చర్చలకు రెండు దేశాలూ అంగీకారించడంతో ఉక్రెయిన్-రష్యా (Ukraine-Russia) మధ్య కొనసాగుతోన్న యుద్దంలో శాంతి కిరణం ఉదయించింది. కానీ మరునిమిషంలోనే అణు యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన సంచలన ప్రకటనతో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా ముసురుకున్నట్లయింది. అసలు ఉక్రెయిన్‌లో పరిస్థితి ఏంటీ అనేది చాలా మందికి అంతు చిక్కడం లేదు. ముఖ్యంగా ఉక్రెయిన్ సారవం తమైన నేలలతో కూడిన మైదాన ప్రాం తం . రష్యా నుం చి ఆక్రమణలను అడ్డుకొనే ప్రకృ తి సహజమైన పర్వతాల వం టి అడ్డుకట్టలు లేవు. దీం తో దాడులు ప్రారంభిం చిన కొన్ని గం టల్లోనే రష్యా సాయుధ వాహనాలు సరిహద్దులు దాటి ఉక్రెయిన్‌లోని కీలక నగరాలకు చేరుకొన్నా యి. కానీ, ఇక్క డ వారికి అసలైన ప్రతిఘటన ఎదురవుతోం ది. ప్రజలే తిరుగుబడి దాడులు చేయడం.. సాయుధులుగా మారడంతో సైనికులు ఇరుకున పడుతున్నారు.
Russia-Ukraine War: "అంతర్జాతీయ దళం".. అప్పుడు హిట్లర్.. ఇప్పుడు పుతిన్‌ను ఓడిద్దాం: ఉక్రెయిన్
ఈ పోరాటంలో రష్యాకు నగరాల స్వాధీనం చాలా కష్టతరంగా మారింది. గతంలోనూ ప్రభుత్వా లను కూలదోయడానికి నగరాలను స్వా ధీనం చేసుకొం టుం టారు. ముఖ్యం గా రెబల్స్ ఆధీనం లోని 2014లో డాన్బాస్ ప్రాం తం లోని ఇలోవైస్క్ ప్రాం తాన్ని స్వా ధీనం చేసుకోవడానికి ఉక్రెయిన్ దళాలకు దాదాపు 50 రోజులు పట్టిం ది. 2016 అక్టోబర్ నుం చి ఇరాక్‌లోని మొసూల్ స్వా ధీనం చేసుకొవడానికి అమెరికా సం కీర్ణ దళాలు 2017 జనవరి వరకు పోరాడాల్సి వచ్చిం ది. ఇప్పుడు రష్యా పరిస్థితి భిన్నాంగా ఏం లేదు. ప్రజల తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. సైన్యం సామర్థ్యం వారికి లేకున్నా.. తమ పరిధిలో రష్యాను ముప్పు తిప్పలు పెడుతున్నారు.
ఆయుధాల మద్దతు..
అంతర్జాతీయంగా ఉక్రెయిన్‌తో పాటు ఎవరూ యుద్ధం చేయడం లేదు. కానీ అన్ని రకాల సహాయం అందజేస్తున్నారు. ఆయుధాల దండిగా ఉక్రెయిన్‌కు చేరుకొంటున్నాయి. సోవియట్ సేనలను అఫ్గానిస్థాన్‌ను ఓడిం చడానికి
అమెరికా (America) అక్క డి ముజాహిద్దీన్లకు భారీగా చిన్న ఆయుధాలనే ఇచ్చిం ది. ఓ రకం గా తాజాగా ఉక్రెయిన్‌లో అదే వ్యూహం అనుసరిస్తోం ది. దీని ద్వారా రష్యా పరిస్థితి ఇరకాటంలో పడింది. తీవ్రంగా ప్రతిఘటించకుంటే యుద్ధం ముగిసేలా లేదు.
ప్రాణ నష్టం తప్పదా..
ఇలానే నగరాల్లో ప్రతిఘటన మొదలైతే.. రష్యా తీవ్రంగా తీసుకొనే అవకాశం ఉంది. దీని ద్వారా సాధారణ ప్రజలు ఈ పోరాటాల్లో తీవ్రం గా నష్టపోయే అవకాశం ఉంది. ఇరాక్, సిరియా యుద్ధాల్లో 70శాతం ప్రాణ నష్టం పట్టణాల్లో చోటు చేసుకొం ది. ఈ ప్రాణ నష్టం లో కూడా 90శాతం భారీ బాం బులు, క్షిపణులు, శతఘ్ను లు వాడకం కారణం గా చోటు చేసుకొంది. ఇప్పుడు ఈ పట్టణాలు రష్యాకు లొంగకుంటే ప్రాణనష్టం తప్పేలా లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War, Ukraine