తమకు మరిన్ని ఆయుధ సహాకారం కావాలని జెలెన్ స్కీ ప్రపంచ దేశాలను అభ్యర్థించారు.

First published:

Tags: Russia, Russia-Ukraine War, Sweden, Vladimir Putin

ఉత్తమ కథలు