హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Nuclear Bombs: ప్రపంచంలో ఉన్న అణుబాంబులన్నీ ఒకేసారి పేలితే ఏం జరుగుతుందో తెలుసా..?

Nuclear Bombs: ప్రపంచంలో ఉన్న అణుబాంబులన్నీ ఒకేసారి పేలితే ఏం జరుగుతుందో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nuclear Weapons: ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాలన్నీ ఒకేసారి పేలితే ఏం జరుగుతుంది? ఎంతటి విధ్వంసం జరుగుతుందో తెలుసా..?

ఇప్పుడు యావత్ ప్రపంచం ఉక్రెయిన్, రష్యా యుద్ధం (Russia-Ukraine War) గురించే చర్చించుకుంటోంది. ఎంతో అందంగా ఉండే ఉక్రెయిన్.. బాంబుల వర్షంతో అంధ విహీనంగా మారింది. సైనికులతో పాటు సామాన్య పౌరుల ప్రాణాలు కూడా పోతున్నాయి. దాదాపు వారం రోజులుగా సాగుతున్న యుద్ధంతో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. రష్యా వైపు కూడా బాగానే నష్టం జరిగింది. ఐనప్పటికీ పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ అంతు చూసే దాకా వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని అంటున్నారు. నాటో దేశాలు కూడా ఉక్రెయిన్‌కు అండగా ఉండడం, రష్యాపై ఈయూ ఆంక్షలు విధించడంతో పుతిన్ నెెక్ట్స్ ఏం చేయబోతున్నారని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అణు బాంబులను యాక్టివేట్ చేయాలని చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

Putin : న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేస్తున్న రష్యా..ఐరాస భద్రతా మండలి నుంచి రష్యా తొలగింపు!

అణుబాంబులు ఎంత ప్రమాదకరమో మనకు బాగా తెలుసు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణ్వాయుధాలతో దాడి చేసింది. ఆ విధ్వంసం నుంచి కోలుకోవడానికి కొన్ని దశాబ్ధాల సమయం పట్టింది. మరి ఇప్పుడు ఒకవేళ అణు బాంబులతో దాడి చేస్తే.. అవి ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో ఊహించడానికికే భయంగా ఉంది. ఒక్క బాంబుతోనే ఎంతో వినాశనం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న అణుబాంబులన్నీ ఒకేసారి పేలితో.. ఏం జరుగుతుంది? ఈ ప్రపంచం ఏమవుతుంది..? భూమి తట్టుకోగలదా..?

US-Russia: రష్యాకు బిగ్ షాక్.. అమెరికా సంచలన నిర్ణయం.. పుతిన్‌కు చుక్కలే..

అణు శక్తిని దుర్వినియోగం చేస్తే భూమి ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందో... Kurzgesagt అనే యూట్యూబ్ ఛానెల్ ఓ వీడియోలో వివరించింది. 2019లో పబ్లిష్ అయిన ఆ వీడియోలో అణ్వాయుధాలకు సంబంధించి ఎంతో ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. ఆ యానిమేటెడ్ మార్చి, 2019లో పోస్ట్ చేయబడింది. ఆ సమయంలో ప్రపంచం మొత్తం మీద మొత్తం 15,000 అణు బాంబులు ఉన్నాయి. ఈ అధ్యయనం ప్రకారం.. 15,000 బాంబులలో 3 బాంబులు పేలితే.. ఒక నగరం నేలమట్టమవుతుంది. అంటే ఈ భూమి మీద ఉన్న 4,500 నగరాలను నాశనం చేయడానికి 13,500 అణు వార్‌హెడ్‌లు సరిపోతాయి. మొత్తం 15,000 అణు బాంబుల ప్రభావం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అగ్నిపర్వతం క్రాకటోవా కంటే 15 రెట్లు ఎక్కువ విధ్వంసకరమని ఆ వీడియోలో పేర్కొన్నారు. Kurzgesagt కథనం ప్రకారం.. ఆ బాంబులన్నీ ఒకేసారి పేలితే.. దాని ప్రభావం వల్ల మానవ జాతి మొత్తం అంతం అవుతుంది.

' isDesktop="true" id="1220096" youtubeid="JyECrGp-Sw8" category="international">

మొత్తం 15,000 బాంబులను ఒకే స్థలంలో ఒకేసారి పేల్చితే.. 31 మైళ్ల వెడల్పుతో అగ్నిగోళం ఏర్పడుతుంది. 1865 మైళ్ల వరకు ఉన్న ప్రాంతం ధ్వంసమయ్యేంతగా భారీ పేలుడు సంభవిస్తుంది. ఈ పేలుడు శబ్దం దాదాపు ప్రపంచమంతటా వినిపిస్తుంది. పేలుడు నుంచినుండి ఉత్పన్నమయ్యే పుట్టగొడుగుల వంటి మేఘం చాలా ఎత్తుగా, పెద్దదిగా ఉంటుంది. అంతరిక్షాన్ని తాకేంతలా ఎగిసిపడుతుంది. దాదాపు 50 కి.మీ. ఎత్తు వరకు వెళ్తుంది. ఒకవేళ ఈ పేలుడు అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో జరిగితే.. దక్షిణ అమెరికా మొత్తం అగ్నిగోళంలా మారుతుంది. పేలుడు తర్వాత వెలువుడే రేడియేషన్.. చుట్టూ ఉన్న ప్రతిదానినీ నాశనం చేస్తుంది. మనుషులను మిగలరు. అడవిలోని జంతువులు, చెట్టూపుట్టా ఏమీ మిగలదు. దాని దుష్ప్రభావం వందల మైళ్ల వరకు కనిపిస్తుంది. ఇంతటి వినాశనం జరుగుతుంది కాబట్టే.. చాలా దేశాలు యుద్ధాన్ని కోరుకోవు. అణబాంబుల జోలికి అసలు వెళ్లరు. కానీ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్న లాంటి వాళ్లు అణ్వాయుధాలను పక్కన పెట్టుకొని.. ప్రపంచ దేశాలను వణికిస్తున్నారు.

First published:

Tags: International news, Russia, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు